breaking news
vaddanam
-
వరుడు కావలెను నుంచి 'వడ్డాణం' సాంగ్ రిలీజ్
Vaddaanam Song From Varudu Kaavalenu: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘దిగు దిగు దిగు నాగ, మనసులోనే నిలచిపోకే పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. తాజాగా 'వడ్డాణం' అనే ఫన్ అండ్ పెప్పీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎస్ఎస్ థమన్ ఈ పాటను సంగీతం అందించారు. 'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు..వయ్యారం చిందేసే అందాల బొమ్మలు'..అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. రిలీజ్ అయిన కాసేపటికే వ్యూస్ పరంగా దూసుకెళ్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
నడుము మంత్రసిరి
ఈ మధ్యన వడ్డాణాలు కనిపించడం లేదు. కాదు కాదు ఈ ‘నడుమ’న వడ్డాణాలు కనిపించడం లేదు. చెవులకు జూకాలు, ముక్కుకు బేసర, కంఠానికి హారం, చేతులకు గాజులు ఎలాగో... నడుముకు నాయనమ్మ వడ్డాణం అలాగ. కానీ ఇప్పుడు నాయనమ్మ వడ్డాణాలకు బదులు నయా వడ్డాణాలు వచ్చేశాయి.మధ్యలో డబ్బు వస్తే నడమంత్రపు సిరి అంటారు. అలాగే కొత్తగా వచ్చిన ఈ డిజైనర్ బెల్టులు నడుము మంత్ర సిరులు. వీటిని చుట్టుకోండి... మంత్రముగ్ధుల్ని చేయండి. ఆభరణాలలో కొన్నింటి స్థానం ఎప్పుడూ పదిలంగా ఉంటుంది. అందులో ముందుండే నగ వడ్డాణం. సన్నని నడుమును పట్టి ఉంచే ఈ నగ అందంగా, ఆకర్షణీయంగా ఆక ట్టుకుంటుంది. అయితే, ఇక్కడే చిన్న మార్పు. బంగారు వడ్డాణం అవుట్‌డేటెడ్ లిస్ట్‌లో చేరిపోయింది. దాని స్థానంలోనే స్టైల్‌ని పెంచే ఆధునిక వడ్డాణాలు బెల్ట్‌లుగా మారి డిజైనర్ల దృష్టిలో పడ్డాయి. బాలీవుడ్‌నే కాదు టాలీవుడ్ తారలనూ ఆకట్టుకున్న ఈ డిజైనర్ బెల్ట్‌లు కొత్త వడ్డాణాలుగా అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నాయి. అందంగా రూపు కట్టు... ఆరు గజాల చీర నుంచి... చిట్టి పొట్టి స్కర్టుల వరకు నడుము చుట్టూ అల్లుకొని తళుక్కుమంటూ మెరిసిపోవడానికి మెటల్ బెల్ట్ సిద్ధమైంది. స్టీల్ బెల్ట్‌గా ఫ్యాషన్ ప్రపంచం నడుమును చుట్టేస్తున్న ఇది ప్లెయిన్‌గా ఉండి, ప్లెయిన్ డ్రెస్సుల మీదకే అందంగా అమరుతోంది. దీంతోపాటు కాపర్, బ్రాస్ మెటల్స్లలో కూడా అమ్మాయిల నడుము నగల జాబితాలో ఈ బెల్ట్‌లు అందంగా అమరిపోయాయి. ‘ముడి’తో ఆకట్టు... బెల్ట్ అంటే బకిల్ ఉండాలి.. పక్కన రంధ్రాలుండాలి అనుకుంటారంతా. అంతేకాదు కేవలం ప్యాంట్ షర్ట్ల మీద మాత్రమే పెట్టుకునేది అనుకుంటారు. కానీ ఈ బెల్ట్‌లో అలాంటివేవీ కనిపించవు. ఇలాంటి డ్రెస్ మీదే పెట్టుకోవాలని రూలూ లేదు. చీరల మీద మ్యాచింగ్ అయ్యే మెటీరియల్‌తోనూ తయారుచేసినవి లభిస్తున్నాయి. వీటిని చీర, గౌన్ ఏదైనా కాంట్రాస్ట్ కలర్ బెల్ట్ ఎంచుకుంటే చక్కగా నప్పుతుంది. సన్నని నడుము గలవాళ్లే కాదు.. లావు ఉన్న వాళ్లు కూడా మరింత నాజూకుగా కనిపించేందుకు ఈ బెల్ట్‌లను వాడుతున్నారు. జపాన్‌లో పుట్టి బాలీవుడ్ మీదుగా టాలీవుడ్‌కు అటు నుంచి అందరికీ చేరువైన ఈ బెల్ట్‌కు ఓబిఐగా పేరుంది. మనదగ్గర శుభకార్యాలలో వడ్డాణాలు ఎలా ధరిస్తారో... జపాన్‌లో పెళ్లి డ్రెస్ మీద ఓఐబి బెల్ట్‌ను అలా ధరిస్తారు. దాన్నే ముద్దుగా వారు ‘సాష్’ అని కూడా పిలుస్తారు. మంచి రంగు ఉన్న సాదా రంగు రిబ్బన్ ముక్కను నడుము చుట్టూ అందంగా ముడి వేసేది ఓబీఐ నాట్. ఈ ముడిలోనే అందమంతా దాగి ఉంటుంది. ఇవి రిబ్బన్లే కాకుండా.. లెదర్, మెటాలిక్, కాపర్, మిర్రర్.. మెటీరియల్స్‌తో తయారుచేసి ఈ తరహా బెల్ట్‌లతో మగువల మనసులు దోచేస్తున్నారు డిజైనర్లు. బాలీవుడ్, టాలీవుడ్ భామలు వీటితో సరికొత్తగా ర్యాంప్ మీద కనువిందు చేస్తున్నారు. డిజైనర్ల చేతిలో రూపుదిద్దుకొని మార్కెట్లో అందంగా కొలువుదీరిన ఇవి షాపింగ్ మాల్స్, డిజైనర్ స్టోర్స్, ఆన్లైన్ మార్కెట్లలోనూ డిజైన్, నాణ్యతను బట్టి రూ.300 నుంచి లభిస్తున్నాయి. మనదైన ‘కళ’... రాజస్తాన్ వైభవం ఉట్టిపడేలా, గిరిజన సంస్కృతి కళ్లకు కట్టేలా చేతిపనితనం నడుం పట్టీలపై కొత్తగా రూపుదిద్దుకుంటుంది. అద్దాలు,పూసలను ఉపయోగిస్తూ చేసే ఆ పనితనానికి మగువలు మరీ ముచ్చటపడి నడుమున అలంకరించుకుంటున్నారు. లేస్, జరీ మెరుపులతో తయారుచేసిన ఎంబ్రాయిడరీ బెల్టుల్లో కుందన్స్నూ మెరిపిస్తున్నారు. ఈ తరహా డిజైనరీ బెల్ట్‌లు డిజైన్‌ను బట్టి రూ.200 నుంచి లభిస్తున్నాయి. నడుము సొగసును పెంచే ఈ నవ్యాభరణం విభిన్న డిజైన్లలో అమ్మాయిల మదిని గిలిగింతలుపెడుతూ సరికొత్త స్టైల్లో కనువిందుచేస్తోంది. - ఎన్.ఆర్ -
మంత్రికి వడ్డాణం గిప్ట్, బాబు సీరియస్!
హైదరాబాద్ : దాదాపు ముప్పై ఏడున్నర లక్షల విలువైన ఓ వడ్డాణం...ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో సంచలనం రేపుతోంది. ఓ మహిళా మంత్రికి గ్రానైట్ వ్యాపారులు బంగారు వడ్డాణం గిప్ట్గా ఇచ్చినట్టు వచ్చిన వార్త....సచివాలయంలో టాక్ ఆఫ్ టుడేగా మారిపోయింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహిళా మంత్రిని పిలిచి వివరణ అడిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు ఇటీవలే ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు ఆమెకు సుమారు రూ.37 లక్షల విలువైన బంగారు వడ్డాణం కానుకగా ఇచ్చినట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి సోదరుడు...దగ్గరుండి ఈ తతంగాన్ని నడిపించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను మంత్రి పీతల సుజాత తీవ్రంగా ఖండించారు. తాను ఎవరి దగ్గరా బహుమతులు తీసుకోలేదని....ఆ వడ్డాణం కథతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇదంతా తనపై సాగుతున్న దుష్ప్రచారమని పీతల సుజాత ఆరోపించారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఎలాంటి వివరణ కోరలేదని ఆమె తెలిపారు. తనకు గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేసిన మాట వాస్తవమేనని అయితే వారు తనకు ఎలాంటి గిప్ట్‌లు ఇవ్వలేదన్నారు.