breaking news
Veeraprasad
-
మేయర్ ఫోన్ చేస్తే మాట్లాడవా? నా చాంబర్ ఎదుట30 నిమిషాలు నిల్చో!
ఎంజీఎం: ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తన తండ్రి వృత్తిని కించపరుస్తూ తనను డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు ఆయన చాంబర్ ఎదుట నిల్చోబెట్టాడని కాకతీయ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ వీర ప్రసాద్ ఆరోపించడం కలకలం రేపింది. మనస్తాపానికి గురైన ప్రసాద్ తన పీజీ సీటు వదిలేస్తానని లేఖ రాసి.. తనకు అవమానం జరిగిందంటూ జూడా ప్రతినిధు లకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విషయం బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సదరు లేఖ, ఫిర్యాదులోని వివరాల ప్రకారం..’’ ఈ నెల రెండో తేదీన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డ్యూటీలో ఉండగా ఓ రోగి ఛాతీనొప్పితో రావడంతో పరీక్షిస్తున్నాను. సరిగ్గా అదే సమయంలో అటెండర్ ఫోన్ తీసుకువచ్చి మేయర్ మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పగా.. రోగికి వైద్యం అందించగానే మాట్లాడతానని చెప్పాను. వెంటనే ఫోన్ తీసుకోలేదన్న కారణంగా సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్.. నన్ను చాంబర్ దగ్గరికి పిలిపించాడు. నా తండ్రి వృత్తిని పేర్కొంటూ వ్యక్తిగతంగా కించపరిచాడు. డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు తన చాంబర్ ఎదుట నిలుచోబెట్టి తీవ్రంగా అవమాపరిచాడు’ అని ఆ లేఖ, ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ చదవడంకంటే పీజీ సీటు వదిలేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నాడు. ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించాలని చెప్పారంతే: ఆర్ఎంఓ శ్రీనివాస్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాస్ ఈ ఘటనపై స్పందించారు. సదరు పీజీ వైద్యుడితో సూపరింటెండెంట్ దురుసుగా ప్రవర్తించలేదని, సాధారణంగా పీజీ విద్యార్థి ఏ స్థాయి నుంచి వచ్చారో అనే కోణంలో ప్రశ్నించారని తెలిపారు. చాంబర్ ముందు 30 నిమిషాలు ఉండమన్నందుకు సదరు విద్యార్థి మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి కాబట్టి ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించాలని చెప్పారే తప్ప వ్యక్తిగతంగా దూషించలేదని వివరణ ఇచ్చారు. -
వివాహేతర సంబంధంతోనే హత్య
రామాపురం, న్యూస్‌లైన్ : రామాపురం మండలంలోని కుమ్మరపల్లె దళితవాడకు చెందిన ఓదేటి వీరప్రసాద్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. వివరాలలోకెళితే .. అదే దళితవాడకు చెందిన ఒక వివాహితతో వీరప్రసాద్ వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. రెండు నెలల క్రితం అతను సదరు మహిళను తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లి ఆమె బంగారు నగలను విక్రయించి కాలం గడిపారు. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరప్రసాద్ ఆమెను వెంటబెట్టుకుని స్వగ్రామానికి వచ్చేశాడు. గ్రామస్తులు పంచాయతీ చేసి సదరు మహిళను భర్తతో కాపురానికి వెళ్లేలా ఒప్పించారు. ఈ తరుణంలో వివాహేతర సంబంధం నెరపడం ద్వారా తమ కుటుంబాన్ని అవమానపరిచాడన్న తలంపుతో వీరప్రసాద్‌పై సదరు మహిళ భర్త గంగయ్య కక్ష పెంచుకున్నాడు. కాగా వీరప్రసాద్ వీరబల్లి మండలం సానిపాయవద్ద గల కంకర మిషన్‌లో కూలీగా పనిచేసేవాడు. అతనికి మద్యం తాగే అలవాటు వుండేది. తరచుగా అదే దళితవాడకు చెందిన నాగేంద్ర, అంజన్‌కుమార్, చంద్ర తదితరులతో కలిసి మద్యం సేవించేవాడు. ఇటీవల అతను స్వగ్రామానికి వచ్చి సమీపంలోనున్న దూదేకులపల్లెలో జరిగే మోహర్రం వేడుకలకు నాగేంద్ర, చంద్ర, గంగయ్య, అంజన్కుమార్లతో కలిసి వెళ్లారు. ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున పీర్లను బండపల్లె పీర్లచావిడికి తీసుకెళుతుండగా వాటి వెంట వెళుతూ వెంట తెచ్చుకున్న మద్యాన్ని తాగేందుకు దారిపక్కనే గల పొలంలోకి వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం వీరప్రసాద్‌పై గంగయ్య, చంద్ర ,నాగేంద్రలు దాడి చేస్తుండగా ‘నన్ను చంపొద్దు, ఊరు వదలివెళ్లిపోతానంటూ ప్రాధేయపడినా వినకుండా అంజన్‌కుమార్ పెద్ద బండరాాయితో వీర ప్రసాద్ తలపై బాదాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తిరిగి నలుగురు దూదేకులపల్లెకు వెళ్లారు. కాగా అంజన్‌కుమార్ తరచూ వీరప్రసాద్తోపాటు తల్లి వెంకటలక్షుమమ్మను చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో అనుమానపడిన ఆమె అంజన్ కుమార్‌ను తన కుమారుడి ఆచూకీ గురించి నిలదీసింది. ఇప్పటికే మీకుమారుడిని చంపాను.. నిన్నుకూడా చంపుతానంటూ అతను వెంకటలక్షుమమ్మను బెదిరించాడు. అప్పటికే వీరప్రసాద్‌ను హత్యచేసినట్లు దళితవాడలో సమాచారం గుప్పుమంది. వెంకటలక్షుమమ్మ తన కుమారుడి హత్య విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నాగేంద్రను అదుపులోకి తీసుకోగా మిగిలిన వారంతా పరారయ్యారు. విచారణలో వీరప్రసాద్‌ను తనతోపాటు పైముగ్గురు కలిసి హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం.