breaking news
Valentines Day Telugu Wishes
-
విశాఖపట్నం : ప్రేమసాగరం ఆర్కేబీచ్లో ప్రేమికుల సందడి (ఫొటోలు)
-
బేగంపేట : హుషారుగా..డార్లింగ్స్ డే.. (ఫొటోలు)
-
వాలెంటైన్స్ డేకి మీ ఇష్టసఖిని ‘ది బెస్ట్’తో సర్ప్రైజ్ చేయండిలా.. (చిత్రాలు)
-
#HappyProposeDay : హ్యాపీ ప్రపోజ్ డే మై లవ్! (ఫొటోలు)
-
#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)
-
Valentine's day : లవ్బర్డ్స్కి వారమంతా సందడే ఇలా! (ఫొటోలు)
-
Valentines Day 2023: స్పెషల్ గిఫ్ట్స్ కోసం యువత ఇలా..
-
Valentine's Day 2023: వాలైంటెన్స్ విషెస్ ఇలా ఎమోషనల్గా ఎప్పుడైనా చెప్పారా?
ప్రేమ సత్యం.. ప్రేమ నిత్యయవ్వనం..ప్రేమ వినూత్నం..ప్రేమ మధురం..ప్రేమను ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. తడారిపోయిన మనసుల్లో పచ్చని ఆశలు చిగురింపజేసేది ప్రేమ. శిలలాంటి మనిషికి జీవం పోసేది ప్రేమ. కులమతాలను, దేశ సరిహద్దులను చెరిపేసేది ప్రేమ...ధనిక, పేద తారతమ్యాన్ని చెరిపేస్తుంది..బంధాలను వేరుచేసినా..బాంధవ్యాలను దగ్గరికి చేరుస్తుంది. ప్రేమైక జీవనం తనువులు వేరైనా..మనసులు ఒకటని చాటిచెప్తుంది. ప్రేమలో విజయం సాధించి, ఆదర్శంగా నిలిచిన వారి మధురానుభూతులు, జ్ఞాపకాలను నెమరేసుకునే రోజు. ‘ప్రేమికుల దినోత్సవం’. మరి ప్రేమికులు వాలెంటైన్స్ డేను జరుపుకోండిలా.. మీ ప్రేమను మరింత పదిలంగా ఉంచుకోండిలా..! మంటలోని మౌనం ప్రేమ.. మరుజన్మకు ప్రాణం ప్రేమ... హ్యాపీ వాలెంటైన్ డే 2023 నువ్వు ప్రేమించే వాళ్లు ఎంత మందైనా దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్లు దొరకడం నీ అదృష్టం ప్రేమికుల రోజు శుభాకాంక్షలు నిన్ను చూడాలని తపించే కనులకు ఎలా చెప్పను .. హ్యాపీ వాలెంటైన్ డే 2023 నువ్వు నాలోనే ఉన్నావని ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ఉదయించే సూర్యడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తే..నీరాక నా జీవితంలోకి వెలుగు నింపింది హ్యాపీ వాలెంటైన్ డే ఓటమినైనా ఓడదు ప్రేమ చితిలోనైనా కాలదు ప్రేమ .. హ్యాపీ వాలెంటైన్ డే 2023 జీవితమంతా... నీ ప్రేమలో కరిగిపోతాను నీ జీవితంలో ముత్యాన్నై వెలిగిపోయేలా చేస్తావుకదూ...హ్యాపీ వాలెంటైన్ డే 2023 ఎదలో ప్రేమ ఉంటే నిన్ను మరువగలను నీ ప్రేమ నా హృదయమైతే ఎలా మరిచిపోను .. హ్యాపీ వాలెంటైన్ డే 2023 పరిస్థితుల్ని బట్టి మారిపోయేది ప్రేమ కాదు పరిస్థితుల్ని అర్థం చేసుకునేది అసలైన ప్రేమ.. హ్యాపీ వాలెంటైన్ డే 2023 నువ్వు ప్రేమించే వాళ్లు ఎంత మందైనా దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్లు దొరకడం నీ అదృష్టం.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు నువ్వులేని ఈ క్షణము ఓ యుగంలా ఉంది.. యుగమంతా ఎదురుచూస్తా నీతో గడిపే ఆ క్షణం కోసం పరిస్థితుల్ని బట్టి మారిపోయేది ప్రేమ కాదు పరిస్థితుల్ని అర్థం చేసుకునేది అసలైన ప్రేమ ఎదలో ప్రేమ ఉంటే నిన్ను మరువగలను నీ ప్రేమ నా హృదయమైతే ఎలా మరిచిపోను మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ జీవితమంతా... నీ ప్రేమలో కరిగిపోతాను నీ జీవితంలో ముత్యాన్నై వెలిగిపోయేలా చేస్తావుకదూ... నేను లేకుండా నువ్వు ఉండగలవేమో. నువ్వు లేకుండా క్షణం కూడా నేను ఉండలేను. ఎందుకంటే నువ్వే నా ప్రాణం అయిపోయావు కాబట్టి. నిన్ను కలిసే వరకు ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదు.. హ్యాపీ వాలెంటైన్ డే 2023 నా జీవితంలో ప్రేమ మరియు సంతోషం తెచ్చినందుకు ధన్యవాదాలు. ఐ లవ్ యు నువ్వే నా సర్వస్వం అని చెప్పినా.. అది చిన్న మాటే అవుతుందేమో.. ఆల్ రెడీ నేను నువ్ అయిపోయాను. రాత్రి పడుకునేముందు చివరి ఆలోచన.. ఉదయం లేచాక మెుదటి ఆలోచన నువ్వే.. ఐ లవ్ య్యూ. జీవితంలో సంతోషంగా ఉండాలంటే.. ఆస్తులు అవసరం లేదు.. నువ్వు చాలు.. నాకు నువ్ ఎంత దూరంలో ఉన్నా.. నా మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటావ్.. నా ప్రేమకు అర్థం లేదు.. నీ తోడు లేకుంటే.., నా కనుచూపునకు ప్రపంచం నచ్చడం లేదు.. నువ్వు కనపడకుంటే.., నా జీవిత గమనానికి గమ్యం లేదు.. నీతో ఏడు అడుగులు వెయ్యకుంటే.., నా మనసుకు ఓదార్పు లేదు నీ స్వరం వినపడకుంటే. ప్రతి ఉదయం సూర్యుడి రాకతో నీ కోసం చూస్తున్నా.. ప్రతి రాత్రి వెన్నెల వెలుగుల్లో నీ స్పర్శ కోసం తపిస్తున్నా.. అద్దంలాంటి నా మనసు నీకు ఇచ్చేసా.. వెన్నలాంటి నా హృదయం నీకే రాసిచ్చా.. నా ఒంటరి తనం దూరం చేసి.. నన్ను అల్లుకో.. నువ్ ఏడిస్తే చూడలేను.. నీకు కష్టం వస్తే తట్టుకోలేను.. అందుకే నీ నీడలా నీతోనే ఉంటాను నేను. నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు నీ జ్ఞాపకం తప్ప! నువ్వు నా పక్కనుంటే నేనే ఉండను నువ్వు తప్ప! నీవే నా అంతం… నీవే నా అంతరాత్మ.. నీవే నా పరమాత్మ… నీవే నా మరో జన్మాత్మ…! భాషలు వేరయినా భావాలు ఒక్కటే మనసులు వేరయినా మమతానురాగాలు ఒక్కటే దారులు వేరయినా మన ప్రేమ ఒక్కటే ప్రియా . మనల్ని నిజంగా ప్రేమించాలనుకునే వారికి, మనలోని లోపాలు కూడా అందంగానే కనిపిస్తాయి. ప్రపంచంలో అత్యంత అందమైనది, ఊహలకు అందనిది ప్రేమ. అది వర్ణనాతీతమైనది. ప్రేమను చెప్పడానికి నిమిషం చాలు, కానీ ఆ ప్రేమను చూపడానికి జీవితం సరిపోదు. నా బలం నువ్వే, నా బలహీనతా నువ్వే, నా సంతోషం నువ్వే, నా తియ్యని బాధ నువ్వే.కాలాలు మారినా, నీపై నా ప్రేమ కలకాలం ఉంటుంది. కలలో కూడా అనుకోలేదు నా అదృష్టం నీ రూపంలో వస్తుందని... నా జీవితంలోకి వచ్చినందుకు నీకు వేలవేల కృతజ్ఞతలు. మరచిపోవటానికి నువ్వు నా గతం కాదు జ్ఞాపకం. ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం తిరిగి ప్రేమను ఆశించటం కాదు. జీవితం ఒక ప్రయాణం … జీవనం ఒక ప్రమాణం అని ఎవరో అన్నారు నీతో జీవితం నాకు ప్రయాణం కావాలి నీ ప్రేమ నాకు ప్రమాణం కావాలి.