అడ్వాన్స్‌ పీజీ ఎమర్జెన్సీ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి | utilise advanced emergency pg cources | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్‌ పీజీ ఎమర్జెన్సీ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి

Sep 29 2016 1:13 AM | Updated on Sep 4 2017 3:24 PM

అడ్వాన్స్‌ పీజీ ఎమర్జెన్సీ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి

అడ్వాన్స్‌ పీజీ ఎమర్జెన్సీ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి

అడ్వాన్స్‌ పిజి ఎమర్జెన్సీ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని 108 జీవీఎం ఈఎంఆర్‌ఐ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ బ్రహ్మానందరావు సూచించారు.

నకిరేకల్‌ : అడ్వాన్స్‌ పిజి ఎమర్జెన్సీ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని 108 జీవీఎం ఈఎంఆర్‌ఐ  చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌  బ్రహ్మానందరావు సూచించారు. నకిరేకల్‌లోని స్థానిక ఏవీఎం విద్యాసంస్థలో బుధవారం విద్యార్థులకు ఏర్పాటు చేసిన  అవగాహన సదస్సులో ఆయన  మాట్లాడారు. డిగ్రీలో బీఎస్సీ సైన్స్‌  పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన అనంతరం రూ.17వేల వేతనంతో కూడిన ఉద్యోగం కల్పిస్తామన్నారు. అనంతరం స్థానిక 108 కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 35 అంబులెన్స్‌లతో అత్యవసర సేవలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. అనంతరం పుష్కరాల సమయంలో 14 అంబులెన్స్‌ల ద్వారా అత్యవసర సేవలు అందించిన సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ బాలకృష్ణ, డివిజన్‌ అధికారులు ఎస్‌కే సలీం, దుర్గా ప్రసాద్, సిబ్బంది యాదగిరి, కిరణ్, రమేష్‌రెడ్డి, సేతుపాల్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement