-
అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్!
సినిమా: కాస్త అలాంటి పాత్రలివ్వండయ్యా అని రిక్వెస్ట్ చేస్తోంది నటి వసుంధర. పేరాన్మై చిత్రంలో ఐదుగురు యువ కథానాయికల్లో ఒకరిగా నటించిన ఈ అమ్మడు గుర్తుందా? ఈ మధ్య కోలీవుడ్‌కు కాస్త దూరంగా ఉన్న ఈ అమ్మడు సుమారు ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అవును పేరాన్మై చిత్రం తరువాత తెన్మేర్కు పరువకాట్రు చిత్రంతో సోలో హీరోయిన్గా నటించి మంచి పేరు తెచ్చుకున్న వసుంధర దర్శకుడు ఎస్పీ.జననాథన్, సముద్రకని, శీనూ రామస్వామి వంటి ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేసింది. ఇప్పుడు శీనూరామస్వామి దర్శకత్వంలో ఉదయనిధిస్టాలిన్, తమన్నా జంటగా నటించిన కన్నె కలైమానే చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం రేపు (శుక్రవారం) తెరపైకి రానుంది. ఈ సందర్భంగా వసుంధరతో చిన్న చిట్ చాట్. ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ఈ బ్యూటీ బదులిస్తూ కన్నె కలైమానే చిత్రంలో దర్శకుడు శీనూరామస్వామి నాకు చాలా మంచి పాత్రను ఇచ్చారు. ఎప్పుడూ ఆయన చిత్రాల్లో అందరికీ ఇష్టమైన, కొంచెం హాస్యంతో కూడిన, అదే సమయంలో కాస్త కఠినమైన గ్రామీణ యువతి పాత్ర ఒకటుంటుంది. అలాంటి పాత్రనే నేనీ చిత్రంలో నటించాను. ఆ పాత్రను తయారు చేసినప్పుడే నా రూపం మదిలో మెలిగిందని దర్శకుడు శీనూరామస్వామి చెప్పారు. ఇందులో ఉదయనిధిస్టాలిన్ స్నేహితురాలిగా నటించాను. పెద్ద కుటుంబానికి చెందిన అబ్బాయినన్న ఎలాంటి గర్వం లేకుండా మసలుకునే నటుడు ఉదయనిధిస్టాలిన్. ఇక తమన్నాతో కొన్ని సన్నివేశాల్లోనే కలిసి నటించినా అది సరికొత్త అనుభవం. ఈ చిత్రంతో పాటు వాళ్గ వ్యవసాయి అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇందులోనూ గ్రామీణ యువతిగానే కనిపిస్తాను. రాజపాలైయంకు చెందిన మోహన్ అనే నవ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా, మరో పక్క రైతుల ఆత్మహత్యలకు కారణం ఏమిటన్న ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అదేవిధంగా బక్రీద్ చిత్రంలోనూ నటిస్తున్నాను. ఇందులో విక్రాంత్‌కు భార్యగా గ్రామీణ యువతిగానే కనిపిస్తాను. ఒంటె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రం ఇదేనని చెప్పచ్చు. ఇందులో చాలా తక్కువ మేకప్‌తో సహజత్వంతో కూడిన పాత్రలో నటిస్తున్నాను. పెద్ద పెద్ద దర్శకుల చిత్రాల్లో నటించి మధ్యలో గ్యాప్ రావడానికి కారణం ఏమిటని చాలా మంది అడుగుతున్నారు. అందుకు నేను చెప్పేదొక్కటే దేనికైనా టైమ్ రావాలి. ప్రారంభదశలో కమర్శియల్ చిత్రాలు వద్దు, నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తే చాలని భావించాను. దర్శకుడు శీనూరామస్వామి కూడా నీకు సంతృప్తినిచ్చే, ఏళ్లు గడిచిన తరువాత కూడా నువ్వు గర్వపడేలాంటి పాత్రలను ఎంచుకుని నటించు అని సలహా ఇచ్చారు. మరో విషయం ఏమిటంటే చాలా మంది దర్శకులు కథలు చెప్పినప్పుడు గ్రామీణ యువతి పాత్రలనే చెప్పడంతో వాటిని అంగీకరించలేదు. ఆహా సూపర్ పాత్ర. ఎప్పుడు అందులో నటిద్దామా అన్న ఆసక్తిని పెంచే అవకాశం రాలేదు. నేను తమిళ అమ్మాయిని కావడంతో ఏమో గ్రామీణ పాత్రల్లో మీరు బాగా నటిస్తున్నారు అంటూ అలాంటి ముద్ర వేశారు. కాగా అలా సినిమాలకు దూరం అవడంతో నన్ను మరచిపోతారన్న ఆలోచన ఆరంభంలో కలగలేదు. ఇప్పుడు అది నిజం అనిపిస్తోంది. ఇకపై వరుసగా నా చిత్రాలు చూసా ్తరు. అయితే దర్శక నిర్మాతలను నేను కోరుకునేదొక్కటే కాస్త మోడ్రన్ పాత్రలు ఇవ్వండయ్యా అనే. కొత్త దర్శకులు మంచి కథలతో వస్తే పా రితోషికం గురించి పట్టించుకోను అని నటి వసుంధర పేర్కొంది. -
హాట్ సెల్ఫీస్!
ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ తమిళ తార వసుంధర కశ్యప్ బెడ్రూమ్ సెల్ఫీస్. తన బాయ్‌ఫ్రెండ్‌తో బాగా క్లోజ్‌గా ఉండగా తీసుకున్న సెల్ఫీలు సోషల్ సైట్లో అప్లోడ్ అయిపోయాయి. వైరస్‌లా ఇంటర్ నెట్ అంతా పాకేశాయి. వాటిని చూసి షాక్‌తిన్న ఈ సెక్సీ సుందరి... వెంటనే తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ పేజీలను డిలీట్ చేసేసింది. అసలవి తనవి కావని... మార్ఫింగ్ పిక్చర్స్ అని వాపోతోంది. అయితే ఈ అమ్మడే పబ్లిసిటీ కోసం కావాలని ఈ ఫొటోలను అప్లోడ్ చేసిందనేది కొందరి అభిప్రాయం. అలాంటిదేమీ లేదని... వసుంధర స్మార్ట్ ఫోన్‌ను కొందరు ఆకతాయిలు హ్యాకింగ్ చేసి, ఆ బొమ్మలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారన్నది మరికొందరి వాదన. -
వసుంధరా.. ఏమిటీ ఫొటోల గోల?
ఇప్పుడిప్పుడే కాస్త వెలుగులోకి వస్తున్న తమిళనటి వసుంధరా కశ్యప్.. తన బోయ్‌ఫ్రెండుతో కలిసి అభ్యంతరకరమైన రీతిలో ఉన్న ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. వాళ్లిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీలను.. ఎవరో ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి అందులో పెట్టేశారు. సుమారు 8-10 ఫొటోలు ప్రస్తుతం వెబ్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి. వాటిలో కొన్ని ఫొటోల్లో అయితే.. వాళ్లిద్దరూ మరీ సన్నిహితంగా ఉన్నారని జాతీయ మీడియా గగ్గోలు పెడుతోంది. ఆర్య సరసన వచ్చిన 'వట్టరం' సినిమాతో తెరంగేట్రం చేసిన వసుంధరా కశ్యప్.. ఇప్పుడిలా కనిపించడంతో అంతా నోళ్లు నొక్కుకుంటున్నారు. తెలుగులో వచ్చిన 'తూనీగ తూనీగ' సినిమాలో హీరోను తరచు ఏడిపించే పాత్రలో కూడా ఆమె నటించింది. తన బోయ్‌ఫ్రెండుతో కలిసి ఆమె ఉన్న వీడియో కూడా ఆన్లైన్లో లీకైందని సమాచారం. ఇంతకుముందు శింబు - నయనతార లిప్ లాక్ ఫొటోలు , అనిరుధ్ రవిచందర్, ఆండ్రియా ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు కూడా ఇలాగే ఆన్లైన్లో లీకయ్యాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement