breaking news
venice film festival
-
వెనిస్లో గెలిచింది
వెనిస్ నగరంలో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగిన వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన యువ దర్శకురాలు అనుపర్ణా రాయ్ అవార్డు గెలుచుకుంది. మొదటి, రెండవ దర్శకత్వ సినిమాల కేటగిరి ‘ఒరిజోంటి’ కేటగిరిలో తన మొదటి సినిమా ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’కు ఆమె అవార్డు గెలుచుకుంది. అనురాగ్ కశ్యప్ సమర్పించిన సినిమా ఇది. అనుపర్ణ పరిచయం.‘స్త్రీల లోపల ఉండే ఖాళీలు స్త్రీలకే తెలియవు. ఆ ఖాళీలు ఏ విధాన పూరింపబడతాయో కూడా తెలియదు. స్త్రీలు తమలో తాము చేసే అంతర్గత ప్రయాణానికి వీలు ఉండదు. అలాంటి ఇద్దరు స్త్రీలు తమను తాము తెలుసుకోవడమే కాక ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నమే నేను తీసిన సాంగ్స్ ఆఫ్ ఫర్గాటోన్ ట్రీస్ సినిమా’ అంది అనుపర్ణా రాయ్.29 ఏళ్ల అనుపర్ణా రాయ్ ఇటీవల వెనిస్లో జరిగిన వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరి దృష్టి ఆకర్షించింది. ఆమె దర్శకత్వం వహించిన 77 నిమిషాల ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ హిందీ సినిమా మూడు షోస్ వేస్తే హౌస్‌ఫుల్‌గా నడిచాయి. అందరూ ఆమెను ప్రశంసించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటిసారి దర్శకత్వం వహించే సినిమాల విభాగం ‘ఒరిజోంటి’లో ఈ సినిమా సెలక్ట్ కావడమే గొప్ప అనుకుంటే అవార్డు గెలవడం మరింత గొప్ప. ఆ విధంగా అనుపర్ణా రాయ్ చరిత్ర సృష్టించింది. వివిధ దేశాల నుంచి 19 సినిమాలు ఎంట్రీ పొందిన ఈ విభాగంలో మన భారతీయ చిత్రం ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’కు అవార్డు దక్కడం దేశంలో యువ ప్రతిభకు లోటు లేదనే విషయాన్ని నిరూపిస్తోంది. సినీ రంగంలో మహిళల సృజనకు తార్కాణంగా నిలుస్తోంది.కథ ఏమిటి?‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ కథ ముంబైలో జరుగుతుంది. ముంబైకి వలస వచ్చిన ఔత్సాహిక నటి తోయ, సేల్స్ రంగంలో పని చేసే శ్వేత ఒక అపార్ట్మెంట్లో రూమ్మేట్స్గా కలిసి జీవిస్తూ ఉంటారు. తోయకు నటిగా అవకాశాలు రావు. అందువల్ల తప్పనిసరై సెక్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే శ్వేతకు ఎదురు పడుతున్న పురుషులు ఆమెను అర్థం చేసుకోవడంలో విఫలమవుతుంటారు. ఈ క్రమంలో తోయ, శ్వేత ఒకరికొకరు తోడవుతారు. ఉద్వేగాలను అర్థం చేసుకొని ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుకుంటారు. వారి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. అయితే తోయ చేసే సెక్స్‌వర్క్ ఇరుగు పొరుగుకు తెలిసి చివరకు ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆమెతో పాటు శ్వేత కూడా బయటకు నడవడంతో సినిమా ముగుస్తుంది. అయితే ఇప్పుడు వారు ఒంటరి కాదు. ఒకరికి ఒకరు ఉన్నారు. అదీ తేడా. ఈ కథంతా అపార్ట్మెంట్లోని వంట గదిలో, డ్రాయింగ్ రూమ్‌లో, కిటికీ దగ్గర, కారిడార్లలో జరుగుతుంది. స్త్రీలకు దొరికే ఈ మాత్రపు స్థలంలోనే వారు ఏ విధంగా జీవితాలను నిభాయించుకుంటారో దర్శకురాలు చూపుతుంది.బెంగాల్ అమ్మాయిఅనుపర్ణా రాయ్ పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో పుట్టి పెరిగింది. మాస్ కమ్యూనికేషన్ చదివి ఢిల్లీలో కాల్ సెంటర్లో పని చేసింది. 2022లో ముంబైకి వలస వచ్చింది. దర్శకురాలిగా ఆమెకు ఎటువంటి శిక్షణ లేదు. చిన్నప్పుడు సినిమా హాలుకు వెళ్లడం కూడా కష్టమయ్యేది. కాలేజీ వయసులోనే సినిమా అంటే ఏమిటో పైరెటెడ్ సినిమాలను తన లాప్టాప్లో చూసి తెలుసుకుంది. ‘రన్ టు ది రివర్’ అనే షార్ట్‌ఫిల్మ్ తర్వాత ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ తీయాలనుకుంది. అయితే ఇందుకు ఆమె దగ్గర డబ్బు లేదు. కొద్దిపాటి ఫండ్ దొరికితే తన అద్దె ఫ్లాట్‌లోనే ఇద్దరు ముఖ్యపాత్రధారులను తనతోపాటు ఉంచుకుని సినిమా తీసింది. తర్వాత అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను మెచ్చి సమర్పకుడిగా వచ్చాడు. దాంతో సినిమా వెనిస్కు చేరింది. అవార్డు కూడా సాధించింది.అంతా రాజకీయమే‘చిన్నప్పుడు నాకో స్నేహితురాలు ఉండేది. దళితురాలు. ఆమె పేరు ఝూమా దాస్. ఆమెతో మాట్లాడవద్దని మా నాన్న చె΄్పాడు. అలా ఆ స్నేహం వదులుకున్నాను. కాని ఆ పని చేసినందుకు మా నాన్నను ఇప్పటికీ క్షమించలేకపోతున్నాను. ఝూమా దాస్‌కు చిన్న వయసులోనే పెళ్లయ్యింది. దానికి కారణం పెళ్లి ఖర్చు భరించే ప్రభుత్వ పథకమే. ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్ళిళ్లకు డబ్బు ఇవ్వడం కన్నా వారి చదువుకు డబ్బు ఇవ్వాలి. తక్కువ కులాల ఆడపిల్లల ఎదుగుదలను పట్టించుకోక వారిని త్వరగా వదిలించుకోవడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నమే పెళ్లి ఖర్చు భరించడం. స్త్రీలు ఎన్నో సంఘర్ఘణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. వారి కథలు నాలో నిండిపోయి ఈ సినిమాగా బయటకు వచ్చాయి’ అని తెలిపింది అనుపర్ణ రాయ్.∙ -
ఉత్తమ దర్శకురాలు అనుపర్ణా రాయ్
న్యూఢిల్లీ: భారత యువ దర్శకురాలు అనుపర్ణ రాయ్ ప్రతిభ అంతర్జాతీయ వేదికపై తళుకులీనింది. ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ చిత్రానికి ప్రఖ్యాత వెనిస్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమెకు ఉత్తమ దర్శకురాలి అవార్డు దక్కింది. అరంగేట్రం, నవతరం ప్రతిభ, స్థానిక సొబగులు, కొత్తతరహా అంశాల కలబోత అయిన అంతర్జాతీయ ‘ఒరిజోంటీ’ విభాగంలో అనుపర్ణ ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. తొలి సినిమాకే ఈ పురస్కారం దక్కడం విశేషం. ఒరిజోంటీ కేటగిరీలో ఒక భారతీయ డైరెక్టర్‌కు అవార్డు దక్కడమూ ఇదే తొలిసారి!అణగారిన మహిళలకే అంకితం82వ వెనిస్ అవార్డు ప్రదానోత్సవంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ చేతుల మీదుగా అనుపర్ణ అవార్డును స్వీకరించారు. ఈ అవార్డును గొంతుక లేని, నిర్లక్ష్యానికి గురైన మహిళలకు అంకితమిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ‘‘నా విజయం మహిళా గొంతుకలకు బలాన్నిస్తుంది. అణచివేతకు గురైన మహిళల గాథలను గట్టిగా వినిపిస్తుంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముంబైకి వలసవచి్చన ఇద్దరు మహిళల ఆటుపోట్లను ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’’ కళ్లకు కట్టింది. ‘గోల్డెన్ లయన్’ పేరిట విజేతలకు 1949 నుంచి పురస్కారాలు అందిస్తున్నారు. కొత్త ప్రతిభను, స్వతంత్ర చిత్రాలను ప్రోత్సహించేందుకుగాను గోల్డెన్ లయన్‌కు సాటిగా ఒరిజోంటి అవార్డును రెండు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టారు. ఈఏడాది గోల్డెన్ లయన్ అవార్డ్‌ను అమెరికాకు చెందిన ‘ ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్’ సినిమా ఎగిరేసుకుపోయింది. -
ది డిసిపుల్‌కి అంతర్జాతీయ పురస్కారం
చైతన్య తమ్హానే దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం ‘ది డిసిపుల్’ వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటింది. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును సొంతం చేసుకుంది. కరోనా వల్ల అన్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. 77వ వెన్నిస్ ఫెస్టివల్‌ను మాత్రం నిర్వహించారు. 2001లో మీరా నాయర్ తీసిన ‘మాన్సూన్ వెడ్డింగ్’ తర్వాత వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇంత దూరం వెళ్లిన చిత్రం ‘ది డిసిపుల్’ కావడం విశేషం. అలాగే ఆదర్శ్ గోపాలకృష్ణన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘మతిళుకల్’ (1989) తర్వాత ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారం అందుకున్న చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఓ యువ సంగీత కళాకారుడు చేసే సంగీత ప్రయాణమే ఈ చిత్రకథ. ‘ది డిసిపుల్’ చిత్రదర్శకుడు గతంలో తీసిన ‘కోర్ట్’ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. -
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ షురూ
కోవిడ్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నీ వాయిదా పడ్డాయి. మే నెలలో జరగాల్సిన కాన్స్ చిత్రోత్సవాలు జరగలేదు. వచ్చే ఏడాది జరిగే గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్ అవార్డులను కొన్ని వారాలు వెనక్కి జరిపారు. ఈ ఏడాది జరగాల్సిన కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను వర్చువల్‌గా (ఆన్లైన్లో) జరపడానికి నిశ్చయించారు. అయితే వెనిస్ చిత్రోత్సవాలను కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ జరపబోతున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో సుమారు 50 దేశాలు పాల్గొనబోతున్నాయి. ఈ సంబరానికి హాజరుకానున్న వాళ్లందరికీ ఉష్ణోగ్రత చూసే లోపలి అనుమతిస్తారట. ప్రతీ రెండో సీట్ ఖాళీగా ఉండేలా చూసుకుంటారట. ఈ ఫెస్టివల్‌కి హాజరు కావాలనుకున్నవాళ్లు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని కూడా తెలిపారు. -
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ షురూ
కోవిడ్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నీ వాయిదా పడ్డాయి. మే నెలలో జరగాల్సిన కాన్స్ చిత్రోత్సవాలు జరగలేదు. వచ్చే ఏడాది జరిగే గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్ అవార్డులను కొన్ని వారాలు వెనక్కి జరిపారు. ఈ ఏడాది జరగాల్సిన కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ ను వర్చువల్ గా (ఆన్ లైన్ లో) జరపడానికి నిశ్చయిం చారు. అయితే వెనిస్ చిత్రోత్స వాలను కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ జరపబోతున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో సుమారు 50 దేశాలు పాల్గొన బోతున్నాయి. ఈ సంబరానికి హాజరుకానున్న వాళ్లందరికీ ఉష్ణోగ్రత చూసే లోపలికి అనుమతి స్తారట. ప్రతీ రెండో సీట్ ఖాళీగా ఉండేలా చూసుకుంటారట. ఈ ఫెస్టివల్‌కి హాజరు కావాలను కున్నవాళ్లు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని కూడా తెలిపారు. -
వెనిస్ వాకిట్లో బాంబే రోజ్
బాంబే రోజ్... గులాబీల్లో వెరైటీ కాదు. కాని ముంబైలో పూసిందే! సిల్వర్‌స్క్రీన్ మీద.. గీతాంజలి రావు ఆలోచనల్లోంచి! ఆ సినిమానే రేపు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరగనున్న వెనిస్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది! ఇక్కడ ప్రస్తావించుకోవడానికి సందర్భాన్ని తెచ్చింది! ముందు సినిమా గురించి చెప్పుకుందాం.. తర్వాత గీతాంజలి రావును పరిచయం చేసుకుందాం.‘‘బాంబే రోజ్’’ యానిమేటెడ్ మూవీ. ముంబైలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందింది. కమల, సలీమ్ .. రెండూ ముఖ్యమైన పాత్రలు. బాల్య వివాహం నుంచి తప్పించుకొని ముంబై చేరుతుంది కమల. కశ్మీర్ రాజకీయాలకు బలైన యువకుడు సలీమ్. కొత్త జీవితం అన్వేషణలో అతనూ ముంబై చేరుతాడు. రోడ్డుకు ఇవతలివైపు పూలు అల్లుకుంటూ కమల, అవతలివైపు పూలమాలలు అమ్ముకుంటూ సలీమ్. బాలీవుడ్ డ్రాప్‌గా ఆ ఇద్దరి మధ్య నడిచన కథే బాంబే రోజ్. యానిమేషన్ సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ ప్రధానం. రఫ్‌గా తీసిందే బ్లూ ప్రింట్ అవుతుంది. ‘‘బాంబే రోజ్’’ బ్లూ ప్రింట్‌కి రెండేళ్లు పట్టిందట. . మొత్తం చిత్రం పూర్తి కావడానికి ఐదు సంవత్సరాల పైనే పట్టిందిట. ఈ సినిమాకు వాడిన సంగీతం ఎనభై శాతం పాత సినిమాల్లోంచి తీసుకున్నదే. కమల పాత్రకు శైలీ ఖారే, సలీమ్ పాత్రకు అమిత్ డియోండీ, విలన్ పాత్రకు మకరంద్ దేశ్‌పాండే, బాలీవుడ్ స్టార్‌కు అనురాగ్ కశ్యప్, కమల తాత పాత్రకు వీరేంద్ర సక్సేనా గళాన్ని అందించారు. గీతాంజలి పరిచయం.. షూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ‘‘అక్టోబర్’’సినిమా గుర్తుండే ఉంటుంది కదా. అందులో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కిందపడిన యువతి తల్లిగా నటించిన నటే గీతాంజలి రావు. జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో కమర్షియల్ ఆర్ట్ కోర్సు చేశారు ఆమె. అక్కడున్నప్పుడే ప్రఖ్యాత యానిమేటర్ రామ్ మోహన్ దగ్గర యానిమేషన్ నేర్చుకున్నారు. అలా ఆమె 2006లో ‘‘ప్రింటెడ్ రెయిన్బో ’’ అనే తన ఫస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌కి రూపమిచ్చారు. దీనికి 28 అవార్డులు వచ్చాయి. ఫిల్మ్ స్కూల్స్‌లో సబ్జెక్ట్ కూడా అయ్యిందీ సినిమా. ఆ తర్వాత పదేయేళ్లకు ‘‘విష్ ఫుల్ఫిల్మెంట్ సెల్ఫీ’’ అనే షార్ట్ ఫిల్మ్ తయారు చేశారు. ఆమె తన సెల్ఫీలను రాజకీయనాయకులు, కళాకారులతో కలిసి తీసుకున్నట్టుగా ఫోటోషాప్ చేసి తీసిన సినిమానే అది. చాలామంది ఆసక్తిగా చూశారు. 46 యేళ్ల గీతాంజలి పూర్తిస్థాయి సినిమా తీయడానికి చాలా యేళ్లే నిరీక్షించాల్సి వచ్చింది. ఫైనాన్సియర్లు ముందుకు రాకపోవడమే కారణం. ఈ ప్రాజెక్ట్ కోసం టీవీ కమర్షియల్స్‌లో నటించారు. ‘‘ చాలా యేళ్లుగా నటిస్తూనే ఉన్నాను. యానిమేషన్లో తలమునకలై ఉండడంతో అనురాగ్ కశ్యప్ ‘‘పాంచ్’’ లో నటించే అవకాశం వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించాను. బాంబే రోజ్’ మేకింగ్‌లో బిజీ అవడంతో ఇంకొన్ని అవకాశాలకూ నో చెప్పాల్సి వచ్చింది. ఆరు సంవత్సరాల కిందటే బాంబే రోజ్ కథ ఆలోచించాను. తీయడానికే నిర్మాతలు దొరకలేదు. మంచి భవిష్యత్ కోసం ముంబైకి వలస వచ్చిన వారి జీవితమే ఈ చిత్రం. నేను కూడా ఇక్కడకు వలస వచ్చినదానినే. ముంబైకి సంబంధించిన ఎన్నో అంశాలు నిత్యం నన్ను పలకరిస్తూనే ఉంటాయి. అందువల్లే ఈ చిత్రం టైటిల్లో బాంబే పేరు ఉంచాను. నాకు పూల పట్ల ఉన్న ప్రేమను ప్రదర్శించాను. నేను ట్రైన్లో చూసిన పూలమ్ముకునే అమ్మాయి జీవితం ఆధారంగా వచ్చినదే కమల పాత్ర. నిత్యం నా తలలో మల్లెపూలు పెట్టుకుంటాను. చెమటలు కక్కే బొంబాయి మహానగరంలో వీటి వల్లే సువాసనలు పీల్చుకోగలం. దాదర్ ఫ్లవర్ మార్కెట్, జుహు బీచ్‌ల మధ్య తిరుగుతుండే పూలవారికి సంబంధించిన దృశ్యాలను యానిమేట్ చేయడానికి ఎనిమిది నెలల సమయం పట్టింది. ఒక సూట్‌కేసులో బట్టలన్నీ నిండుగా ఉన్నట్లే, నా మదిలో కూడా ఆలోచనలు అలాగే ఉన్నాయి. అంతకుముందు.. ముంబైకి వలస వచ్చిన ముగ్గురి కథ ఆధారంగా తీసిన గిర్గీత్ చిత్రం.. ఆరు నెలల పాటు నిర్మాణం జరిగాక ఆగిపోయింది. ఆ అనుభవంతో ‘ట్రూ లవ్ స్టోరీ’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశాను. అది 2014లో జరిగిన కేన్స్ ఉత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. నేను ప్రారంభించి ఆపేసిన చాలా సినిమాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నాను. ’’ అంటారు గీతాంజలి రావు. వెనిస్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ‘‘బాంబే రోజ్’’ తోపాటు వి. బి. సమంత తీసిన హనుమాన్ (2005), అర్నబ్ చౌదరి తీసిన అర్జున్ – ద వారియర్ ప్రిన్స్ (2012), శిల్పా రనాడే తీసిన గోపీ గవయ్యా బాజా బజయ్యా, చోటాభీమ్ పాత్రల ఆధారంగా రూపొందినవి మరికొన్నీ ప్రదర్శనకు ఎంపికయ్యాయి.– వైజయంతి -
వెనిస్ వెళుతున్న ఆటో డ్రైవర్
అవకాశం వస్తే సామాన్యులూ సెలబ్రిటీలవుతారు. తమిళనాడులోని కోయంబత్తూర్ నగరానికి చెందిన చంద్రకుమార్ అనే ఆటో డ్రైవర్‌కు కూడా అలాంటి అవకాశమే వచ్చింది. ఇటలీలోని వెనిస్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనేందుకు ఆయన మంగళవారం ఉదయం బయల్దేరి విమానంలో వెళ్తున్నారు. ఆయన రాసిన ఓ నవల ఆధారంగా తీసిన చిత్రాన్ని అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తున్నారు. ఆ సినిమా దర్శకుడు వెట్రిమారన్ ఆహ్వానంపై ఆయనకు ఈ అవకాశం లభించింది. 51 ఏళ్ల ఎం. చంద్రకుమార్ ఆటో చంద్రన్‌గా కోయంబత్తూర్ ప్రజలకు సుపరిచితం. పదో తరగతిలోనే ఇంటి నుంచి పారిపోయారు. అప్పుడే చదువుకు స్వస్తి చెప్పారు. బతుకుతెరువు కోసం వివిధ రాష్ట్రాలు తిరిగారు. కడుపు నింపుకోవడానికి కాయకష్టం చేశారు. జీవనోపాధి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు వెళ్లారు. అక్కడ దొరికిన పనల్లా చేశారు. ఓసారి ఏ కారణం లేకుండానే ఆయన్ని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. 13 రోజుల పాటు స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆనాటి తన అనుభవాలను 'లాకప్' పేరుతో ఓ నవలగా రాశారు. నిస్సహాయులైన పేదలకు ఈ సమాజంలో రక్షణ లేదనే విషయాన్ని ఆ నవలలో కళ్లకు కట్టినట్టు చెప్పారు. 2006లో ఆ నవలకు 'బెస్ట్ డాక్యుమెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్' అనే అవార్డు కూడా వచ్చింది. ఆ నవల గురించి మిత్రుల ద్వారా తెలుసుకున్న వెట్రిమారన్ ఆ నవల ఆధారంగా తమిళంలో ఇటీవలనే సినిమా తీశారు. టైటిల్స్‌లో చంద్రన్‌కు క్రెడిట్ కూడా ఇచ్చారు. సినీ నటుడు ధనుష్ దీనికి నిర్మాతగా వ్యవహరించగా, అట్టకతి దినేశ్, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించారు. దీన్ని వెనిస్లో సెప్టెంబర్ 2వ తేదీన ప్రారంభమైన 72వ వెనిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్నారు. 12వ తేదీతో ఈ చిత్రోత్సవం ముగుస్తుంది. కమర్షియల్‌గా ఈ చిత్రాన్ని రాష్ట్రంలో ఎప్పుడు విడుదల చేసేదీ ఇంకా ప్రకటించలేదు. ఆటో చంద్రన్ ఇప్పటి వరకు ఆరు భిన్నమైన నవలలు రాశారు. టెర్రరిజంపైన, కమ్యూనిస్టు నాయకుడు పీ. జీవానందం జీవిత చరిత్రపై పుస్తకాలు రాశారు. తాను సాధారణంగా ట్రాఫిక్ జామ్లలో ఇరుక్కున్నప్పుడు, ప్రయాణికుల కోసం నిరీక్షిస్తున్న సమయాల్లో నవలలు రాస్తానని ఆయన చెప్పారు.