breaking news
venkatanarahari
-
భార్యకు కోపం...భర్త హతం
-
భార్య చేతిలో భర్త హతం
జూలపల్లి, న్యూస్‌లైన్ : కలకా లం తోడుండాల్సిన భర్తను భార్యే కడతేర్చింది. విలాసాలకు అలవాటుపడ్డ ఆమె మానసికస్థితి అదుపుతప్పడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన జూలపల్లి మండ లం తేలుకుంటలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిప్ప వెంకటనరహరి(42) వివాహం కరీంనగర్ మండలం చెర్లబూత్కుర్కు చెందిన నాగలక్ష్మితో 22 ఏళ్ల క్రితం జరిగింది. కొడుకు, కూతురు సంతానం. కొడుకు ఇంజినీరింగ్ చదువుతుండగా, కూతురు ఇంటర్ చదువుతోంది. విలాసాలకు అలవాటుపడ్డ నాగలక్ష్మి మానసిక స్థితి కొన్నిరోజులుగా అదుపుతప్పింది. ఈ క్రమంలో భర్త గతంలో కూతురు పేరిట డిపాజిట్ చేసిన డబ్బులు వచ్చా యి. అతడు ఆ డబ్బులను మళ్లీ డిపాజిట్ చేశాడు. ఈ విషయమై కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. బుధవా రం వేకువజామున రెండు గంటల ప్రాంతంలో ఇంట్లో వెంకటనరహరి పడుకుని ఉండగా ఆమె రోకలిబండతో అతడి తలపై బా దింది. తలపగిలి అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ సీఐ సత్యనారాయణ, ఎస్సై నాగేశ్వర్రావు తెలిపారు. నాగలక్ష్మి ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.