రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | road accident at venkatapoor | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Sep 14 2016 11:42 PM | Updated on Aug 30 2018 4:10 PM

ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్‌ శివారులో ఎల్లమ్మ ఆలయం వద్ద బుధవారం జరిగిన రోడ్లు ప్రమాదంలో ఒకరు మృతిచెందాగా నలుగురు గాయపడ్డారు.

  • నలుగురికి గాయాలు
  • వెంకటాపూర్‌ వద్ద ఘటన
  • ఎల్లారెడ్డిపేట  :  మండలంలోని వెంకటాపూర్‌ శివారులో ఎల్లమ్మ ఆలయం వద్ద బుధవారం జరిగిన రోడ్లు ప్రమాదంలో ఒకరు మృతిచెందాగా నలుగురు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిపేటకు చెందిన చందనం భాస్కర్‌(55)తన కూతురు హేమలత, మనుమడు భానుమహేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేటకు వస్తున్నాడు. బోయినిపల్లి మండలం వర్దవెళ్లి్లకి చెందిన మందాల జ్యోతి–కనుకయ్య దంపతులు టీవీఎస్‌ ఎక్సెల్‌పై ఎల్లారెడ్డిపేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. రెండు వాహనాలు వెంకటాపూర్‌ శివారులో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో భాస్కర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జ్యోతి పరిస్థితి విషమంగా ఉంది. భాస్కర్‌ మృతదేహాన్ని జెడ్పీటీసీ తోట ఆగయ్య ఆస్పత్రిలో సందర్శించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడికి భార్య అంజవ్వ, కూతుళ్లు హేమలత, అపర్ణ, కుమారులు అనిల్, హరీశ్‌ ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై ఉపేందర్‌ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
     
     
     
     

Advertisement
 
Advertisement
Advertisement