breaking news
united club
-
యునైటెడ్ క్లబ్‌పై పోలీసులు దాడి
– 49 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ – రూ.1,57,020 నగదు స్వాధీనం కర్నూలు: జిల్లా కోర్టు ఎదుటనున్న యునైటెడ్ క్లబ్‌పై పోలీసులు దాడి చేసి 49 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,57,020 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్లో పేకాట జరుగుతున్నట్లు కర్నూలు డీఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు అందడంతో శనివారం సాయంత్రం ఆయన పర్యవేక్షణలో సీఐలు నాగరాజరావు, నాగరాజు యాదవ్, కృష్ణయ్య, ఎస్ఐలు తిరుపాలు, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్ కిషోర్ రెడ్డి, మల్లికార్జున నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. నిబంధనల ప్రకారం వారి దగ్గర ఉన్న డబ్బును కౌంటర్లో డిపాజిట్ చేసి టోకెన్లతో మాత్రమే ఆట కొనసాగించాలి. అయితే సభ్యులు కాని వారు కూడా క్లబ్లో కూర్చొని పెద్ద ఎత్తున టేబుళ్లపై నగదు పెట్టి పేకాట సాగిస్తున్నట్లు గుర్తించారు. పేకాటరాయుళ్లు రాచమల్లు జోగిరెడ్డి, అయ్యన్న, నాగరాజు, శేషగిరి రావు, నారాయణమూర్తి, వెంకటేష్, మహేశ్వరరెడ్డి, నాగరాజుతో పాటు మరో 41 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది సివిల్ పోలీసులు, కొంతమంది ఎక్సైజ్ పోలీసులు తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం. 49 మందిని స్టేషన్‌కు తీసుకొచ్చి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
18న టెన్నికాయిట్ జట్ల ఎంపిక
కర్నూలు (టౌన్): స్థానిక యునైటెడ్ క్లబ్లో ఈనెల 18 వ తేదీ జిల్లా జూనియర్ బాల, బాలికల జట్లను ఎంపిక చేస్తున్నట్లు జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.ఏ. రవూఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు రూ. 10 చెల్లించి నేరుగా యునైటెడ్ క్లబ్లో నిర్వహిస్తున్న ఎంపిక పోటీలలో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుండి 1 వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో జరుగుతున్న అంతర్ జిల్లాల చాంపియన్ షిప్లో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 8555033182 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.