breaking news
two sisters murder case
-
అమిత్ సింగ్ కు 5 రోజుల కస్టడీ
హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టించిన అక్కచెల్లెళ్ల హత్య కేసులో నిందితుడు అమిత్ సింగ్ ను ఐదురోజులు పోలీస్ కస్టడీకి రంగారెడ్డి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. చైతన్యపురిలోని యామిని, శ్రీలేఖలను అతి కిరాతకంగా హత్యచేసిన అమిత్ ను చైతన్యపురి పోలీసులు బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హజరుపరిచారు. ఈ కేసును శుక్రవారం విచారణ చేపట్టిన రంగారెడ్డి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. -
అమిత్‌సింగ్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన అక్కచెల్లెళ్ల హత్య కేసులో నిందితుడు అమిత్ సింగ్ ను చైతన్యపురి పోలీసులు బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హజరుపరిచారు. నగరంలోని కొత్తపేటకు చెందిన యామిని, శ్రీలేఖ అనె ఇద్దరు అక్కచెల్లెళ్లను ప్రేమోన్మాది అమిత్‌సింగ్ అతికిరాతకంగా కత్తితో దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్న అమిత్‌ను పోలీసులు ఎట్టకేలకు మంగళవారం పట్టుకున్నారు. నిందితుడ్ని అమిత్‌ను కఠినంగా శిక్షించాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.