breaking news
Under -14
-
ఇదేం విధ్వంసం.. 125 బంతుల్లో 331 పరుగులు; 30 సిక్సర్లు, 28 ఫోర్లు
Mohak Kumar Smashed 331 Runs In 125 Balls Smashed 30 Sixes Under 14 Cricket: 125 బంతుల్లో 331 పరుగులు.. 30 సిక్సర్లు.. 28 ఫోర్లు. ఇది ఒక జట్టు ఇన్నింగ్స్ అనుకుంటే పొరపాటే. ఎందుకుంటే ఈ పరుగులన్ని చేసింది ఒక్కడే. కొడితే బౌండరీ.. లేదంటే సిక్స్ అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశాడు అండర్-14 కుర్రాడు.. మోహక్ కుమార్. అండర్-14 డ్రీమ్ ఛేజర్ కప్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మోహక్.. బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన మోహక్.. కేవలం సిక్సర్లతోనే 180 పరుగులు చేయగా.. మరో 112 పరుగులను ఫోర్లతో రాబట్టాడు. ఓవరాల్‌గా 331 పరుగులు చేసిన మోహక్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు.ఈ విధ్వంసకర బ్యాటింగ్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విటర్లో వెల్లడించింది. చదవండి: Ravindra Jadeja: క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.. కోపంతో కొట్టాలనుకున్నాడు ప్రణవ్ ధనవాడే కాగా 2016 సంవత్సరంలో మహారాష్ట్ర క్రికెటర్ ప్రణవ్ ధనవాడే స్కూల్ క్రికెట్లో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఒక మ్యాచ్‌లో 1,009 పరుగులు చేసి.. ప్రపంచంలో ఒక మ్యాచ్‌లో 1000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతని కంటే ముందు ఇంగ్లండ్ ఆటగాడు ఇజె కాలిన్స్ 1899లో 628 పరుగులు చేశాడు. చదవండి: ECS T10 League: బౌండరీ కొట్టాలని చూశాడు.. దురదృష్టం వెంటాడింది -
అండర్-14 చాంప్ హెచ్‌పీఎస్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఓవరాల్ అండర్-14 బాలుర టీమ్ టైటిల్‌ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్-బేగంపేట్) జట్టు చేజిక్కించుకుంది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. ఇందులో అండర్-14 బాలుర విభాగంలో హెచ్‌పీఎస్ అథ్లెట్లు అత్యధిక పతకాలను గెలిచి టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన అండర్-14, 16 బాలబాలికలు విభాగాల్లో ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫలితాలు అండర్-14 బాలుర విభాగం: 800 మీ: 1. బి.బాలాజీ (హెచ్‌పీఎస్-బీ), 2. దివాకర్ (హెచ్‌పీఎస్-ఆర్), 3. కె.విష్ణు (హెచ్‌పీఎస్-బీ); 60 మీ: 1.బి.రాజేష్ (హెచ్‌పీఎస్-బీ), 2. కౌశిక్ నాయుడు (బీవీపీ), 3. వంశీకృష్ణ (ఎస్‌టీబీఎస్); 200 మీ: 1. బి.రాజేష్ (హెచ్‌పీఎస్-బీ), 2. వై.రవి ప్రసాద్ (కేవీయూ), 3. వెంకన్న (హెచ్‌పీఎస్-ఆర్); షాట్‌ఫుట్: 1. దివాకర్ (హెచ్‌పీఎస్-బీ), 2. డి.రవి నాయక్ (హెచ్‌పీఎస్-ఆర్), 3. కె.సందీప్ నాయక్ (హెచ్‌పీఎస్-ఆర్); హైజంప్: 1. హీరాలాల్ (హెచ్‌పీఎస్-బీ), 2. రవీందర్ (హెచ్‌పీఎస్-ఆర్), 3.దుర్గేశ్ కుమార్ (కేవీబీ పల్లి); లాంగ్‌జంప్: 1. రవీందర్ (హెచ్‌పీఎస్-బీ), 2. పి.మహేందర్(హైదరాబాద్), 3. హీరాలాల్ (హెచ్‌పీఎస్-బీ); బాలికల విభాగం: 60 మీ: 1. జి.నిత్య (సెయింట్ జోసెఫ్), 2. జి.వెన్నెల (కేవీ-2 ఉప్పల్), 3. డి.భవిక (హెచ్‌పీఎస్-బీ); 200మీ: 1. జి.నిత్య (సెయింట్ జోసెఫ్), 2. డి.భవిక (హెచ్‌పీఎస్-బీ), 3. రిషితరెడ్డి(సెయింట్ జోసెఫ్); 800 మీ: 1. నిహారిక (సెయింట్ జోసెఫ్), 2. జి.హార్ధికరెడ్డి (జేహెచ్‌పీఎస్), 3. డి.కీర్తి (జాన్సన్ గ్రామర్ స్కూల్); లాంగ్ జంప్: 1. కె.లాస్య (సెయింట్ ఆండ్రూస్), 2. టి.సుమతి (హెచ్‌పీఎస్-బీ), 3. పి. సాహితి (బీవీపీ); అండ ర్-16 బాలుర విభాగం: 100 మీ: 1. నితిన్ కుమార్ (బీఎస్సీ), 2. మహేందర్ (హెచ్‌పీఎస్-ఆర్), 3.ఎస్.శుభమ్ (కేవీ-గచ్చిబౌలీ); 400 మీ: 1. ఎల్.బీతేశ్వర్ (బీఎస్సీ), 2. నితిన్ కుమార్ (బీఎస్సీ), 3. వి.జయంత్ (ఏఈసీఎస్డబ్ల్యూ); 800 మీ: ఎల్.బీతేశ్వర్ (బీఎస్సీ), 2. అనిశ్ కుమార్ (కేవీ నెంబర్-1 గోల్కొండ), 3. టి.నితీష్ (హెచ్‌పీఎస్-ఆర్); 1500 మీ: 1. అనీశ్ కుమార్ (కేవీ-1 గోల్కొండ), 2 .కె.హనుమంతు (ఆల్ సెయింట్స్ స్కూల్), 3. సి.హెచ్.శ్రవణ్ కుమార్ (జాన్సన్ గ్రామర్ స్కూల్); షాట్‌పుట్: 1. రిచర్డ్ జాషువ (సెయింట్ ఆండ్రూస్ స్కూల్), 2.ఎం.వెంకటేష్ (హెచ్‌పీఎస్-ఆర్), 3. రోహన్ (డిఫెన్స్ లాబ్ స్కూల్); జావెలిన్ త్రో: 1. ఆర్.శివ నాయక్ (ఆల్ సెయింట్స్ స్కూల్), 2. హనుమంతు (ఆల్ సెయింట్స్ స్కూల్), 3. బి.పటేల్ (ఢిఫెన్స్ లాబ్ స్కూల్).అండర్-16 బాలికలు: 100 మీ: 1.అష్టలక్ష్మీ (జేహెచ్‌పీఎస్), 2. ఎల్.అనీషా (సెయింట్ ఆండ్రూస్), 3. శరణ్య (జాన్సన్ గ్రామర్ స్కూల్); 400 మీ: 1.పి.శ్రేయ (జేహెచ్‌పీఎస్), 2. ఎం.అష్టలక్ష్మీ (జేహెచ్‌పీఎస్), 3. రవళి (ఆల్ సెయింట్స్); 800 మీ: 1.పి. కావేరి (కేవీ-2 ఉప్పల్), 2. జి. భావన (ఓబుల్‌రెడ్డి స్కూల్), 3. జె.రవళి (ఆల్ సెయింట్స్); 1500 మీ: 1. జి. భావన (ఓబుల్‌రెడ్డి స్కూల్), 2. సాయి శివాని (హెచ్‌పీఎస్-ఆర్), 3. నమ్రత (జాన్సన్ గ్రామర్ స్కూల్); లాంగ్ జంప్: 1.ఎల్.అనీషా (సెయింట్ ఆండ్రూస్), 2 .ఎం.అష్టలక్ష్మీ (జేహెచ్‌పీఎస్), 3. పి.శ్రేయ (జేహెచ్‌పీఎస్).