breaking news
venkatapoor
-
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నలుగురికి గాయాలు వెంకటాపూర్ వద్ద ఘటన ఎల్లారెడ్డిపేట : మండలంలోని వెంకటాపూర్ శివారులో ఎల్లమ్మ ఆలయం వద్ద బుధవారం జరిగిన రోడ్లు ప్రమాదంలో ఒకరు మృతిచెందాగా నలుగురు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిపేటకు చెందిన చందనం భాస్కర్(55)తన కూతురు హేమలత, మనుమడు భానుమహేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేటకు వస్తున్నాడు. బోయినిపల్లి మండలం వర్దవెళ్లి్లకి చెందిన మందాల జ్యోతి–కనుకయ్య దంపతులు టీవీఎస్ ఎక్సెల్‌పై ఎల్లారెడ్డిపేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. రెండు వాహనాలు వెంకటాపూర్ శివారులో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జ్యోతి పరిస్థితి విషమంగా ఉంది. భాస్కర్ మృతదేహాన్ని జెడ్పీటీసీ తోట ఆగయ్య ఆస్పత్రిలో సందర్శించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడికి భార్య అంజవ్వ, కూతుళ్లు హేమలత, అపర్ణ, కుమారులు అనిల్, హరీశ్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై ఉపేందర్ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకాశాన్ని తాకేలా..
వెంకటాపురం : మండలంలోని నల్లగుంట శివారులో దేవాదుల మొదటి దశకు చెందిన పైపులైన్ గేట్వాల్్వను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో నీరు 40 అడుగుల ఎత్తులో ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతోంది. నల్లగుంట సమీపంలోని ఆరె‡కుంట కింద కొందరు రైతులు వరిని సాగు చేస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు దేవాదుల పైపుౖలñ న్ గేట్వాల్్వను తొలగించడంతోపాటు ఫెన్సింగ్ (ఇనుపరాడ్ల)ను ధ్వంసం చేశారు. దీంతో శనివారం అర్ధరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు నీరు ఆరెకుంటలోకి వెళ్లింది. ఈ విషయమై స్థానిక దేవాదుల సిబ్బంది మొగిలిని ‘సాక్షి’ వివరణ కోరగా.. గేట్వాల్్వను ఎవరో ధ్వంసం చేయడంతో నీరు వృథాగా పోతుందని తెలిపారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు.