breaking news
Uriki Uttarana Movie
-
చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగా, ఆయనే నాకు స్ఫూర్తి: యంగ్ హీరో
మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చానని యువ హీరో నరేన్ వనపర్తి అన్నారు. తొలి మూవీ ‘ఊరికి ఉత్తరాన’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నరేన్. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ప్రముఖ నటుడు, దివంగత జయప్రకాశ్ రెడ్డి(జేపీ) కూతురు శ్రీ మల్లికా రెడ్డి నిర్మాతగా వ్యవహరించే ఓ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ జయప్రకాశ్ రెడ్డి ప్రొడక్షన్స్ లో అవినాశ్ కోకటి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇది ఇటీవలే ప్రారంభమైంది. మరో సినిమా కూడా త్వరలో ప్రారంభం అవుతుంది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న యువ హీరో నరేన్ వనపర్తి మాట్లాడుతూ... ‘ఎన్ని సినిమాల్లో నటించామనేది ముఖ్యం కాదు... మంచి సినిమాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలనేదే నా ధ్యేయం. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూస్తూ పెరిగా. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని అనుకునే వాణ్ని. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు ఫస్ట్ బాగా చదువుకోవాలి. జీవితంలో స్థిరపడాలి అని అనుకున్నా. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలో ఎంఎస్ పూర్త చేసి... ఇండియాకి వచ్చి ఇక్కడ బిజినెస్ ప్రారంభించా. అందులో సక్సెస్ అయిన తరువాత... సినిమా రంగం వైపు అడుగులు వేశా. ఇక్కడ కూడా మొదటి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక నుంచి కూడా అందిరినీ మెప్పించే సినిమాల్లోనే నటించి మంచి పేరు తెచ్చుకుంటా. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు. -
Eagle Eye Entertainment: ‘ఊరికి ఉత్తరాన’ ఊపు.. త్వరలోనే మరో చిత్రం
నరేన్ వనపర్తి హీరోగా పరిచయం అవుతూ ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకటయ్య వనపర్తి, రాచల యుగేందర్ గౌడ్ నిర్మించిన `ఊరికి ఉత్తరాన` చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో ఈగిల్ ఐ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-2గా మరో చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావొచ్చింది. ఈ సందర్భంగా హీరో , చిత్ర సమర్పకులు నరేన్ వనపర్తి మాట్లాడుతూ... ‘ఊరికి ఉత్తరాన’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. కొత్తవారైనా కంటెంట్ ఉంటే సినిమాను ఆదరిస్తారని మా చిత్రం మరోసారి నిరూపించింది. `ఊరికి ఉత్తరాన` సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఈగిల్ ఐ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-2 గా మరో చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ ప్రకటిస్తాం’ అన్నారు. -
‘ఊరికి ఉత్తరాన’ మూవీ రివ్యూ
టైటిల్ : ఊరికి ఉత్తరాన నటీనటులు : నరేన్ వనపర్తి, దీపాళ్లీ శర్మ, ఆనంద చక్రపాణి, రామరాజు, అంకిత్ కొయ్య, జగదీష్, ఫణి తదితరులు నిర్మాణ సంస్థ : ఈగల్ ఐ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : వెంకటయ్య వనపర్తి, రాచల యుగేందర్ గౌడ్ దర్శకత్వం : సతీష్ పరమవేద సంగీతం : భీమ్స్ సెసిరోలియో సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ అరుపుల కథలో బలం ఉంటే చాలు.. హీరో ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే విభిన్నమైన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. అలా సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘ఊరికి ఉత్తరాన’. టైటిలే డిఫరెంట్‌గా ఉండడం, ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘ఊరికి ఉత్తరాన’పై అంచనాలు పెరిగాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 19)థియేటర్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే వరంగల్ జిల్లా పర్వతగిరి పెద్ద పర్వతనేని శంకర్ పటేల్ (రామరాజు) సోదరి ప్రేమ వివాహం చేసుకుంటుంది. తనకి ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో.. ఆ యువకుడిని కాకతీయ తోరణానికి కట్టి ఉట్టి కొట్టిస్తాడు. ఇక ముందు ప్రేమ వివాహాలు చేసుకొనే ప్రతీ ఒక్కరికి ఇలాంటి శిక్షే ఉంటుందని గ్రామ ప్రజలను హెచ్చరిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన మేనకోడలు శైలు ( దీపాళీ శర్మ) పక్క ఊరికి చెందిన రాజు అలియాస్ కరెంట్ రాజు(నరేన్ వనపర్తి)ని ప్రేమిస్తుంది. ఓ కారణంగా వీరిద్దరు ఊరు విడిచి హైదరాబాద్‌కు పారిపోతారు. కానీ తెల్లారేసరికి శైలు పక్కన కనిపించదు. అసలు శైలు ఎక్కడికి వెళ్లింది? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా మోసం చేసి పారిపోయిందా? 30 ఏళ్ల వయసులో కరెంట్ రాజు కాలేజీలో స్టూడెంట్‌గా ఎందుకు చేరాడు? శంకర్ పటేల్ గురించి తెలిసినా వారిద్దరు ప్రేమలో ఎలా మునిగిపోయారు? కరెంట్ రాజు, శైలు ప్రేమను శంకర్ పటేల్ అంగీకరించాడా? లేదా?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. హీరో, హీరోయిన్లు కొత్త వాళ్లు అయినా బాగా నటించారు. అవారాగా తిరిగే కరెంట్ రాజు పాత్రలో నరేన్ ఒదిగిపోయాడు. బాధ్యత తెలియని యువకుడిగా, ప్రేమికుడిగా, కాలేజీ స్టూడెంట్‌గా పలు వేరియన్స్ ఉన్న పాత్రని అవలీలగా పోషించాడు. శైలుగా దీపాళీ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. హీరో తండ్రి కరెంట్ నారాయణగా ఆనంద చక్రపాణి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. నెగెటీవ్ షేడ్స్ ఉన్న పర్వతనేని శంకర్ పటేల్ పాత్రలో రామరాజు సరికొత్తగా కనిపించారు. సినిమాలో మరో బలమైన పాత్ర తనది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ప్రేమకు మరణం లేదు కానీ ప్రేమిస్తే మరణమే.. అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా ఇది. యూత్‌కి కనెక్ట్ అయ్యే కథను ఎంచుకొని.. అనుకున్నది అనుకున్నట్లు తెరపై చూపించడంతో సఫలం అయ్యాడు దర్శకుడు సతీష్ పరమవేద. అతనికిది తొలి సినిమా అయినా ఎక్కడా కన్ఫ్యూజన్ కాకుండా, అనుభవజ్ఞుడు లా సుత్తి లేకుండా చెప్పాల్సిన పాయింట్ చెప్పాడు. రామరాజు, ఆనంద చక్రపాణి పాత్రలను ఎమోషనల్‌గా తీర్చిదిద్ది సినిమా స్తాయిని పెంచాడు. భారీ బడ్జెట్ చిత్రాలనే కాకుండా స్టార్ హీరోలను కూడా లీడ్ చేసే సత్తాను తన తొలి చిత్రంతోనే నిరూపించుకొన్నారు. అయితే సినిమాలో కొన్ని సాగదీత సీన్స్ మాత్రం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తాయి. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. భీమ్స్ సెసిరోలియో బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టేశాడు. శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫి బాగుంది. కాకతీయ తోరణం సెట్టింగును తెరపైన అద్బుతంగా చూపించాడు. ఎడిటర్ శివ శ్రావణి తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని అనవసరపు సీన్స్‌ని కట్ చేస్తే సినిమా మరింత క్రిస్పీగా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.