breaking news
ultimate
-
అల్టిమేట్ చాంపియన్‌షిప్
బుడాపెస్ట్: అథ్లెటిక్స్‌పై మరింత ఆసక్తిని పెంపొందించేందుకు వరల్డ్ ఆథ్లెటిక్స్ చర్యలకు నడుం బిగించింది. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలుకుతూ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్‌కు కొత్త సొబగులు అద్దుతూ సరికొత్త ‘అల్టిమేట్ చాంపియన్‌షిప్ మీట్‌కు శ్రీకారం చుట్టింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించ తలపెట్టిన ఈ చాంపియన్‌షిప్ తొలి ఎడిషన్‌కు హంగేరి రాజధాని బుడాపెస్ట్ వేదిక అయింది. ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌కు భిన్నంగా ‘అల్టిమేట్ చాంపియన్‌షిప్’ ఆరంభ వేడుకలు... సినిమా అవార్డుల మాదిరిగా అట్టహాసంగా జరిగాయి. రెడ్ కార్పెట్ స్వాగతం... అథ్లెట్ల రంగురంగుల దుస్తులు... అధునాతన ఫ్యాషన్‌తో ఈ ఈవెంట్ అభిమానులను కట్టిపడేసింది. మూడు రోజుల పాటు బుడాపెస్ట్‌లో జరగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం 400 మంది ప్రపంచస్థాయి అథ్లెట్లు పోటీ పడుతున్నారు. ఈ టోర్నమెంట్లో గెలిచిన వారికి ఎలాంటి పతకాలు లభించవు. మెడల్స్‌కు బదులుగా ప్రతీ ఈవెంట్ విజేతకు ట్రోఫీతో పాటు 1,50,000 డాలర్లు (సుమారు రూ. 1 కోటీ 43 లక్షలు) బహుమతిగా అందించనున్నారు. ఈ పోటీలో భాగస్వాములైన ప్రతివారికి ప్రదర్శన ఆధారంగా తక్షణమే నగదు పురస్కారాలు దక్కనున్నాయి. ఆరంభం అదుర్స్ రెడ్ కార్పెట్‌పై జరిగిన ఈ ఆరంభోత్సవ కార్యక్రమంలో అథ్లెట్లు ప్రత్యేక దుస్తువుల్లో మెరిశారు. డుప్లాంటిస్, గాబీ థామస్, మెలిస్సా జెఫర్సన్, యారోస్లావ్ మహుచిఖ్ వంటి వారు భిన్నమైన వ్రస్తాధరణతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్టార్ ప్లేయర్లు మాట్లాడుతూ... ట్రాక్ అండ్ ఫీల్డ్‌ను కెరీర్‌గా ఎంచుకునే ఎంతోమంది అథ్లెట్లు పేద వారేనని... కనీసం షూస్ కొనలేని పరిస్థితుల్లో ఉన్నవారెందరో కఠోర శ్రమతో చాంపియన్లుగా ఎదిగారని గుర్తుచేసుకున్నారు. అలాంటి వారికి ఇతం పెద్ద మొత్తంలో నగదు బహుమతి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఈ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ చాంపియన్లు, ప్రపంచ చాంపియన్‌షిప్ విజేతలు, వరల్డ్ నంబర్‌వన్ అథ్లెట్లు బరిలోకి దిగనుండటంతో పోటీ రసవత్తరంగా సాగనుంది. » వరల్డ్ అథ్లెటిక్స్ అల్టిమేట్ చాంపియన్‌షిప్ నిర్వహించాలని 2024 జూన్‌లో ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం నిర్ణయించింది. » తొలి సెషన్‌కు హంగేరిలోని బుడాపెస్ట్ వేదిక కానుండగా... ఇక మీద ప్రతి రెండేళ్లకోసారి ఈ పోటీలను నిర్వహించనున్నారు. » ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరగని ఏడాదిలో డైమండ్ లీగ్ ఫైనల్ అనంతరం ఈ అల్టిమేట్ చాంపియన్‌షిప్ జరుగుతుంది. » మిగిలిన అన్నీ పోటీల తరహాలో ఇందులో పతకాలకు బదులు నగదు బహుమతి అందించనున్నారు. పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన వారికి లక్షన్నర అమెరికా డాలర్లు (సుమారు రూ. 1. 43 లక్షలు) అందించనున్నారు. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం 10 మిలియన్ అమెరికా డాలర్లు (సుమారు రూ. 95 కోట్లు) విజేతలకు ఇవ్వనున్నారు. » అల్టిమేట్ చాంపియన్‌షిప్ తొలి ఎడిషన్ పోటీలకు జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్, స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ డుప్లాంటిస్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ‘అల్టిమేట్ స్టార్’, ‘అల్టిమేట్ లెజెండ్’గా ఎంపికయ్యారు.» ఈ చాంపియన్‌షిప్‌నకు ఒక్కో విభాగం నుంచి 16 మందిని ఎంపిక చేస్తారు. తాజా ఒలింపిక్స్ చాంపియన్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్ విజేతలు, డైమండ్ లీగ్ ఫైనల్లో టైటిల్ గెలిచిన అథ్లెట్లను ఎంపిక చేస్తారు. మిగిలిన వారిని ప్రపంచ అథ్లెటిక్స్ ర్యాంకింగ్స్ ఆధారంగా తీసుకుంటారు. » ఈ చాంపియన్‌షిప్‌లో ఒకే విభాగంలో ఒక దేశంలో నుంచి ఎంత మంది అథ్లెట్లు పాల్గొనాలి అనే విషయంలో ఎలాంటి నిబంధన లేదు. ఒకే దేశంలో నుంచి ఒకరికి మించి అథ్లెట్లు ఈ అర్హత ప్రమాణాలు సాధిస్తే వారంతా పోటీలో పాల్గొనవచ్చు. » అథ్లెటిక్స్ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు అల్టిమేట్ చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా ఫీల్డ్ ఈవెంట్లకు ప్రాధాన్యత ఇచ్చారు. 10,000 మీటర్ల పరుగు, స్టీపుల్‌ఛేజ్ వంటి వాటిని ఈ టోర్నీలో నిర్వహించడం లేదు. మొత్తంగా 28 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. » పురుషుల విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్లు, 5000 మీటర్ల పరుగుతో పాటు 110 మీటర్ల హర్డిల్స్, 400 మీటర్ల హర్డిల్స్, పోల్‌వాల్ట్, హైజంప్, లాంగ్‌జంప్, హ్యామర్ త్రో, జావెలిన్ త్రోలో పోటీలు జరుగుతాయి. » మహిళల విభాగంలో వీటిలో 110 మీటర్ల హర్డిల్స్ స్థానంలో 100 మీటర్ల హర్డిల్స్... హ్యామర్ త్రో స్థానంలో ట్రిపుల్ జంప్ నిర్వహిస్తారు. » 4x100, 4x400 మీటర్ల పరుగులో మిక్స్డ్ జట్లు పరుగు తీయనున్నాయి. అప్పట్లో ఇది లేదు: బోల్ట్ పోటీల ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జమైకా దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా బోల్ట్ మాట్లాడుతూ... ‘నా కెరీర్లో ఎన్నో ప్రపంచ చాంపియన్‌షిప్‌లు గెలిచాను. కానీ ఈ స్థాయి నగదు బహుమతిని ఎప్పుడూ చూడలేదు. ఇది క్రీడాకారుకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది. నా హయాంలో ఇలాంటి అవకాశం లేకపోయినందుకు కాస్త విచారంగా ఉన్నా... ఇప్పటి తరం అథ్లెట్లకు ఇది సదావకాశం’ అని అన్నాడు. ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 11 పసిడి పతకాలు గెలిచిన బోల్ట్... అథ్లెట్ల ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు ఈ చాంపియన్‌షిప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. -
రాధిక మర్చంట్ ముస్తాబు : కాబోయే పెళ్లి కూతుళ్ల కళ్లన్నీ అటే! (ఫోటోలు)
-
ఈ హీరోయిన్‌కు 50 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా? (ఫోటోలు)
-
మనీష్ మల్హోత్రా : కళ్లు చెదిరే అల్టిమేట్ జ్యుయల్లరీ! (ఫొటోలు)
-
Stunning Looks of Sonakshi Sinha: రెడ్ లెహంగాలో జిగేలుమంటున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా
-
Mouni Roy: సారీ లుక్‌లో గోల్డన్ గార్ల్..
-
Aishwarya Lekshmi: చీరలో ఐశ్వర్య లక్ష్మి.. సోయగాలు (ఫొటోలు)
-
Madhuri Dixit Photos: కుర్ర హీరోయిన్లకు కుళ్ళు పుట్టిస్తున్న ఈ స్టార్ ఎవరు?
-
2024 ఎన్నికలే అంతిమ లక్ష్యం: సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం సోనియా అధ్యక్షతన వర్చువల్‌గా ఈ సమావేశం జరిగింది. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ఐక్యంగా పోరాడటమే లక్ష్యం ప్రతిపక్ష పార్టీల భేటీ జరిగింది. స్వాతంత్ర్యోద్యమ విలువలు, రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలను విశ్వసించే ప్రభుత్వాన్ని అందించాలనే ఏకైక ఉద్దేశ్యంతో పోరాడాలని సోనియా పిలుపు నిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ఐక్యంగా, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని సోనియా ప్రతిపక్ష పార్టీలను కోరారు. మనందరికీ ఎవరి సిద్దాంతాలు వారికి ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి దేశ ప్రయోజనాల కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇదొక చాలెంజ్. ఐకమత్యాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. 2024 ఎన్నికలే అంతిమ లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పోరాడాలని సోనియా సూచించారు. సమాఖ్య వ్యవస్థను, రాజ్యాంగ సంస్థలను దెబ్బతీస్తున్నారంటూ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తిన ఆమె పరిమితులు, ప్రతి బంధకాలను అధిగమించి ఐక్యంగా పోరాడాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఐక్యతను చాటినట్టుగానే పార్లమెంటు బయట కూడా అదే స్థాయిలో పోరాడాలన్నారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల ప్రభుత్వం వ్యాక్సినేషన్ పాలసీని మార్చుకుందన్న సోనియా మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఇటీవలే విపక్షాలతో సమావేశమైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పీడ్ పెంచడంతో తాజాగా సోనియా విపక్షాలతో భేటి కావడం విశేషం. -
క్వారీ పనుల నిలిపివేత
శ్రీకాకుళం(పాలకొండ): గ్రానైట్ లీజుల ఏర్పటుకు సంబంధించి చేపట్టిన బహిరంగ విచారణలో ప్రజాభిప్రాయమే నెగ్గింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలో క్వారీ పనులు ప్రారంభించకూడదని భీష్మించుకున్న గ్రామస్తుల మాటకు విలువిస్తూ ప్రభుత్వం పనులను నిలిపేసింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యే కళావతి స్వగ్రామంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన బహిరంగ విచారణ ప్రశాంతంగా ముగిసింది. క్వారీ ప్రారంభానికి సంబంధించి గతంలో జరిగిన సభలో ఎమ్మెల్యే ప్రజాతీర్పునకు విలువిస్తామని చెప్పడంతో ప్రజలు స్వతంత్రంగా తమ నిర్ణయాన్ని తెలిపారు.


