నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్లదే బాధ్యత | duplicate mirchi dont sail dealars | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్లదే బాధ్యత

Oct 4 2016 12:46 AM | Updated on Sep 4 2017 4:02 PM

రైతులకు నకిలీ మిరప విత్తనాలు అమ్మితే కంపెనీ ప్రతినిధులు వచ్చే వరకు డీలర్లే (ఫెర్టిలైజర్‌ షాపుల యాజమానులు) బాధ్యత వహించాల్సి ఉంటుందని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఖమ్మం-వరంగల్‌ జిల్లాల డీఎస్పీ వెంకటరెడ్డి అన్నారు. కురవి మండల కేంద్రంలోని పలు విత్తన, ఎరువుల దుకాణాలను సోమవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

కురవి : రైతులకు నకిలీ మిరప విత్తనాలు అమ్మితే కంపెనీ ప్రతినిధులు వచ్చే వరకు డీలర్లే (ఫెర్టిలైజర్‌ షాపుల యాజమానులు) బాధ్యత వహించాల్సి ఉంటుందని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఖమ్మం-వరంగల్‌ జిల్లాల డీఎస్పీ వెంకటరెడ్డి అన్నారు. కురవి మండల కేంద్రంలోని పలు విత్తన, ఎరువుల దుకాణాలను సోమవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మండల కేంద్రంలోని శ్రీసాయి, ఆంజనేయ, వాసవి, వెంకటేశ్వర ఎరువులు, విత్తనాల షాపుల్లో తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు మిరప విత్తనాల్లో సీఎస్‌-333, గ్రీన్‌ఎరా, కల్యాణిసగాట అనే రకాల కంపెనీల విత్తనాలు నకిలీవిగా తేలినట్లు తెలిపారు. అయితే, ఆయా విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేయడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. కాగా, రైతులు తాము నష్టపోయిన వివరాలపై మండల వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తనిఖీలో ఎస్సై వెంకటేశ్‌, ఏఓ సారయ్య, కురవి ఏఓ మంజుఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement