breaking news
venkayya
-
పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి
-
రైతులకు 21వేల కోట్ల రుణాలు
-
రైతులకు 21వేల కోట్ల రుణాలు
- నాబార్డ్‌కు కేంద్రం అనుమతి - అరువుపై ఎరువులు అమ్మాలని కంపెనీలకు ఆదేశం న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో రైతులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయాలు ప్రకటించింది. రబీ సీజన్ నేపథ్యంలో రైతులు సులువుగా రుణం పొందేలా, నగదు లభ్యత కోసం సహకార సంఘాల ద్వారా రూ. 21 వేల కోట్లు రైతులకు ఇచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబారు)్డకు అనుమతినిచ్చింది. సహకార సంఘాల నుంచే 40 శాతంపైగా చిన్న రైతులు పంట రుణాలు పొందుతున్నారని, వారికి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ బుధవారం చెప్పారు. ఆన్లైన్ బుకింగ్‌పై రైల్వే ఇప్పటికే సర్వీసు చార్జీ రద్దు చేసిందని, డిసెంబర్ 31దాకా ఉచిత మొబైల్ బ్యాంక్ సేవలు వినియోగించుకునేందుకు టెలికం ఆపరేటర్లు అంగీకరించారన్నారు. అరువుపై ఎరువులు అమ్మండి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు తగినంత నగదును అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ, బ్యాంకులకు సూచించామని, రబీ సీజన్లో పంట రుణాలు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు ఇబ్బంది పడకుండా చూస్తామని దాస్ పేర్కొన్నారు. నగదు లభ్యత, బ్యాంకు సేవలు లేని చోట్ల అరువుపై ఎరువులు అమ్మాలంటూ తయారీ కంపెనీలను కేంద్రం ఆదేశించిందన్నారు. రైతుల నుంచి చెక్కు, డెబిట్, క్రెడిట్ కార్డు రూపంలో సహకార సంఘాలు, డీలర్లు, ఇతర రిటైలర్లు కొనుగోళ్లు జరిపేందుకు కంపెనీలు సహకరించాలని కోరారు. ఎరువులకు క్రెడిట్, డెబిట్ కార్డులు క్రెడిట్, డెబిట్ కార్డులు, చెక్కుల ద్వారా రైతులు ఎరువులు కొనుగోలు చేసేందుకు అన్ని సహకార సంఘాలు, ప్రైవేట్ రిటైలర్లు, హోల్‌సేల్ వర్తకులు అనుమతించేలా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వ్యవసాయ కమిషనర్లకు కేంద్రం సూచించిందని శక్తికాంత దాస్ తెలిపారు. టోల్ వసూలుకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు ఎలక్ట్రానిక్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్‌యూలు) కేంద్రం కోరింది. కొత్తగా మార్కెట్లో విడుదల చేసే వాహనాలకు డిజిటల్ ఆర్ఎఫ్ఐడీ(రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ట్యాగ్ ఏర్పాటు చేయాలని ఆటోమొబైల్ కంపెనీలను ఆదేశించామని శక్తికాంత్ చెప్పారు. దీనివల్ల టోల్ ప్లాజాలు, చెక్‌పోస్టుల వద్ద నగదు రహిత చెల్లింపులకు వీలవుతుందని చెప్పారు. టోల్ ప్లాజాల గుండా వాహనాలు వెళ్లినప్పుడు దానంతట అదే ఆర్ఎఫ్ఐడీ కార్డు నుంచి టోల్ మొత్తం వసూలవుతుంది. ఉద్యోగులకు డిజిటల్ చెల్లింపులు ‘తమ ఉద్యోగులకు ప్రీపెరుుడ్ కార్డులు ఇవ్వాలంటూ బ్యాంకులను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కోరుతున్నారుు. ప్రైవేట్ రంగ కంపెనీలు ఉద్యోగులకు డిజిటల్ చెల్లింపులు చేస్తారని భావిస్తున్నాం. కంపెనీల సీఎండీలతో భేటీలో అందుకు అంగీకరించారు’ అని దాస్ తెలిపారు. బ్యాంకింగ్ సేవలకు సంబంధించి డిసెంబర్ 31 వరకు టెలికం ఆపరేటర్లు ఉచిత మొబైల్ సందేశాలు పంపుతున్నారన్నారు. అది మోదీ రక్తంలోనే లేదు: వెంకయ్య ఏదైనా నిర్ణయం వెనక్కి తీసుకోవడమనేది ప్రధాని మోదీ రక్తంలోనే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వాపసు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. సేవింగ్స ఖాతాల్లో డిపాజిట్ చేయొచ్చు రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లను పోస్టాఫీసుల్లోని సేవింగ్స ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డిపాజిట్ చేయడానికి పాత నోట్లను అనుమతించబోమని ఆర్బీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. అరుుతే పోస్టాఫీసుల్లో మాత్రం సేవింగ్స డిపాజిట్లకు వెసులుబాటు కల్పించినట్లు మంత్రి చెప్పారు. డెబిట్ కార్డులపై సర్వీసు చార్జీ రద్దు డెబిట్ కార్డుల ద్వారా జరిగే అన్ని వ్యవహారాలపై డిసెంబర్ 31 వరకు సర్వీసు చార్జీని కేంద్రం రద్దు చేసింది. ప్రభుత్వబ్యాంకులు, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, డెబిట్, క్రెడిట్ కార్డు సేవలు అందిస్తున్న సర్వీసు ప్రొవైడర్లు ఈ ఏడాది చివరి వరకూ సర్వీసు రుసుం వసూలు చేయవు. డెబిట్ కార్డుపై స్విచ్చింగ్ చార్జీల్ని ‘రూపే’ ఇప్పటికే రద్దు చేయగా...మాస్టర్ కార్డు, వీసా వంటి అంతర్జాతీయ సంస్థలు చార్జీలు వసూలు చేస్తున్నాయని దాస్ తెలిపారు. ‘డెబిట్ కార్డు వాడితే వసూలు చేసే ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలు, బ్యాంకు సర్వీస్ చార్జీలు, స్విచ్చింగ్ చార్జీలను పూర్తిగా ఎత్తివేశాం. డెబిట్ కార్డుల వినియోగంపై ఇక నుంచి ఎలాంటి చార్జీలు ఉండవు’ అని వెల్లడించారు. కాగా, ఈ-వాలెట్ల ద్వారా నగదు చెల్లింపు పరిమితిని కేంద్రం రెండింతలు చేసింది. ఇక నుంచి రూ. 20 వేల వరకూ వాడుకోవచ్చు. డిజిటల్ నగదు చెల్లింపుల వాడకం ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ఏం ఒరుగుతుంది ? డెబిట్ కార్డులపై సర్వీసు చార్జీల రద్దుతో సామాన్యుడికి ప్రయోజనం ఉండదని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. దేశ జనాభాలో దాదాపు 53 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవన్నది అంచనా. దేశంలో 92 శాతం పల్లెలకు గ్రామీణ బ్యాంకుల సదుపాయమే లేదు. జన్‌ధన్ పథకంలోనే 25 కోట్ల డెబిట్ కార్డులిచ్చినా అందులో అధికశాతం వినియోగంలో లేవు. దేశం మొత్తం 2.2 లక్షల ఏటీఎంలు ఉంటే అందులో 10 శాతం కూడా గ్రామీణ ప్రాంతాల్లో లేవు. గ్రామాల్లో 75 శాతం పైగా వ్యవహారాలన్నీ నగదు రూపంలోనే జరుగుతున్నారుు. ఈ నేపథ్యంలో డెబిట్ కార్డులపై సర్వీసు చార్జీ ఎత్తివేత ఎంతమందికి ఉపయోగమో ఆలోచించాలంటున్నారు. విద్యార్థి ఆత్మహత్య బండా(యూపీ): కాలేజీ ఫీజుకు కావాల్సిన నగదు డ్రా చేసేందుకు రోజుల తరబడి బ్యాంకు క్యూలో నిల్చొని నగదు దొరక్క 18 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలోని మవాయ్ బుజుర్గ్‌లో మంగళవారం జరిగింది. సురేశ్ బ్యాంకు క్యూలో నిల్చున్నా డబ్బు దొరక్కపోవడంతో ఇంటికొచ్చి తల్లి చీరతో ఉరేసుకున్నాడు. తిండ్వారీ పోలీసు స్టేషన్ పరిధిలో చికిత్స కోసం డబ్బు దొరక్కపోవడంతో బ్యాంకు ఆవరణలోనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. -
ఆదిత్య ఆధ్వర్యంలో ‘లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్’
ఉండూరు (సామర్లకోట) : విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉండూరు గ్రామ పరిధిలో ఏడీబీ రోడ్డులో ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ‘లక్ష్య ఇంటర్నేష¯ŒS స్కూల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో వల్లభాయ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి జాతీయ నాయకుని గురించి తెలుసుకొని వారిలో ఉన్న మంచిని గ్రహించాలని సూచించారు. దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక స్పృహలకు సంబందించిన అంశాల పై ఉపాధ్యాయులు బోధనలు చేయాలన్నారు. విద్యతో పాటు ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలపై శ్రద్ధ చూపాలన్నారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లీషును ఉపాధి కోసమే సద్వినియోగం చేసుకొని మాతృభాషను మరువకూడదన్నారు. భారతదేశంలో ఉన్న సంస్కృతి, సంప్ర దాయాలు ఇతర దేశాలకు చెందిన వారు ఎంతో గౌరవిస్తున్నారని తెలిపారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృ భాష, మాతృదేశాన్ని మరచి పోకూడదని సూచించారు. మతం వ్యక్తిగతమైనదని, అయితే కొందరు కుల, మతాలతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆదిత్య శేషారెడ్డి ఉపాధ్యాయునిగా విద్యా సంస్థలు స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించారన్నారు. ఆయనతో పాటు కుమారులు, కోడళ్లు, భార్య విద్యా సంస్థలకు అంకితం కావడం విశేషమని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో విద్యను అందించాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, ప్రైవేటు రంగ సంస్థలు ప్రగతి సాధించిన్నప్పుడే అభివృద్ది సాధ్యపడుతుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆదిత్య విద్యా సంస్థల చైర్మ¯ŒS ఎ¯ŒS.శేషారెడ్డి మాట్లాడుతూ 1984లో విద్యారంగంలో ప్రవేశించి ఇప్పటి వరకు వివిధ రకాల 50 విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని, ఐదు వేల మంది ఫ్యాకల్టీలు, 50 వేల మంది విద్యార్ధులు ఉన్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఆదిత్య విద్యా సంస్థలో క్రమ శిక్షణతో కూడిన విద్యను అందించడం వలనే అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయన్నారు. ఇటీవల నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీలు మురళీమోహన్, రవీంద్రబాబు, కె.హరిబాబు, తోట నరసింహంలతో పాటు సతీష్‌రెడ్డి, దినేష్‌రెడ్డి, సుగుణ, సృతికిరణ్, లక్ష్మిరాజ్యం తదితరులు పాల్గొన్నారు. వెంకయ్య నాయుడిని శేషారెడ్డి కుటుంబసభ్యులు ఘనంగా సన్మానించారు. -
ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని..
పరిగి: ఏడునెలల పసిబిడ్డను అమానుషంగా నీటిగుంతలో ముంచి కడతేర్చాడో కసాయి తండ్రి. వివరాలు.. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం జాపర్‌పల్లికి చెందిన కొందపల్లి వెంకటయ్య, పద్మ దంపతులు వ్యవసాయం చేస్తూ కూలీపనులకు వెళ్తుంటారు. వీరికి పిల్లలు శ్రీవాణి(4), శోభిత(7 నెలలు) ఉన్నారు. ఇద్దరు కూతుళ్లే పుట్టారని కొంతకాలంగా వెంకటయ్య అసంతృప్తితో ఉన్నాడు. ఈ క్రమంలో, బుధవారం ఉదయం పద్మ వంట చేస్తుండగా శోభితను ఆడించుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలో ఓ నీటిగుంతలో ఆ పాపను ముంచి చంపేశాడు. అక్కడే ఓ గుంతలో మృతదేహాన్ని ఉంచి తిరిగి ఇంటికి వచ్చాడు. గ్రామస్తులు అతడిని నిలదీయడంతో విషయం చెప్పాడు. ఆయన్ను ఘటనా స్థలానికి తీసుకెళ్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కొన్ని రోజులుగా తన మానసిక పరిస్థితి బాగాలేదని, ఏం చేస్తున్నానో.. తెలియడం లేదని వెంకటయ్య తెలిపాడు. కాగా.. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనే అక్కసుతోనే వెంకటయ్య ఓ పాపను చంపేశాడని పద్మ తరఫు బంధువులు ఆరోపించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శంషొద్దీన్ తెలిపారు.