UltraTech Cement Factory
-
ఆది అరాచకం.. అల్ట్రాటెక్‌కు మరోసారి బెదిరింపులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు మితిమీరిపోతున్నాయి. మరోమారు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై బెదిరింపులకు దిగారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి దాడులు చేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అల్ట్రాటెక్ సిమెంట్స్‌పై తాను వ్యవహరించిన తీరు తప్పు కాదంటూ సమర్థించుకున్నారు.అక్కడి కాంట్రాక్టులన్నీ తనకే కావాలంటూ ఉత్పత్తి అడ్డుకున్నారు. ముడిసరుకు, ఉత్పత్తి బయటకు వెళ్లకుండా బస్సు అడ్డుగా పెట్టీ మరీ బెదిరింపులకు దిగారు. అదినారాయణరెడ్డి దౌర్జన్యంపై జిల్లా కలెక్టర్‌కు ఫ్యాక్టరి యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసు బందోబస్తుతో తిరిగి ఉత్పత్తి పునరుద్ధరించారు. అయినా తన తప్పేమీ లేదంటూ ఆదినారాయణరెడ్డి బుకాయించారు. పైగా సీఎంతో మాట్లాడి దాడులు చేయిస్తానంటూ మరోసారి బెదిరింపులకు దిగారు.కాగా, చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కార్యకలాపాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవడంతో గత రెండు రోజుల క్రితం కూడా ఉత్పత్తి ఆగిపోయిన సంగతి తెలిసిందే. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న బెదిరింపులు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.మొన్న అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను అడ్డుకుని విధ్వంసం..! నిన్న ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా లారీలను అడ్డుకుని దౌర్జన్యం..! తాజాగా అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి బెదిరింపులు..! వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి ఆది నుంచి అరాచకాలనే ప్రోత్సహిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. -
అల్ట్రాటెక్ కంపెనీ పైకి దండెత్తిన స్థానికులు
-
అల్ట్రాటెక్ కంపెనీలో బాయిలర్ బ్లాస్ట్
-
బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత
-
అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు
బూదవాడ (జగ్గయ్యపేట)/సాక్షి, అమరావతి/ తాడేపల్లి రూరల్/ : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రియాక్టర్లో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్మాగారంలోని మూడో ఫ్లోర్లో లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రా మెటీరియల్ మిక్స్ చేయటానికి 1,300 డిగ్రీల ఉష్ణోగ్రతతో హీట్‌చేసే రియాక్టర్ వద్దకు ఉదయం షిఫ్టులో 16 మంది కార్మికులు విధులకు వచ్చారు. వారు విధుల్లో ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది. అందులోని సిమెంట్ కార్మికులందరిపై పడింది. దీంతో వారి శరీర భాగాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరవింద్ యాదవ్, సుభం సోని, గుడ్డు కుమార్, దినేష్‌కుమార్, నాగేంద్ర, బిహార్‌కు చెందిన బి. సింగ్, పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన బొంతా శ్రీనివాసరావు, బూదవాడ గ్రామానికి చెందిన ధారావతు వెంకటేశ్వరరావు, వేముల సైదులు, గుగులోతు గోపినాయక్, గుగులోతు బాలాజీ, బాణావతు సైదా, బాణావతు స్వామి, పరిటాల అర్జునరావు, బాణావతు సైదా, అవుల వెంకటేష్ గాయపడ్డారు. వీరిలో బాణావతు స్వామి, పరిటాల అర్జునరావు, బాణావతు సైదా, అవుల వెంకటేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రి, తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆవుల వెంకటేష్ (35)కు 80 శాతం కాలిన గాయాలవడంతో మృతిచెందాడు. గాయపడిన వారిలో మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఫర్నిచర్ ధ్వంసం చేసిన గ్రామస్తులు..యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులతో పాటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు కర్మాగారం వద్ద ఆందోళన చేశారు. ప్రమాదం జరిగినా కనీస స్పందనలేదని ఆరోపించారు. సమాధానం చెప్పడానికి కర్మాగారం తర ఫున ఎవరూ లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామ స్తులు, క్షతగాత్రుల బంధువులు కర్మాగారంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సీఐ జానకీరాం, చిల్లకల్లు ఎస్ఐ సతీష్ పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనా స్థలాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఏసీపీ కె. శ్రీనివాసరావు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి..ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అలాగే, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. సృజన, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కూడా పరామర్శించారు. ఇదిలా ఉంటే.. పేలుడు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.మృతుని కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. మిగిలిన వారికి గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారాన్ని అందించాలన్నారు. అలాగే, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సీఐటీయు నేతలు కూడా బాధితులను పరామర్శించారు. యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.. గాయపడ్డ ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం, యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది..ఇదిలా ఉంటే.. గాయాలైన ఎనిమిది మందిని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు వచ్చారు. 24 గంటలు గడిస్తే తప్ప ఎవరి పరిస్థితి ఏవిధంగా ఉందో చెప్పలేమని తెలియడంతో తమవారికి ఏమవుతుందా అని వారంతా ఆందోళన చెందుతున్నారు. అలాగే, దుర్ఘటనపై ఆదివారం మణిపాల్ ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఉదయం 10.00– 10.30 మధ్య ప్రమాదం జరిగిందని.. తమకు తెలిసేసరికి రెండు గంటలు పట్టిందని, ఆ తర్వాత తాము ఫ్యాక్టరీకి వెళ్లిన రెండు గంటల తరువాతే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారని మండిపడ్డారు. ఇంతగా జాప్యంచేసి కార్మికుల ప్రాణా లంటే లెక్కలేకుండా యాజమాన్యం ప్రవర్తించిందని ఆరోపించారు. తొలుత.. గాయపడిన వారిని బయటకు తెచ్చేందుకు తామంతా ప్రయత్నించగా అక్కడ భద్రతా సిబ్బంది అనుమతించలేదని.. పైగా తమను తోసేసి చేయిచేసుకున్నారని చెప్పారు. అయినా వారిని తోసుకుంటూ వెళ్లగా గాయపడ్డ వారంతా కేకలు పెడుతున్నారని.. మొత్తం 16మందిని తీసుకుని బయటకు వచ్చామన్నారు. అలాగే, మృతుడు ఆవుల వెంకటేష్ తమ్ముడు గోవింద్ మాట్లాడుతూ.. మా అన్నయ్య బూడిదలో కూరుకుపోయాడని, పైకి లేవలేకపోయాడని చెప్పాడు. -
AP: అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతులను ఆవుల వెంకటేష్, పరిటాల అర్జున్‌గా గుర్తించారు. ఈ ఘటనలో 15 మంది కార్మికులు గాయపడ్డారు.క్షతగాత్రులను మణిపాల్ ఆసుపత్రి, గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మృతుల బంధువులు, గ్రామస్తులు ఫ్యాక్టరీని ముట్టడించారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. -
జేసీ వర్గీయుల ఆందోళన
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు గత 10 రోజులుగా అక్కడ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆందోళన చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. -
వివాహిత దారుణ హత్య
తాడిపత్రి రూరల్, న్యూస్‌లైన్: తాడిపత్రి మండలంలోని భోగసముద్రం గ్రామంలో సరిత(20) అనే వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు.. ఆదిలాబాద్ జిల్లా హసన్ గ్రామానికి చెందిన తిరుపతయ్య ఐదేళ్లుగా స్థానిక ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ లోని లోడింగ్ సెక్షన్లో పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం తన సొంత ప్రాంతానికి చెందిన సరితను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం భార్య, తన తమ్ముడితో కలిసి భోగసముద్రంలో నివాసం ఉంటూ విధులకు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తిరుపతయ్య యథావిధిగా ఫ్యాక్టరీకి వెళ్లాడు. రోజూలాగే విధులు ముగించుకుని సోమవారం తెల్లవారు జామున ఇంటికి చేరాడు. తలుపు తెరిచే ఉండడంతో లోపలకు వెళ్లి చూడగా, సరిత రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. తలపై ఎవరో బండరాయితో మోది హత్య చేశారు. రూరల్ సీఐ రాఘవన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మరిది ప్రేమ వ్యవహారమే కారణమా? సరితను ఎవరైనా బంగారం కోసం హత్య చేశారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మరిది ప్రేమ వ్యవహారమే ఆమె ప్రాణం తీసిందనే అనుమానం వ్యక్తం అవుతోంది. తిరుపతయ్యతో పాటు లోడింగ్ సెక్షన్లో పని చేసే పోచయ్య కూతురుతో సరిత మరిది రమేష్ స్నేహంగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయంలో రమేష్‌ను పోచయ్య హెచ్చరించినట్లు తెలిసింది. అయితే సరిత తన మరిదిని ప్రోత్సహిస్తుండటంతో పోచయ్య కక్ష పెంచుకుని ఆమెను హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోచయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.