చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగా, ఆయనే నాకు స్ఫూర్తి: యంగ్‌ హీరో | Intersrtin Facts About Naren Vanaparthi About | Sakshi
Sakshi News home page

చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగా, ఆయనే నాకు స్ఫూర్తి: యంగ్‌ హీరో

Jul 16 2023 9:09 AM | Updated on Jul 16 2023 9:09 AM

Intersrtin Facts About Naren Vanaparthi About - Sakshi

మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చానని యువ హీరో నరేన్‌ వనపర్తి అన్నారు. తొలి మూవీ ‘ఊరికి ఉత్తరాన’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నరేన్‌. ఈ చిత్రం ప్రస్తుతం  అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ప్రముఖ నటుడు, దివంగత జయప్రకాశ్ రెడ్డి(జేపీ) కూతురు శ్రీ మల్లికా రెడ్డి నిర్మాతగా వ్యవహరించే ఓ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ జయప్రకాశ్ రెడ్డి ప్రొడక్షన్స్ లో అవినాశ్ కోకటి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇది ఇటీవలే ప్రారంభమైంది. మరో సినిమా కూడా త్వరలో ప్రారంభం అవుతుంది.

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న యువ హీరో నరేన్ వనపర్తి మాట్లాడుతూ... ‘ఎన్ని సినిమాల్లో నటించామనేది ముఖ్యం కాదు... మంచి సినిమాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలనేదే నా ధ్యేయం. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూస్తూ పెరిగా. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని అనుకునే వాణ్ని. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు ఫస్ట్ బాగా చదువుకోవాలి. జీవితంలో స్థిరపడాలి అని అనుకున్నా. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలో ఎంఎస్ పూర్త చేసి... ఇండియాకి వచ్చి ఇక్కడ బిజినెస్ ప్రారంభించా. అందులో సక్సెస్ అయిన తరువాత... సినిమా రంగం వైపు అడుగులు వేశా. ఇక్కడ కూడా మొదటి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక నుంచి కూడా అందిరినీ మెప్పించే సినిమాల్లోనే నటించి మంచి పేరు తెచ్చుకుంటా. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement