breaking news
Utilise
-
అడ్వాన్స్ పీజీ ఎమర్జెన్సీ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి
నకిరేకల్ : అడ్వాన్స్ పిజి ఎమర్జెన్సీ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని 108 జీవీఎం ఈఎంఆర్ఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రహ్మానందరావు సూచించారు. నకిరేకల్‌లోని స్థానిక ఏవీఎం విద్యాసంస్థలో బుధవారం విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డిగ్రీలో బీఎస్సీ సైన్స్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన అనంతరం రూ.17వేల వేతనంతో కూడిన ఉద్యోగం కల్పిస్తామన్నారు. అనంతరం స్థానిక 108 కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 35 అంబులెన్స్‌లతో అత్యవసర సేవలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. అనంతరం పుష్కరాల సమయంలో 14 అంబులెన్స్‌ల ద్వారా అత్యవసర సేవలు అందించిన సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ బాలకృష్ణ, డివిజన్ అధికారులు ఎస్కే సలీం, దుర్గా ప్రసాద్, సిబ్బంది యాదగిరి, కిరణ్, రమేష్‌రెడ్డి, సేతుపాల్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆరోగ్యలక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలి
కోదాడఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని 5వ వార్డు కౌన్సిలర్ ఎస్కె.షఫీ కోరారు. శనివారం పట్టణంలోని 5వ వార్డు పరిధిలోని 1వ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కోటేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం పాలు, గుడ్లు వంటి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా పౌష్టికాహార వస్తువులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఇందిర, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.