breaking news
with two gold medals
-
తెలంగాణకు రెండు స్వర్ణాలు
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్‌లో మూడో రోజు శుక్రవారం తెలంగాణకు రెండు స్వర్ణాలు లభించాయి. అండర్-20 బాలుర 100మీటర్ల పరుగులో అగస్టీన్ ఏసుదాస్ (11.00 సెకన్లు) స్వర్ణం గెలిచాడు. అండర్-14 బాలుర షాట్‌పుట్‌లో సత్యవన్ (15.54మీ.) బంగారు పతకం గెలిచాడు. అండర్-20 బాలుర విభాగం హైజంప్‌లో కేరళకు చెందిన శ్రీనిధి మోహన్ (2.18 మీటర్లు) జాతీయ రికార్డు నమోదు చేశాడు. -
భారత్‌కు రెండు స్వర్ణాలు
ఇంచియాన్: ఆసియా పారా గేమ్స్‌లో రెండో రోజు భారత్ రెండు స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం ఆరు పతకాలను సాధించింది. క్లబ్ త్రోలో అమిత్ కుమార్... హైజంప్‌లో శరద్ కుమార్ పసిడి పతకాలు గెల్చుకున్నారు. 2012 లండన్ పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన హైజంపర్ హెచ్ఎన్ గిరీష ఇంచియాన్‌లో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 2013 ప్రపంచ పారా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జజారియా ఈ క్రీడల్లో రజతం సాధించాడు. పురుషుల 1500 మీటర్ల రేసులో అంకుర్ ధమా, స్విమ్మింగ్ 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో శరత్ మహదేవరావు గైక్వాడ్ కాంస్య పతకాలు నెగ్గారు. ఓవరాల్‌గా భారత్ రెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఐదు కాంస్యాలతో పతకాల పట్టికలో 11వ స్థానంలో ఉంది.