breaking news
two minutes of silence
-
రెండు నిమిషాలు ఆగిన భాగ్యనగరం
సాక్షి, హైదరాబాద్ : జంట నగరాలు రెండు నిమిషాలపాటు నిలిచిపోయాయి. గాంధీ వర్ధంతి సందర్భంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలన్న ప్రభుత్వం ఆదేశాలను ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆ సమయంలో రహదార్లపై వాహన రాకపోకలను అధికారులు ఎక్కడికక్కడే నిలిపివేశారు. ఆ సమయంలో వాహనదారులు హారన్లు కూడా మోగించలేదు. పాదాచారులు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోకొన్ని చోట్ల కూడా విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారస్థులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు మౌనం పాటించినట్లు తెలుస్తోంది. బేగంపేట్ ఎన్టీఆర్ విగ్రహం చౌరస్తా వద్ద దృశ్యం స్వాతంత్య్రం కోసం బలిదానం చేసిన వారి త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
'రెండు నిమిషాలు మౌనం పాటించండి'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ పెషావర్-లోని ఆర్మీ పాఠశాలపై ఉగ్రవాదుల దాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఆ దాడిలో 160 మంది మృతి పట్ల మోదీ సంతాపాన్ని ప్రకటించారు. పెషావర్ ఘటనకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని భారత్‌లోని పాఠశాల, కళాశాల విద్యార్థులకు నరేంద్ర మోదీ బుధవారం పిలుపు నిచ్చారు. ఈ ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. తీవ్రవాదంపై పోరుకు పాకిస్థాన్‌కు అండగా ఉంటామని ఆయన షరీఫ్‌కు హామీ ఇచ్చారు.