breaking news
Tukaramgate
-
భవిష్యత్ తరాలకు ఇబ్బందులుండవ్
చిలకలగూడ: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ)ద్వారా నగరంలో అద్భుతమైన రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నామని, ఇందుకోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రూ.72 కోట్ల వ్యయంతో నిర్మించిన తుకారాంగేట్ ఆర్యూబీని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రజాసమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఎస్ఆర్డీపీ పథకం ద్వారా అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే సిగ్నల్ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్నారు. సికింద్రాబాద్, ఖైరతాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో రైల్వేలైన్లు ఉన్నందున రైల్వే అధికారులతో చర్చించి స్థానిక ప్రజల మౌలిక అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని వివరించారు. లాలాగూడ రైల్వేగేట్ పడడంతో 2003లో కేసీఆర్‌తోపాటు తాను, పద్మారావులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నామని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. తుకారాంగేట్ ఆర్యూబీ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజల కల నెరవేరిందన్నారు. పద్మారావు దొరకడం మీ అదృష్టం డిప్యూటీ స్పీకర్ పద్మారావు నేతృత్వంలో సికింద్రాబాద్ అన్నివిధాల అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలను కడుపులో పెట్టుకుని ఆదరించే పద్మారావు వంటి నాయకుడు దొరకడం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. ప్రజల చిరకాలవాంఛ నేటికి నెరవేరిందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. ఆర్యూబీ అందుబాటులోకి రావడంతో మల్కాజ్గిరి, మారేడుపల్లి, మెట్టుగూడ, లాలాపేట, మౌలాలీ, తార్నాక, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల మధ్య రవాణా సదుపాయం మెరుగుపడిందన్నారు. ఉద్యమ కాలంలో ఇక్కడే పలుమార్లు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నామని వివరించారు. బడుగు, బలహీన, దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, కార్పొరేటర్లు లింగాని ప్రసన్నలక్ష్మి, సామల హేమ, కంది శైలజ, సునీత, ఎస్ఆర్డీపీ సీఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్‌రాజు, ఈఈ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ బంగారపు గొలుసు చోరీ
హైదరాబాద్ : నార్త్‌జోన్ పరిధిలో చైన్‌స్నాచర్లు గురువారం మరోసారి రెచ్చిపోయారు. ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని చైన్‌స్నాచర్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బుధవారం జరిగిన చైన్‌స్నాచింగ్ ఘటన మరవకముందే గురువారం ఉదయం తుకారాం పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో చైన్‌స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. అడ్డగుట్టలోని కిరాణా షాపులో సరుకులు ఇస్తున్న లక్ష్మి అనే మహిళ మెడలోని గొలుసును గుర్తు తెలియని దుండగులు తెంచుకుని వెళ్లారు. బాధితురాలు తుకారాం గేట్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదరు మహిళ మెడలో ఉన్నది నకిలీ బంగారం గొలుసు అని లక్ష్మి పోలీసులకు వెల్లడించింది. -
ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని...
-
ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని...
సికింద్రాబాద్: ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని ఓ ప్రబుద్ధుడు భార్యను, పిల్లలను బయటకు గెంటివేశాడు. తుకారాంగేటు ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ముగ్గురు ఆడ పిల్లలు పుట్టారని తన భర్త మహేష్ తనను, తన పిల్లలను ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రకు చెందిన ఈ కుటుంబం గత కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నారు. భర్త మహేష్ తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది. ఆమె రెండు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతోంది. ఇది కుటుంబ సమస్య అయినందున తాము జోక్యం చేసుకోలేమని పోలీసులు ఆమెకు చెబుతూ వచ్చారు. పోలీసులు స్పందించకపోవడంతో పిల్లలతోపాటు ఆమె పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించింది.ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో పోలీసులు స్పందించారు. మహేష్ కోసం వెతకడం మొదలుపెట్టారు. అతనికి కౌన్సిలింగ్ ఇప్పించే ఆలోచనలో ఉన్నారు.