breaking news
Vigllience officials
-
నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్లదే బాధ్యత
కురవి : రైతులకు నకిలీ మిరప విత్తనాలు అమ్మితే కంపెనీ ప్రతినిధులు వచ్చే వరకు డీలర్లే (ఫెర్టిలైజర్ షాపుల యాజమానులు) బాధ్యత వహించాల్సి ఉంటుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం-వరంగల్ జిల్లాల డీఎస్పీ వెంకటరెడ్డి అన్నారు. కురవి మండల కేంద్రంలోని పలు విత్తన, ఎరువుల దుకాణాలను సోమవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మండల కేంద్రంలోని శ్రీసాయి, ఆంజనేయ, వాసవి, వెంకటేశ్వర ఎరువులు, విత్తనాల షాపుల్లో తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు మిరప విత్తనాల్లో సీఎస్-333, గ్రీన్ఎరా, కల్యాణిసగాట అనే రకాల కంపెనీల విత్తనాలు నకిలీవిగా తేలినట్లు తెలిపారు. అయితే, ఆయా విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేయడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. కాగా, రైతులు తాము నష్టపోయిన వివరాలపై మండల వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తనిఖీలో ఎస్సై వెంకటేశ్, ఏఓ సారయ్య, కురవి ఏఓ మంజుఖాన్ పాల్గొన్నారు. -
విజిలెన్స్ అదుపులో దళారీ..
తిరుమల: తిరుమల తిరుపతిలో శనివారం ఓ దళారీని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి ఫేక్ దర్శనాలు, వైకుంఠ ఏకాదశి టికెట్లు, తిరుప్పావడ సేవా టికెట్లను బ్లాక్లో విక్రయించినట్టు మల్లికార్జున్ అనే దళారీపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యుడు సాయన్న సిఫారసు లేఖపై మల్లికార్జున్ టిక్కెట్లను పొందినట్టు తెలిసింది. ఈ టిక్కెట్ల విక్రయంలో దళారీకి బోర్డు సభ్యుడు సాయన్న పీఆర్వో నాగరాజు కూడా సహాకరించినట్టు తమ విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. దాంతో దళారీ మల్లికార్జున్ను తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్టు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.