పెద్ద నోట్ల రద్దుతో రైతులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయాలు ప్రకటించింది. రబీ సీజన్ నేపథ్యంలో రైతులు సులువుగా రుణం పొందేలా, నగదు లభ్యత కోసం సహకార సంఘాల ద్వారా రూ. 21 వేల కోట్లు రైతులకు ఇచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబారు)్డకు అనుమతినిచ్చింది. సహకార సంఘాల నుంచే 40 శాతంపైగా చిన్న రైతులు పంట రుణాలు పొందుతున్నారని, వారికి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ బుధవారం చెప్పారు. ఆన్‌లైన్ బుకింగ్‌పై రైల్వే ఇప్పటికే సర్వీసు చార్జీ రద్దు చేసిందని, డిసెంబర్ 31దాకా ఉచిత మొబైల్ బ్యాంక్ సేవలు వినియోగించుకునేందుకు టెలికం ఆపరేటర్లు అంగీకరించారన్నారు.