uzma
-
‘మృత్యు కుహరం’ నుంచి తప్పించుకున్నా!
పాక్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ఉజ్మా వ్యాఖ్య ►వాఘా సరిహద్దు ద్వారా ఇంటికి.. ►‘భారత పుత్రిక’కు స్వాగతం: సుష్మా న్యూఢిల్లీ/లాహోర్: ‘పాకిస్తాన్ ఓ మృత్యు కుహరం. ఆ దేశంలోకి వెళ్లడం సులువు. కానీ అక్కడి నుంచి బయట పడటం దాదాపు అసాధ్యం’... తనను బలవంతంగా పెళ్లి చేసుకున్న పాకిస్తానీ చెర నుంచి భారత్‌కు తిరిగొచ్చిన సందర్భంగా ఢిల్లీ యువతి ఉజ్మాఅహ్మద్ ఉద్వేగంతో చేసిన వ్యాఖ్యలివి. పాక్ విడిచి స్వదేశానికి వెళ్లేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు 20 ఏళ్ల ఉజ్మాకు బుధవారం అనుమతినిచ్చింది. ఈ క్రమంలో ఆమె భారత దౌత్యవేత్తలు, పాకిస్తాన్ పోలీసుల భద్రతా వలయంలో అమృత్సర్ సమీపంలోని వాఘా సరిహద్దు ద్వారా గురువారం దేశంలోకి అడుగుపెట్టింది. అనంతరం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఇస్లామాబాద్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ తదితరులతో కలసి ఉజ్మా వివరాలు వెల్లడించింది. ‘పాకిస్తాన్ ఓ మృత్యు కుహరం. పెళ్లి తరువాత అక్కడికి వెళ్లిన ఎంతో మంది మహిళల దుస్థితి చూశాను. అక్కడ వారు ఎంతో దారుణ, భయానకమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు, నలుగురేసి భార్యలు కూడా ఉన్నారు’అని ఉజ్మా ఆవేదనగా చెప్పింది. తుపాకీ గురిపెట్టి పాకిస్తాన్‌కు చెందిన తాహిర్ అలీ తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె తెలిపింది. అనంతరం తనకు నిద్ర మాత్రలు ఇచ్చి బునెర్కి తీసుకెళ్లాడని, అది తాలిబన్ల అధీనంలో ఉన్న ప్రాంతంలా ఉందని చెప్పింది. ఆలస్యమయ్యుంటే శవమయ్యేదానిని... ‘మరికొన్ని రోజులు అక్కడ ఉండుంటే శవమై ఉండేదాన్ని. నేను స్వదేశానికి రావడంలో సహకరించిన సుష్మాస్వరాజ్, భారత దౌత్య అధికారులకు ధన్యవాదాలు. ప్రభుత్వం తరఫున చొరవ చూపినందుకు ప్రధాని మోదీని కలసి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా’ అంటూ కన్నీటి పర్యంతమైంది ఉజ్మా. భారత్‌లాంటి గొప్ప ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదనీ అన్నారు. ప్రభుత్వం తనకు ఇంత సాయం చేస్తుందని అనుకోలేదనీ, హై కమిషన్‌లో రెండు లేదా మూడేళ్లైనా ఉండొచ్చనీ సుష్మ తనకు చెప్పారన్నారు. తన ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లు భర్త తాహిర్ అలీ లాక్కున్నాడని, తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడని, అవి ఇప్పించి, స్వదేశానికి వెళ్లేలా ఆదేశాలివ్వాలంటూ ఉజ్మా లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై స్పందించిన కోర్టు... ఆమె భారత్ వెళ్లేందుకు అనుమతినిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. పాక్‌కు ధన్యవాదాలు: సుష్మా వాఘా సరిహద్దు ద్వారా దేశంలోకి అడుగుపెట్టిన ఉజ్మాను ‘భారత పుత్రిక’గా అభివర్ణిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఆమెకు స్వాగతం పలికారు. ఉజ్మా విషయంలో చొరవ చూపినందుకు పాక్ ప్రభుత్వం, అక్కడి న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, పాక్ విదేశాంగ, హోం శాఖలు కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. ఉజ్మా న్యాయవాది బారిస్టర్ షాన్వాజ్ ఆమెను తన బిడ్డలా భావించారని, జస్టిస్ మోహిసిన్ అక్తర్ కియానీ మానవీయ కోణంలో కేసును చూశారని అన్నారు. ఉజ్మా వాఘా సరిహద్దు దాటిన వెంటనే ఊపిరి పీల్చుకున్నానన్నారు. -
అడుగుపెట్టగానే మాతృభూమిని ప్రేమగా తాకి..
-
అడుగుపెట్టగానే మాతృభూమిని ప్రేమగా తాకి..
న్యూఢిల్లీ: ఆమెకు నిజంగా ప్రాణం లేచివచ్చినట్లయింది. భయం ఎగిరిపోయి కొత్త ఆశలు ఒడిలో చేరినట్లయింది. తన దయనీయ పరిస్థితి నుంచి బయటపడతానా.. తిరిగి ఎప్పటి జీవితంలో అడుగుపెడతానా.. తన దేశ స్వేచ్ఛా వాయువులను పీల్చే అవకాశం వస్తుందా.. ఆ అవకాశం వచ్చేలోగా ఎలాంటి ఉపద్రవం తనను ముంచివేస్తుందో అనే ఆందోళనలన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలయ్యాయి. దాయాది దేశం దాటి భారత గడ్డపై అడుగుపెట్టిన మరుక్షణమే ఆమె అడుగు ఓ క్షణం ఆగిపోయింది. అమాంతం తన తల్లి పాదాలను మొక్కినట్లుగా భారతదేశ మట్టిని మనస్ఫూర్తిగా తాకి నమస్కారం చేసింది. పాక్ వాఘా సరిహద్దు గుండా తన మాతృదేశం(భారత్)లోకి సగర్వంగా అడుగుపెట్టింది. పాక్‌లో మోసపోయిన భారత యువతి ఉజ్మా గురువారం తిరిగి భారత్‌లో అడుగుపెట్టింది. పాకిస్థాన్ అధికారులు ఒకపక్క, భారత హైకమిషన్‌కు చెందిన అధికారులు మరోపక్క, ఆమెకు తోడుగా రాగా వాఘా సరిహద్దు దాటి దేశంలోకి వచ్చింది. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన ఆమె ముందుగా భారత్ మట్టికి వందనం సమర్పించుకుంది. అనంతరం బయలుదేరిన ఆమె తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితిని వివరించింది. ఒక రోజు తర్వాత ఆమెను ఢిల్లీలోని తన బంధువుల ఇంటికి పంపించనున్నారు. ఈ నెల(మే) ప్రారంభంలో ఇస్లామాబాద్ వెళ్లిన ఉజ్మాను తాహిర్ అలీ అనే వ్యక్తి తుపాకీతో బెదిరించి వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమె ట్రావెలింగ్ పేపర్లు తీసుకెళ్లి అక్కడే ఉండిపోయేలా ప్లాన్ చేశాడు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. వీరిద్దరికి అంతకుముందే మలేషియాలో పరిచయం ఉందంట. ఆ మేరకే పాక్ వెళ్లిన ఆమెను తాహిర్ బలవంతంగా వివాహం చేసుకొని వారంలోనే నరకంగా చూపించడంతో ఆమె నేరుగా భారత్ హైకమిషన్‌కు వెళ్లి సాయం కోరడం, అనంతరం ఇస్లామాబాద్ హైకోర్టు కూడా ఉజ్మా భారత్ వెళ్లేందుకు అనుమతించడంలాంటివి చకచకా జరిగిపోవడంతో ఆమె తిరిగి ఊపిరి పీల్చుకుంది. దాదాపు తనకు నరకంలోకి పోయి వచ్చినట్లయిందని ఆమె తన అనుభవాన్ని చెప్పింది. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఆమె స్వాగతం అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
భారత్ బిడ్డకు స్వాగతం: సుష్మా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వ్యక్తి తుపాకీ గురి పెట్టి పెళ్లి చేసుకున్నభారత మహిళ ఎట్టకేలకు భారత్‌కు తిరిగి వచ్చింది. ఈమె రాకపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీటర్లో స్పందించింది. ‘భారత బిడ్డకు స్వాగతం.. మీరు ఎదుర్కొన్న పరిస్థితిలన్నింటికి నేను క్షమాపణ చెబుతున్నా’ అని ట్వీట్ చేసింది. ఉజ్మా అనే 20 ఏళ్ల భారతీయ మహిళ గత నెలలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు వెళ్లి తనను భారత్‌కు పంపించాలని, తనకు తుపాకీ గురిపెట్టి మరీ తాహిర్ అలీ అనే ఓ వ్యక్తి వివాహం చేసున్నాడని విజ్ఞప్తి చేసుకుంది. ఆ తర్వాత ఇస్లామాబాద్ కోర్టుకు వెళ్లిన ఉజ్మా.. తాహిర్ తనను వేధిస్తున్నాడని, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తనకు తన దేశం వెళ్లే అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ కేసును విచారించిన కోర్టు భారత్ వెళ్లేందుకు రక్షణ కల్పించాలని, వాఘా సరిహద్దు దాటి వెళ్లే వరకు భద్రంగా చూడాలని పోలీసుశాఖను ఆదేశించింది. దీంతో నేడు( గురువారం) ఆమె క్షేమంగా భారత్ కు చేరింది. -
పాక్ లో భారత మహిళకు విముక్తి
-
పాక్ లో భారత మహిళకు విముక్తి
న్యూఢిల్లీ: ఎట్టకేలకు భారత మహిళకు పాకిస్థాన్‌లో విముక్తి లభించింది. బలవంతంగా తనను పెళ్లి చేసుకున్న ఓ పాకిస్థాన్ వ్యక్తి నుంచి విడిపోయి తిరిగి భారత్ వచ్చేందుకు పాక్‌లోని ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు పాక్‌కు చెందిన ఓ టీవీ చానెల్ తెలిపింది. ఉజ్మా అనే 20 ఏళ్ల భారతీయ మహిళ గత నెలలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు వెళ్లి తనను భారత్‌కు పంపించాలని, తనకు తుపాకీ గురిపెట్టి మరీ తాహిర్ అలీ అనే ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడని విజ్ఞప్తి చేసుకుంది. ఆ తర్వాత ఇస్లామాబాద్ కోర్టుకు వెళ్లిన ఉజ్మా.. తాహిర్ తనను వేధిస్తున్నాడని, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తనకు తన దేశం వెళ్లే అనుమతి ఇవ్వాలని కోరింది. తనకు ప్రాణహానీ కూడా ఉందంటూ అందులో పేర్కొంది. ఆమె పిటిషన్‌ను విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు బెంచ్ జస్టిస్ మోసిన్ అక్తర్ ఖయానీ ఆమెకు భారత్ వెళ్లేందుకు అనుమతిచ్చారు. అయితే, ఉజ్మాను కలిసేందుకు అనుమతివ్వాలంటూ తాహిర్ కోరగా తన గదిలో మాత్రమే కలవాలని న్యాయమూర్తి చెప్పారు. అయితే, అతడిని కలిసేందుకు ఉజ్మా నిరాకరించింది. దీంతో ఉజ్మా భారత్ వెళ్లేందుకు రక్షణ కల్పించాలని, వాఘా సరిహద్దు దాటి వెళ్లే వరకు భద్రంగా చూడాలని న్యాయమూర్తి పోలీసుశాఖను ఆదేశించారు. ఈ నెల 30కే ఆమె వీసా గడువు ముగియనున్న నేపథ్యంలో త్వరగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. -
ఢిల్లీకి వెళ్లిపోతా.. భద్రత కల్పించండి!
-
ఢిల్లీకి వెళ్లిపోతా.. భద్రత కల్పించండి!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నుంచి ఢిల్లీ తిరిగి వెళ్లేందుకు తనకు భద్రత కల్పించాల్సిందిగా పెళ్లి కోసం పాక్‌కు వెళ్లి మోసపోయిన భారతీయ యువతి ఉజ్మా శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టును కోరారు. ఢిల్లీచెందిన ఉజ్మా పాకిస్తాన్‌కు చెందిన తాహిర్ అలీని మలేసియాలో కలుసుకుని, పెళ్లి చేసుకునేందుకు పాక్‌కు ఈ నెల 1న పాక్‌కు వెళ్లడం తెలిసిందే. అప్పటికే అలీకి పెళ్లయ్యి నలుగురు పిల్లలు కూడా ఉన్నారనీ, ఈ విషయం ముందుగా తనకు చెప్పకుండా పాక్‌కు వచ్చాక మోసగించి, బెదిరించి అలీ తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. తన పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలను కూడా అలీ దొంగిలించాడని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఉజ్మా పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉంటున్నారు. భారత్‌కు తిరిగి వెళ్లేందుకు తనకు భద్రత కల్పించడంతోపాటు డూప్లికేట్ ప్రయాణ ప్రతాలను అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాలని ఆమె ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫొటోలు తీసినందుకు క్షమాపణ చెప్పిన భారత అధికారి ఊజ్మ కేసు విచారణ సాగుతుండగా పాక్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న పియూష్ సింగ్ అనే సీనియర్ అధికారి కోర్టు లోపల ఫొటోలు తీశారు. ఇది కోర్టు నియమాలకు విరుద్ధం. ఈ విషయం న్యాయమూర్తి దృష్టికి వెళ్లడంతో పియూష్ సింగ్ లిఖిత పూర్వకంగా కోర్టుకు క్షమాపణలు చెప్పారు. -
‘తుపాకీ గురిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు’
ఇస్లామాబాద్: తలకు తుపాకీని గురిపెట్టి మరీ పాకిస్థాన్ వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ భారతీయురాలు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. తిరిగి తనను మాతృదేశం(భారత్) పంపించే వరకు వెళ్లబోనంటూ స్పష్టం చేసింది. మరోపక్క, ఆమె భర్త మాత్రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక వర్గాల సమాచారం ప్రకారం ఉజ్మా అనే భారతీయ మహిళకు తాహిర్ అలీ పాక్ వ్యక్తికి మలేషియాలో పరిచయం అయింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో తన బంధువులను చూసేందుకు వెళుతున్నానని చెప్పి ఉజ్మా వాఘా సరిహద్దు గుండా మే 1న పాక్‌కు వెళ్లింది. అక్కడే వారి వివాహం మే 3న అయినట్లు తెలుస్తోంది. అయితే, అతడికి అంతకు ముందే వివాహం అయినట్లు, నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం ఉజ్మాకు తెలియదు. పైగా, కేవలం చూసేందుకు వెళ్లిన తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా బెదిరించి, తుపాకీ గురి పెట్టి మరి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, అప్పటి నుంచి శారీరకంగా, లైంగికంగా హింసిస్తున్నాడంటూ భారత హైకమిషనర్‌ను ఆశ్రయించింది. వెంటనే తనను భారత్ పంపించాలని, తన వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ దస్తా వేజులు కూడా వారు దొంగిలించారని ఆరోపించింది. ఈ విషయంపై అటు ఇండియాలోని పాక్ హైకమిషనర్, పాక్‌లోని భారత హైకమిషనర్ సమన్వయ పరుస్తున్నాయి.