breaking news
Veena Concert
-
ఒక గంటలో అరవై పాటలు.. రికార్డు
టీ.నగర్: ఒక గంట సమయంలో 60 పాటలు పాడి రాజేష్ వైద్య ఆదివారం రికార్డ్ సాధించాడు. వీణ విద్వాంసుడిగా మేస్ట్రో అవార్డును అందుకున్న రాజేష్ వైద్య ప్రముఖ సంగీత దర్శకుడు జి.రామనాధన్ తమ్ముడి కుమారుడు. రాజేష్‌వైద్య తన బృందంతో 60 నిమిషాల్లో 60 పాటలు పాడి ఆసియా స్థాయిలో ఒక కొత్త రికార్డును సృష్టించాడు. ఆదివారం సాయంత్రం ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ రికార్డు సృష్టించారు. ఆసియా దేశంలో గల ప్రముఖులను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ఆ సంస్థ వెలుగులోకి తీసుకువస్తున్నది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాజేష్‌వైద్య రికార్డును నెలకొల్పడంతో అనేక మంది నుంచి ప్రశంసలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రసన్న, నటి సుహాసినిలు పాల్గొని రాజేష్వైద్యను అభినందించారు. -
సంగీత సాధనే ఆధ్యాత్మికత ఆరాధన
పండిట్ విశ్వమోహన భట్ విశాఖ–కల్చరల్: సంగీతం మనసును, శరీరాన్ని, ఆత్మను స్వచ్ఛపరుస్తుంది.. పరమాత్మతో కనెక్ట్ చేస్తుంది.. తన వరకు దేవుడి పూజ అంటే.. సంగీత సాధనేనని పద్మశ్రీ పండిట్ విశ్వమోహన్ భట్ అన్నారు. సంగీతాన్ని కళగానే చూడండి.. కళగానే అభ్యసించండి.. దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవద్దని సూచించారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ (వీఎండీఏ) 30వ వార్షికోత్సవం సందర్భంగా ఏడు రోజుల పాటు జరిగే సంగీత, నత్య, నాటకోత్సవాలు కళాభారతి ఆడిటోరియం శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పద్మశ్రీ పండిట్ విశ్వమోహన్ భట్‌కు ‘నాద విద్య భారతి’ జాతీయ ప్రతిభా పురస్కారం, స్వర్ణ కమలాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కూచిపూడి నత్యకారుడు లీలా సామ్సన్ అందజేశారు. ఎంపీ కె.హరిబాబు జ్ఞాపికను, వీఎండీఏ అధ్యక్షుడు సి.ఎస్.ఎన్.రాజు, కార్యదర్శి జి.ఆర్.కె.ప్రసాద్(రాంబాబు) నూతన వస్త్రాలు, లక్ష రూపాయల చెక్ అందజేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డులు పొందినప్పటికీ సాంస్కతిక రాజధాని విశాఖ నగరంలో ది గ్రేట్ మిలినీయం నాద విద్య భారతి జాతీయ ప్రతిభా పురస్కారం పొందడం ఆనందంగా ఉందన్నారు. పాటలోని స్వరాలకన్నా ఆ నేపథ్యాన్ని ప్రజెంట్ చేసే దృశ్యమే మనస్సుపై ముద్రవేస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఉత్సవాలకు ఆర్థికసాయం చేసిన వైభవ్ జ్యూయలర్స్ అధినేత మల్లిక్మనోజ్ కుమార్తె కార్తిక్ గ్రంధి, బొత్రా గ్రూప్ సంస్థ అధినేత లక్ష్మికాంత్, ఆంధ్రా బ్యాంక్ ప్రతినిధులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఓలలాడించిన వీణా కచేరీ హిందూస్థానీ సంగీత విద్వాంసుడు పద్మశ్రీ పండిట్ విశ్వమోహన్‌భట్ ప్రదర్శించిన మోహన వీణ వాద్య కచేరీ సంగీత ప్రియుల్ని ఓలలాడించింది. పండిట్ విశ్వమోహన్‌భట్ మోహనవీణ రాగ విన్యాసాలకు లయబద్ధంతో సలీమ్ మోహన వీణా సహాయ సంగీతం అందించగా దానికి తగ్గట్టుగా రామ్‌కుమార్ తబలా మంత్రముగ్దుల్ని చేశాయి.