breaking news
unians
-
కోల్ కతాలో విద్యార్థి సంఘాల ఆందోళన
-
ఫిర్యాదుతో పెరిగిన వేధింపులు
మంథని: సక్రమంగా విధులకు హాజరవుతున్నా.. వేతనంలో వాటా ఇవ్వడంలేదని వేధిస్తున్న అధికారిపై అంగన్వాడీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే అదికాస్త బెడిసికొట్టింది. ఫిర్యాదు తర్వాత వేధింపులు మరింత ఎక్కువ కావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. మంథని సీడీపీవో పద్మశ్రీ తమను వేధిస్తున్నారని ప్రాజెక్టు పరిధిలోని సుమారు 80 అంగన్వాడీ టీచర్లు జనవరి 16న మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబుతోపాటు కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత నెల 13న జిల్లా సహకార, సంక్షేమ అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి 57 మంది ఆంగన్వాడీ టీచర్లను వ్యక్తిగతంగా విచారణ చేశారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సీడీపీవో ప్రతినెలా తమ వేతనం నుంచి బలవంతంగా రూ.3 వేలు వసూలు చేస్తున్నారని విచారణ అధికారికి తెలిపారు. ఇవ్వకుంటే అసభ్య పదజాలంతో ధూషిసూ భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ సీడీపీవోకు వ్యతిరేకంగా విచారణాధికారి ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో.. విచారణ నివేదికను కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారికి పంపిస్తామని చెప్పిన అధికారికి రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఉన్నట్లు అంగన్వాడీ టీచర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు తమకు కాకుండా సీడీపీవోకు అనుకూలంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా విచారణ నీరుగారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. విచారణ జరిపి 20 రోజులు కావస్తున్నా ఇప్పటికీ అధికారిపై ఎలాంటి చర్య లేకపోగా, తమపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన కేంద్రాలకు తనిఖీల పేరిట వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని బాధిత టీచర్లు పేర్కొంటున్నారు. తాము విధులు నిర్వహించే పరిస్థితి లేదని అంటున్నారు. పది రోజుల క్రితం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి గుండెపోటుకు గురైందని తెలిపారు. గతంలో సైతం కన్నాల–1 కేంద్రం టీచర్ పక్షవాతానికి గురైందని, నాగెపల్లికి చెందిన సజన అస్వస్థకుగురై అనారోగ్యపాలైందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణలో పారదర్శత పాటించి తమను ఇబ్బందులకు గురుచేస్తున్న అధికారిపై చర్య తీసుకోవాలని పలువరు టీచర్లు కోరుతున్నారు. వేధింపులు నివారించండి అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా సీడీపీవో సూపర్వైజర్లు వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో అనేక మంది టీచర్లు అనారోగ్యబారిన పడుతున్నారు. న్యాయం కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ జరుగుతుండగా...అధికారి పార్టీకి చెందిన వారు టీచర్లకు సపోర్టు చేయకుండా అధికారి అనుకూలంగా మాట్లాడటం సరికాదు. –జ్యోతి, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి -
క్రీడా ‘సంఘ’ర్షణ..!
ఆధిపత్యం కోసం ‘కొత్త’ క్రీడా సంఘాల ఆరాటం కొత్తగూడెం–ఖమ్మం రెండు వేర్వేరు జిల్లాలు కానున్న నేపథ్యంలో క్రీడా సంఘాల బాధ్యతల కోసం ఆధిపత్య పోరు..మరింత జఠిలమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని క్రీడా సంఘాలు ఇష్టమొచ్చినట్లు బాధ్యతల కేటాయింపు ఇచ్చేస్తుండడం..ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించకుండానే అనధికారికంగా కొనసాగుతుండడం..అయినా పట్టింపు కరువవడం సర్వసాధారణంగా మారింది. రెండు జిల్లాలోనూ తమకు అనుకూలంగా సంఘాలను కూడగట్టుకోవడంలో ఇప్పటికే పోటాపోటీ నెలకొంటోంది. ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాలో 42 క్రీడా సంఘాలు రిజిస్ట్రేషన్ అయి ఉండగా..వీటిలో అనేక సంఘాలు ఒలింపిక్ అసోసియేషన్‌లో కానీ, స్పోర్ట్స్ అథారిటీలో కానీ గుర్తింపు లేకుండానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగూడెం జిల్లా ఏర్పడుతున్న నేపథ్యంలో స్పోర్ట్స్ అసోసియేషన్ వివరాలు ఇవ్వాల్సిందిగా స్పోర్ట్స్ అథారిటీ ఆదేశించడంతో..ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆరు క్రీడా సంఘాలు మాత్రమే వివరాలు ఇచ్చాయి. మిగతా సంఘాలు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీలో గుర్తింపు ఉంటేనే అఫిలియేషన్ వచ్చి..టోర్నీల నిర్వహణకు నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. క్రీడాకారులను కూడా ప్రోత్సహించుకునేందుకు అవకాశం లభిస్తుంది. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు పొందిన క్రీడాకారులకు ఉపయోగం కలుగుతుంది. కానీ..కొత్తగా నమోదు చేసుకోకుండానే ఫలానా సంఘం బాధ్యులమంటూ కమిటీలు కొనసాగుతుండడం విశేషం. ఇప్పటి వరకు ఒక్కో క్రీడా సంఘానికి ఖమ్మంతో పాటు కొత్తగూడెం నుంచి కమిటీ బాధ్యుల ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉండేది. అటువైపు కొందరు, ఇటు వైపు నుంచి ఇంకొందరు ఎన్నికయ్యేవారు. ఈ సారి రెండు జిల్లాలు ఏర్పడుతున్న నేపథ్యంలో..ఆయా జిల్లాల్లో వేర్వేరుగా పదవుల కోసం మళ్లీ స్థానికంగా గట్టిపోటీ ఎదురవనుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అనుమతి ఇస్తేనే జిల్లాలో కొత్త క్రీడా సంఘాలు ఏర్పాటు చేసుకొవాల్సి ఉంటుంది. రెండు జిల్లాల్లోనూ క్రీడా సంఘాల బాధ్యులు తమకు అనుకూలంగా ఉండేలా కొందరు ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్నారు. భవిష్యత్‌లో ఒలింపిక్ అసోసియేషన్, ఇతర ఎన్నికల్లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నారు.