breaking news
Vavara rao
-
సంపద దోచుకునేందుకే బూటకపు ఎన్కౌంటర్లు
కాజీపేట అర్బన్: ప్రకృతి సంపద దోచుకుని కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేందుకే పాలకులు బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని విరసం నేత వరవరరావు అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ చీకటి ఒప్పందాలకు ప్రతీకనే ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ అని పేర్కొన్నా రు. ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దులో ఇటీవల జరిగి న ఎన్కౌంటర్లో మృతి చెందిన దాడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్ సంస్మరణ సభను ఆదివారం కాజీపేట మండలం రాంపేట గ్రామంలోని స్వగృహం లో స్వామి సోదరుడు సమ్మయ్య, బంధువులు ఏర్పాటు చేశారు. స్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించిన అనంతరం వరవరరావు మాట్లాడుతూ ఉన్నత విద్యనభ్యసించిన స్వామి ప్యారా టీచర్‌గా గ్రామాలు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నాడని, బూర్జువా రాజకీయాలు నచ్చక అప్పటి పీపుల్స్‌వార్ నేటి మావోయిస్టు పార్టీలో 1999 సంవత్సరం చేరి అన తి కాలంలో సెంట్రల్ రీజినల్ బ్యూరో ప్రెస్ ఇన్చార్జి, డీసీఎంగా ఎదిగాడని పేర్కొన్నారు. 2009లో చిదంబరం గ్రీన్‌హంట్ పేరిట, నేడు రాజ్‌నాథ్‌సింగ్ సమాధాన్ ఆపరేషన్ పేరిట ఆదివాసులను బూటకపు ఎన్కౌంటర్లలో చంపుతున్నారని అన్నారు. మావోయిస్టుల ఏజెండానే మా ఏజెండా అని నమ్మబలికిన కేసీఆర్ ఆధికారంలోకి రాగానే 39 మంది ఎన్కౌంటర్లలో బలిచేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా పౌరహక్కుల, ప్రజాసంఘాల నాయకులు జోహర్లు అర్పిస్తూ విప్లవగీతాలు ఆలపించారు. కార్యక్రమంలో స్వామి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రజాసంఘాల నాయకులు బండి దుర్గప్రసాద్, బాసిత్, రమాదేవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాకూ వెన్నెలే ఇష్టం, కానీ...
‘రచయితలారా మీరెటు వైపు?’ అన్న ప్రశ్నకు స్పందనగా ఆవిర్భవించిన విప్లవ రచయితల సంఘం, నేడు 45వ ఆవిర్భావ దినం జరుపుకుంటోంది. హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఉదయం 9:30 నుండి వివిధ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ‘విప్లవ కవి’ వరవరరావుతో చిరు ముఖాముఖి: ఏమిటి ఈసారి ప్రధాన ఎజెండా? సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం; భూస్వామ్య సంస్కృతికి కేంద్రస్థానంగా ఉండి, సామ్రాజ్యవాదానికి దళారీ కేంద్రంగా మారిపోయిన కేంద్రానికి వ్యతిరేక పోరాటం. విరసం ఆవిర్భావ సమయానికీ ఇప్పటికీ ఏమైనా తేడా ఉన్నదా? ప్రజల మౌలిక సమస్యల్లో మార్పేమీ లేదు. దళితులకూ ఆదివాసీలకూ వనరుల్లో న్యాయమైన వాటా అందడం లేదు. మీరు కోరేది రాజకీయ మార్పా? సాంస్కృతిక మార్పా? రెండూ. పునాది రాజకీయార్థికమే. దాని సూపర్ స్ట్రక్చర్ సాంస్కృతికం. దానికి సాహిత్యం దోహదం చేస్తుంది. పునాదే సూపర్ స్ట్రక్చర్‌ను ప్రభావితం చేస్తుందనుకునేవాళ్లం. ఇప్పటి అవగాహన ప్రకారం, సూపర్ స్ట్రక్చర్ కూడా పునాదిని ప్రభావితం చేస్తుంది. సృజనశీలికి ప్రత్యక్ష కార్యాచరణతో సంబంధం ఉండాలా? కార్యాచరణలో ఉంటేనే సజీవ సాహిత్యం వస్తుంది. అయితే, ట్రిగ్గర్ మీద వేలు ఉంచినప్పుడు కార్యాచరణలో ఉన్నట్టా? గుడారంలో అలసటగా నడుం వాల్చి కవిత రాస్తున్నప్పుడు కార్యాచరణలో ఉన్నట్టా? ఏది ప్రత్యక్ష కార్యాచరణ? ఏది కాదు? సాహిత్యాన్నీ రాజకీయాన్నీ ఎలా చూడాలి? రాజకీయం కాని సాహిత్యం లేదు. గెలిచినవాళ్లది ప్రధాన స్రవంతి అవుతుంది, గెలవాల్సిన వాళ్లది రాజకీయం అవుతుంది. అంతెందుకు, మన తొలికావ్యాలు రామాయణం, భారతాలు కూడా రాజకీయాలే! తిక్కన మనుమసిద్ధి ఆస్థానంలో ఉండి, యుద్ధరంగాన్ని చూశాడు కాబట్టి, యుద్ధపర్వం అంత బాగా రాశాడంటారు. మేము దండకారణ్యం వెళ్లి చూసి రాసిందేమో రాజకీయ సాహిత్యం అయిపోతుంది. నాక్కూడా వెన్నెల మీదా, పువ్వుల మీదా కవిత్వం చెప్పాలనే ఉంటుంది. కానీ నా వెన్నెలనీ, పువ్వులనీ నాక్కాకుండా చేస్తున్నవాడు కనబడుతున్నప్పుడు అనివార్యంగా నేను ఆ విధ్వంసం గురించే మాట్లాడాల్సి వస్తున్నది. {పాచీన సారస్వతాన్ని మీరు ఎలా చూస్తారు? మనకు చరిత్ర రచన లేదు కాబట్టి, రామాయణ, భారతాలు ఆ లోటు పూడుస్తాయి. బిట్వీన్ ద లైన్స్ చదివినంతవరకూ ఎవరికైనా వాటిపట్ల ఎందుకు అభ్యంతరం ఉండాలి! తెలంగాణలో రాబోయే పాలకపక్షం మీ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తుందన్న నమ్మకంతోనే ‘ప్రత్యేక’ పోరాటానికి మద్దతిచ్చారా? పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మౌలిక ప్రజల ఆకాంక్షను తీర్చదనేదే మా అవగాహన. అయితే, స్వరాష్ట్రం- స్వాభిమానం- స్వపరిపాలన కోసం మేము సైతం తెలంగాణ రాష్ట్రోద్యమంలో పాల్గొన్నాం. మేము ఓపెన్ కాస్టులకు వ్యతిరేకం, భారీ ప్రాజెక్టులకు వ్యతిరేకం. మా ఆలోచనల దిశగా పాలకుల నడక సాగట్లేదు కాబట్టి, ఇప్పుడు వారికి వ్యతిరేకం. ఢిల్లీ సుల్తాన్ల మీద పోరాడిన ప్రతాపరుద్రుడిని మెచ్చుకున్నాం. అదే ప్రతాపరుద్రుడి మీద పోరాడాల్సి వచ్చిన సమ్మక్క సారక్కవైపున్నాం. రచయిత ఎప్పుడూ ప్రతిపక్షంగా ఉండాలి, న్యాయం వైపుండాలి. - షేర్షా ఫొటో: ఎం.అనిల్ కుమార్