breaking news
UID
-
మోదీ మరో మెగా మిషన్ ఇదేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం మరో మెగామిషన్ను పక్రటించనుందట. ఈజ్ ఆఫ్ బిజినెస్‌లో భారత్ 30 ర్యాంకులు ఎగబాకడం, అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్ బూస్ట్‌తో జోష్ మీద ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం మరో మెగా మిషన్‌కు సన్నద్ధమవుతోంది. డీమానిటైజేషన్, జీఎస్టీ, ఆధార్ అనుసంధానం లాంటి సంస్కరణల తరువాత మరో కీలక చర్యపై దృష్టిపెట్టింది. ఒకవైపు ఆధార్ అనుసంధానంపై వివాదం కొనసాగుతుండగానే.. 1 బిలియన్ , 1 బిలియన్, 1 బిలియన్ కనెక్టివిటీపై దృష్టి పెట్టినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అంటే 100కోట్ల ఆధార్ నంబర్లతో 100కోట్ల బ్యాంకు ఖాతాల అనుసంధానం, 100 కోట్ల మొబైల్స్ లింకింగ్.. ఇదే కేంద్ర సర్కార్ నెక్ట్స్ టార్గెట్. పెద్దనోట్ల రద్దు తర్వాత అధికంగా నమోదవుతున్న బ్యాంక్ ఖాతాలు, పుంజుకుంటున్న డిజిటల్ లావాదేవీల నేపథక్యంలో ప్రభుత్వం ఈ లక్ష్యంపై దృష్టి పెట్టిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1 + 1 +1 ప్లాన్ తొందర్లనే ప్రకటించవచ్చని ప్రభుత్వ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఆర్థిక, డిజిటల్ సేవల విస్తరణలో ఇది పెద్ద ముందుడుగు భావిస్తున్నాయి. -
ఆవులకూ ‘ఆధార్’ తరహా కార్డులు!
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ఆవులకు, వాటి సంతతికి ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు (యూఐడీ) సంఖ్య కేటాయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దు గుండా పశువుల స్మగ్లింగ్ నిరోధం కోసం వాటికి యూఐడీ కేటాయించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాలపై ఏర్పాటైన ఈ కమిటీ.. ట్యాంపర్ చేయడానికి వీలుకాని పాలీయురేథేన్ (ప్లాస్టిక్) ట్యాగులను పశువులకు జోడించాలని సిఫార్సు చేసింది. ‘దీన్ని అన్ని ఆవులకు, వాటి సంతతికి తప్పనిసరి చేయొచ్చు. పశువు వయసు, జాతి, ఎత్తు, రంగు, కొమ్ముల రకం, ఇతర ప్రత్యేక వివరాలు యూఐడీలో ఉండాలి. రాష్ట్రవ్యాప్త సమాచారాన్ని సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేసి జాతీయ డేటాబేస్కు అనుసంధానించవచ్చు. పోలీసులు, రోడ్డు రవాణా, పశుసంవర్ధక శాఖల అధికారులు పశువుల స్మగ్లింగ్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రాలు దశలవారీగా సమీక్షలు జరపాలి’ అని కమిటీ సిఫార్సు చేసింది. సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని, ఈ అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కనుక కోర్టు ఆదేశాలు జారీ చేయాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్.. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ చంద్రచూడ్‌ల బెంచ్‌కు నివేదించారు.