breaking news
Tungavanam
-
వర్షంతో తగ్గిన సినిమా వసూళ్లు
తమిళసినిమా : తమిళనాడులో సినిమా వసూళ్లకు వర్షాలు చెక్ పెట్టాయి. ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలపోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు విలవిలలాడుతున్నారు. నిన్నటి వరకూ భానుడి భగభగలతో మండిపోయిన జనం ఇప్పుడు వరుడి ప్రతాపంతో వణికిపోతున్నారు. సంక్రాంతి, దీపావళి వంటి పండగల సందర్భాల్లో సినిమా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. భారీ చిత్రాలు విడుదలవడమే అందుకు కారణం. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్టకు గల్లాపెట్టెలు కాసులతో కళకళలాడేది అప్పుడే. ఈ ఏడాది దీపావళికి విశ్వనటుడు కమలహాసన్ తూంగావనం, మాస్ హీరో అజిత్ వేదాళం చిత్రాలు భారీ అంచనాలతో తెరపైకి వచ్చాయి. ఈ చిత్రాల కారణంగా పలు చిన్న బడ్జెట్ చిత్రాల విడుదల వాయిదాపడింది. ఊహించినట్లుగానే రెండు చిత్రాలు మంచి టాక్‌నే తెచ్చుకున్నాయి. నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చునని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యం సంబరపడిపోయారు. విడుదలయిన తొలి రెండు రోజులు తూంగావనం, వేదాళం చిత్రాలు మంచి కలెక్ష న్లను రాబట్టుకున్నాయి. అలాంటి పరిస్థితిలో వసూళ్లకు వర్షం గండికొట్టింది. రోడ్లంతా జలమయం కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు రాలేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలలో సుమారు 120 థియేటర్లు వరద కారణంగా ముంపునకు గురైనట్లు డిస్ట్రిబ్యూటర్ల వర్గాలు వెల్లడించాయి. న గరాల్లో కూడా థియేటర్లకు ప్రేక్షకులు ఎక్కువగా రావడం లేదని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి సెలవులు కాస్తా వర్షంతోనే వెళ్లిపోయాయని తెలిపారు. షూటింగ్‌లకు ఆటంకం చిత్రాల వసూళ్లకు చెక్ పెట్టిన వర్షం షూటింగ్‌లకూ తీవ్ర ఆటంకంగా మారింది. గురువారం నుంచి వర్షం కురుస్తుండటంతో అవుట్ డోర్లో షూటింగ్‌లు చేస్తున్న వారికి చాలా కష్టాలు ఎదురవుతున్నాయని చిత్ర వర్గాలు ఆవేదక వ్యక్తం చేస్తున్నాయి. -
కొత్త తరహాలో తూంగావనం ఆడియో ఆవిష్కరణ
ఆధునికాన్ని ఆహ్వానించే నటుల్లో కమలహాసన్ ముందుంటారని ఇప్పుడు కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినీ విజ్ఞాని నిరంతర ప్రయోగశాలి అన్నది ఇక్కడ ప్రస్థావించక తప్పదు.కమలహాసన్ తాజా చిత్రం తూంగావనం. ఇది తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న చిత్రం. తెలుగులో చీకటిరాజ్యం పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష నాయకి. ప్రకాశ్‌రాజ్, మధుశాలిని ముఖ్యపాత్రలు పోషించిన ఈ ద్విభాషా చిత్రాన్ని రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రన్ సంగీతాన్ని అందిస్తున్న చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్లో జరిగింది. సాధారణంగా అందంగా ప్యాక్ చేసిన సీడీల పెట్టెనో లేక చిత్ర పోస్టర్‌తో కూడిన కటౌట్నో ఆవిష్కరించి ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ తూంగావనం చిత్ర ఆడియో వేడుకనూ అదే తరహాలో నిర్వహిస్తే అది కమల్ సినిమా ఎందుకవుతుంది. 25 థియేటర్లలో ప్రదర్శన చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించిన తూంగావనం ఆడియో ఆవిష్కరణ వేడుక అదే సమయంలో తమిళనాడులోని 25 థియేటర్లలో ప్రచారం అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. అలా 25 వేల ప్రేక్షకులు ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణను తిలకించారు. అలాగే ఐట్యూన్స్ అనే ఆధునిక టెక్నాలజీ ద్వారా విడుదల చేసి లక్షలాది ప్రజలు ఈ వేడుకను చూస్తున్నారని కమల్ ఈ సందర్భంగా వెల్లడించారు. అది మా టీమ్ సాధించింది కమలహాసన్ మాట్లాడుతూ తూంగావనం చిత్రాన్ని 40 రోజుల్లో పూర్తి చేశామని, 50 రోజుల్లో చేశామని రకరకాల ప్రచారం జరుగుతోందన్నారు. ఇది ద్విభాషా చిత్రం అన్నారు. ఈ రెండు భాషల్లోనూ 52 రోజుల్లో పూర్తి చేయాలని ముందు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. అయితే చాలా సన్నివేశాలు తమిళం తెలుగు అంటూ వేర్వేరుగా తీయాల్సిరావడంతో అనుకున్న దానికంటే మరో ఎనిమిది రోజులు ఎక్కువ పట్టిందని చెప్పారు. మొత్తం 60 రోజుల్లో రెండు భాషల్లో చిత్రాన్ని పూర్తి చేశామన్నారు. ఆ విధంగా చూస్తే ఒక్కో చిత్రాన్ని 30 రోజుల్లో పూర్తి చేసిన ట్లని అన్నారు. ఇది సాధ్యం కాదన్న వారికి తమ టీమ్ సాధ్యమేనని చేసి చూపించిందన్నారు. ఇంతకు ముందు తానూ ఇక చిత్రాన్ని 200 రోజులు చేసిన సంఘటనలు ఉన్నాయని అలాంటిది ఆరేళ్ల నుంచి తయారు చేసిన టీమ్‌తో ఈ చిత్రాన్ని ఇంత త్వరగా పూర్తి చేయగలిగామని కమల్ వెల్లడించారు. త్రిష,శ్రుతిహాసన్, మధుశాలిని, శ్రీప్రియ, దనుష్, విశాల్, పాండిరాజ్, గౌతమ్‌మీనన్, అమీర్, వైరముత్తు, కాట్రగడ్డ ప్రసాద్ పాల్గొన్నారు. చిత్రంలో ఒక్క పాట చోటు చేసుకుంది. దాన్ని వైరముత్తు రాయగా కమలహాసన్ పాడారు.