breaking news
villagers ralley
-
ఆయనే లేకుంటే రక్తం ఏరులై పారేది..
సాక్షి, చెన్నై: డీఎంకే ఎమ్మెల్యే ఇదయవర్మన్‌కు మద్దతుగా చెంగోడు గ్రామం కదిలింది. ఆయనే లేకుంటే గ్రామంలో రక్తం ఏరులై పారి ఉండేదని, ఆయన్ను విడుదల చేయాలని పట్టుబడుతూ పోలీస్‌స్టేషన్ ఎదుట మంగళవారం గ్రామస్తులు బైటాయించారు. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని చెంగోడు గ్రామంలో డీఎంకే ఎమ్మెల్యే ఇదయ వర్మన్ ఫైరింగ్ వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. స్థల వివాదం ఈ ఫైరింగ్‌కు కారణంగా ఉన్నా, ఎమ్మెల్యేను అధికార పక్షం టార్గెట్ చేసింది. నకిలీ తుపాకుల్ని కల్గినట్టుగా పేర్కొంటూ, కేసులు నమోదుచేసిన కటకటాల్లోకి ఎమ్మెల్యేను నెట్టారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం చెంగోడు గ్రామం ఏకమైంది. ఎమ్మెల్యేకు మద్దతుగా పోలీసుస్టేషన్ వైపు కదిలారు. (పరిస్థితి ఉద్రిక్తం.. ఎమ్మెల్యే ఫైరింగ్) తిరుప్పోరూర్ పోలీసు స్టేషన్‌ఎదుట గ్రామస్తులు బైటాయించారు. ఎమ్మెల్యేను విడుదల చేయాలని నినదిస్తూ ఆందోళన చేపట్టారు. కరోనా సమయంలో నిరసనలు వద్దు అని పోలీసులు వారించినా, గ్రామస్తులు ఏ మాత్రం తగ్గలేదు. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరాన్ని అనుసరిస్తూ నిరసనకు దిగారు. అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత కుమార్ మద్దతుదారులు, కిరాయి ముఠాలు సంఘటన జరిగిన రోజున కత్తులు, కర్రలతో వీరంగం సృష్టించాయని గ్రామస్తులు గుర్తు చేశారు. ఎమ్మెల్యే తండ్రి లక్ష్మీ పతి ప్రశ్నించగా, హతమార్చేంతగా పరిస్థితి చోటుచేసుకుందని, తమపై కత్తులతో కిరాయి ముఠా దూసుకొచ్చిందని, ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే ఇదయవర్మన్ కాల్పులు జరపకుండా ఉండి ఉంటే, గ్రామంలో ఈ పాటికి రక్తం ఏరులై పారి ఉండేదని, పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుని ఉండేదని చెంగోడు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై పెట్టిన కేసును ఎత్తి వేయాలని నినదిస్తూ గ్రామస్తులు బైటాయించడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. (చెత్తకుప్ప పక్కనే అందమైన అమ్మాయిని చూసి..) -
పోలీసుల తాట తీస్తాం..
సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్: అమరావతి ప్రాంత ప్రజల్లో భావోద్వేగాలు రగిలించేలా టీడీపీ నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. అతిగా ప్రవర్తిస్తే పోలీసుల తాట తీస్తాం అని హెచ్చరిస్తున్నారు. రంగులు వేస్తే కేసులు నమోదు చేస్తారా? అని మండిపడుతున్నారు. అమరావతి ప్రాంతంలో ప్రజలంతా రోడ్లపైకి రావాలి అంటూ ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో వంటావార్పు నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. అనంతరం రిలే దీక్షల్లో కూర్చున్నారు. గ్రామ సచివాలయాలకు నల్ల రంగులేస్తే కేసులు నమోదు చేస్తారా? అతిగా ప్రవర్తిస్తే పోలీసుల తాట తీస్తాం అని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. కాగా, మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. -
ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు ర్యాలీ
కర్నూలు(పాణ్యం): గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని కొండజూడూరు గ్రామంలో రూ. 900 కోట్లతో 150 ఎకరాల్లో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ఇటీవల అధికారులు భూ సర్వే నిర్వహించారు. దీనిని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.