ఆంధ్రప్రదేశ్ ట్యానరీస్, షయోనాపై కొనసాగనున్న ఆంక్షలు
న్యూఢిల్లీ: పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘనకు గాను ఆంధ్రప్రదేశ్ ట్యానరీస్, షయోనా పెట్రోకెమ్పై విధించిన ఆంక్షలు కొనసాగుతాయని, వీటిని ఎత్తివేసే ప్రసక్తి లేదని స్టాక్మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ స్పష్టం చేసింది. ఇప్పటికి కూడా ఈ కంపెనీలు నిర్దేశిత నిబంధనలు పూర్తి చేయకపోవడం వాటి తీరును ప్రతిబింబిస్తోందని, గతంలో ఇచ్చిన ఆదేశాలు సరైనవేనని నిర్ధారిస్తోందని గురువారం జారీ చేసిన రెండు వేర్వేరు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2013 జూన్ 3లోగా పబ్లిక్ హోల్డింగ్ వాటాలు కనీసం 25 శాతం ఉండేలా చూసుకోవాలన్న నిబంధనలను పాటించలేదన్న కారణంతో అదే ఏడాది ఈ రెండు సంస్థలు సహా 100 కంపెనీలపై సెబీ ఆంక్షలు విధించింది.