breaking news
vasantharao
-
వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
-
వసంతరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సున్నిపెంటలో వైఎస్ఆర్సీపీ నేత వసంతరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. 2015లో టీడీపీ వర్గీయుల చేతిలో వసంతరావు హత్యకు గురయ్యారు. అంతకుముందు శ్రీశైలం చేరుకున్న వైఎస్ జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శ్రీశైలం నుంచి మొదటి విడత రైతు భరోసా యాత్ర గురువారం ప్రారంభమైంది. శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో మొదటి రోజు ఆయన పర్యటన కొనసాగుతోంది. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు.