breaking news
two shipwreck
-
240 మంది శరణార్థుల మృతి!
-
240 మంది శరణార్థుల మృతి!
మిలాన్: మధ్యధరా సముద్రంలో బుధవారం రెండు పడ వలు మునిగి 240 మంది శరణార్థులు చనిపోయినట్లు తెలిసింది. ఈ మేరకు ఆ ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడ్డవారు చెప్పారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం వెల్లడించింది. ఇటలీలో యూఎన్ెహ చ్సీఆర్ (యునెటైడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్) అధికార ప్రతినిధి కార్లొట్టా స్యామీ మాట్లాడుతూ, రెండు ప్రమాదాల్లో కలిపి 31 మంది మాత్రమే ప్రాణాలు నిలుపుకున్నారనీ తెలిపారు. శరణార్థులంతా రబ్బరు పడవల్లో ప్రయాణిస్తుండగా అవి మునిగిపోయాయి. మొదటి పడవలో 140 మంది ప్రయాణిస్తుండగా లిబియా తీరానికి 40 కి.మీ దూరంలో పడవ మునిగిపోయింది. శరణార్థుల్లో 29 మందిని కాపాడి, మరో 12 మృతదేహాలను బయటకు తీశామని స్యామీ వెల్లడించారు. మరో ఘటనలో సముద్ర ంలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు మహిళలను రక్షించారు. తమ పడవలో 128 మంది జల సమాధి అయ్యారని ఆ స్త్రీలు చెప్పారు.