breaking news
Victor bike
-
టీవీఎస్ విక్టర్ ప్రీమియం బైక్..బడ్జెట్ ధర
సాక్షి, ముంబై: ప్రముఖ టూవీలర్ మేకర్ టివిఎస్ మోటార్ కొత్త విక్టర్ ప్రీమియం ఎడిషన్ బైక్‌ను లాంచ్ చేసింది . మేటీ సిరీస్‌లో కొత్త విక్టర్ ప్రీమియం ఎడిషన్‌ను మంగళవారం విడుదల చేసింది. రెండు కొత్త రంగుల్లో , అదనపు ఫీచర్లతో బడ్జెట్ ధరకే అందిస్తోంది. మాటీ బ్లూ విత్ వైట్గ్రాఫిక్స్, మాటీ సిల్వర్ విత్ రెడ్ గ్రాఫిక్స్‌తో రూ. 55,890 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కి ధరకే లభిస్తుంది. 110సీసీ బైక్ సెగ్మెంట్లో విభాగంలో సెప్టెంబరు 2017 లో లాంచ్ చేసిన టివిఎస్ విక్టర్ కొత్త ప్రీమియం ఎడిషన్‌లో న్యూస్టయిల్తో కొత్త ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా మెకానికల్ పెద్దగా మార్పులేమీ చేయకపోయినప్పటికీ బైక్స్ విభాగంలో బేసిక్ ఫీచర్ఆప్షనల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో పాటు కొత్త గ్రాఫిక్స్ జోడించి అవుట్‌లుక్‌ను అప్ డేట్ చేసింది. కొత్త ప్రీమియమ్ ఎడిషన్‌లో 3 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజీన్, ఫోర్-స్పీడ్ గేర్ బాక్స్ 9.5పీఎస్ పవర్, 9.4ఎన్ఎం టార్క్‌ను తదితర ఫీచర్లను అందిస్తుంది. లీటర్‌కు 72 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. -
టీవీఎస్ మోటార్ నుంచి కొత్త ‘విక్టర్’
ప్రారంభ ధర రూ.49,490 న్యూఢిల్లీ: ప్రముఖ టూవీలర్ కంపెనీ టీవీఎస్ మోటార్ తాజాగా కొత్త అప్డేటెడ్ ‘విక్టర్’ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.49,490- రూ.51,490గా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ బైక్‌లో అడ్వాన్స్డ్ త్రీ వాల్వ్ ఎకోథ్రస్ట్ ఇంజిన్, ఎలక్ట్రిక్ స్టార్ట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇది లీటరుకు 76 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుందని పేర్కొంది. 2002లో మొదటిసారిగా మార్కెట్లోకి తీసుకువచ్చిన విక్టర్ బైక్‌లో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వస్తున్నామని కంపెనీ తెలిపింది. కస్టమర్లకు స్టైలిష్‌గా, అధునాతన టెక్నాలజీతో కూడిన బైక్‌ను అందించడంలో ముందుంటామని పేర్కొంది.