breaking news
Tuscan town
-
మెగా ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడలు గ్రాండ్ పార్టీ!
మెగా ఇంట్లో ఇప్పటికే పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే మెగాస్టార్‌తో పాటు అల్లు అరవింద్ ఇంట్లో మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగాయి. ఈ జంట త్వరలోనే వివాహాబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఫ్యామిలీ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లావణ్య త్రిపాఠి తాజాగా బ్యాచులరేట్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వేదిక ఇప్పటికే ఫిక్స్ అయింది. ఇటలీలోని టుస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి తన ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచులరేట్ పార్టీ జరుపుకుంది. ఈ వేడుకలో ఆమె స్నేహితులు నీరజ, నితిన్ సతీమణి షాలినీ, నిహారిక, రీతూవర్మ పాల్గొన్నారు. కాబోయే వధువుకు అభినందనలు తెలిపారు. అయితే కొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 1న వరుణ్ - లావణ్య వివాహం జరగనుందని సమాచారం. కాగా.. ఇప్పటికే రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు తమ ముద్దుర కూతురు క్లీంకారతో కలిసి టస్కానీ చేరుకున్నారు. అక్కడి పరిసరాలను చూపిస్తూ తాజాగా ఉపాసన ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేందుకు ఈ జంట అక్కడికి వెళ్లిందని సమాచారం. కాబోయే వధూవరులు సైతం ఇప్పటికే ఇటలీకి పయనమైనట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే! ) -
13 మందిని చంపిందన్న ఆరోపణలతో...
పియంబినొ: ఐసీయూలో 13 మంది చావుకు కారణమైందనే ఆరోపణలతో ఇటాలీకి చెందిన ఓ నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసీయూలో రోగులకు ప్రమాదకర ఇంక్షన్ ఇచ్చి ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేశారు. టస్కార్ పట్టణంలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఫ్రాస్టా బొనినొ(55)ను బుధవారం అరెస్ట్ చేసినట్టు ఇటలీ ఎన్ఎస్ఏ విభాగం పోలీసులు వెల్లడించారు. ఎనస్తీషియా, ఐసీయూ యూనిట్ లో పనిచేస్తున్న ఆమె 2014-2015 మధ్యకాలంలో ప్రమాదకర ఇంక్షన్ ఇచ్చి 13 మంది మరణానికి కారకురాలైన్నట్టు అనుమానిస్తున్నారు. వివిధ రకాల రోగాలతో బాధ పడుతున్న వృద్ధులకు ఆమె విషపు ఇంక్షన్లు ఇవ్వడం గమనార్హం. చనిపోయిన 13 మంది 61 నుంచి 88 ఏళ్ల మధ్య వయసున్న వారే కావడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలలుగా నిందితురాలిపై నిఘా పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి కేసులో మరో నర్సుకు గత నెలలో కోర్టు జీవితఖైదు విధించింది.