breaking news
TRS Australia
-
ఆస్ట్రేలియాలో హరితహారం
మెల్బోర్న్ : మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ హరితహారం కార్యక్రమం నిర్వహించింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రం సుభిక్షంగా మారాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం తెలంగాణ వ్యాప్తంగా ఒక విప్లవంలా మారిందన్నారు. భవిష్యత్తులో వాతావరణ కాలుష్య నివారణకు, వర్షాభావ పరిస్థితులను పెంపొందించడంలో చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన పుట్టినరోజు సందర్బంగా తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. పరిపాలనలో వినూత్న సంస్కరణలను ప్రవేశపెడుతూ, బంగారు తెలంగాణ సాధనకు ఒక సైనికుడిలా కృషి చేస్తున్న కేటీఆర్‌పై ప్రతిపక్షాలు కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే చవకబారు విమర్శలు చేస్తున్నారని నాగేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనలో కేటీఆర్ కృషికి జాతీయ స్థాయిలో నాయకులు సైతం ప్రశంసిస్తున్నారన్నారు. ఈ మూడు సంవత్సరాల్లో తెలంగాణలో జరిగిన అభివృద్ధి 60 సంవత్సరాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో జరిగిన విద్రోహానికి ఒక చెంపపెట్టని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రవేశపెడుతున్న వినూత్న పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడమే కాకుండా తమ నాయకులపై అవాకులు, చవాకులు పేలే ప్రతిపక్షాల అసలు రంగు ఎండగట్టడంలో టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు డాక్టర్ అనిల్ చీటీ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అర్జున్ చల్లగుళ్ళ, సునీల్ బసిరెడ్డి , సత్యం రావు గుర్జపల్లి , దిలీప్ , సాయి కిరణ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
ఎన్నారై టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ పోస్టర్ ఆవిష్కరణ
- జూన్ 4న మెల్బోర్న్లో ఆవిర్భావ సభ రాయకల్(కరీంనగర్ జిల్లా): ఎన్నారై టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ పోస్టర్‌ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్ శానబోయిన, కార్యదర్శి నవీన్‌రెడ్డి, ఆస్ట్రేలియా ఇన్చార్జ్ అనిల్ బెరైడ్డి, అధికార ప్రతినిధి నాగేందర్ కాసర్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 4వ తేదీన మెల్బోర్న్లో ఎన్నారై టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖను ఎంపీ కవిత ప్రారంభిస్తారని చెప్పారు. -
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కమిటీల ప్రకటన
కాన్ బెర్రా: టీఆర్ఎస్ పార్టీ విదేశాలలో తన శాఖలను విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలలో శాఖలను నెలకొల్పిన టీఆర్ఎస్ తాజాగా ఆస్ట్రేలియా శాఖను ప్రారంభించింది. దాంతో పాటు ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలంగాణ ఎన్ఆర్ఐలతో మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, కాన్ బెర్రా శాఖలను ప్రకటించింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి ఆస్ట్రేలియా టీఆర్ఎస్ గురించి వివరించినట్లు ఆస్ట్రేలియా టీఆర్ఎస్ నేత వినోద్ ఏలేటి తెలిపారు. మద్దతుదారులందరూ టీఆర్ఎస్ ఆస్ట్రేలియాలో చేరాలని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. డిపెండెంట్ వీసా ఉన్నవారిని చేర్చుకోవద్దని తమ లీగల్ అడ్వైజర్స్ సూచించారని వెల్లడించారు. జాతీయ కోర్ కమిటీ అధ్యక్షుడు రాజేష్ గంగసాని, ఉపాధ్యక్షులు సందీప్ మునుగాల, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ పిన్నామ, సెక్రటరీ అనిదీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సుమన్ పారుపటి, ఎన్ఎస్డబ్ల్యూ స్టేట్ అధ్యక్షుడు సుమేష్ రెడ్డి, సెక్రటరీ పవన్ పాపయ్యగారి, విఐసి స్టేట్ అధ్యక్షుడు కపిల్ కట్పల్లి, సెక్రటరీ సురేన్ వంగపల్లి, ఏసీటీ స్టేట్ అధ్యక్షుడు రాజవర్ధన్ కోఠి, సెక్రటరీ రవి సాయుల, క్యూ ఎల్డీ స్టేట్ అధ్యక్షుడు రణధీర్ ఆరుట్ల, సెక్రటరీగా భరత్ కసిరెడ్డిలు నియమితులయ్యారు. సుమారు 700మందికి పైగా టిఆర్ఎస్ జాతీయ విభాగంలో చేరారు. జాతీయ కమిటీ వివరాలు మెల్బోర్న్: 1. విజయ్ రెడ్డి 2. అనీల్ దీప్ గౌడ్ 3. కపిల్ రెడ్డి 4. సురేన్ వంగపల్లి 5. బీరవెల్లి శశిధర్ రెడ్డి 6. నల్లని సతీష్ చౌదరి 7. పెద్ది శ్రీనివాస్ 8. సుమన్ పారుపాటి 9. అశోక్ బెల్లాల 10. జయపాల్ వంటేరు 11. రమేష్ తౌటిరెడ్డి 12. శేఖర్ కకునూరు 13. హరిణి పట్లోళ్ల 14. చంద్రశేఖర్ గంగసాని 15. నవీన్ గుడిమెట్ల 16. మమత పట్లోళ్ల 17. కవిత పుచ్ఛకాయల 18. రాజసింహారెడ్డి గంగసాని 19. మమత కకునూరు 20. శ్రావణి దేవిరెడ్డి 21. సాయిచరణ్ పన్నాల 22. ఆనందర్ చుక్క 23. ప్రవీణ్ నల్ల 24. శ్రీధర్ పాటిల్ 25. సుదీప్ ఆలేటి 26. ప్రీతమ్ ఏలేటి 27. వియాక్ కోలేపి 28. భరత్ గడ్డం 29. అభిజిత్ మామిడి 30. శ్రీపాల్ బొక్కా 31. సంజయ్ సేథీ 32. మహేందర్ గుర్రాల 33. చంద్రశేఖర్ దాసరి 34. అరుణ్ గుడుకుంట్ల 35. రాజేష్ గుట్ట బ్రిస్బేన్:1. రణధీర్ అరుట్ల 2. భరత్ కసిరెడ్డి 3. సందీప్ రెడ్డి 4. అంజూ రావు 5. వెంకట్ రిక్కల 6. వంశీ కృష్ణ 7. గణేష్ 8. జోసుష్ 9. శరత్ కొర్పోలు 10. అవినాశ్ పన్నాల 11. నిఖిల్ వెలుముల 12. రాజశేఖర్ బద్దం 13. రంజన్ కుమార 14. ప్రతాప్ కుమార్ 15. ఆనంద్ రెడ్డి కాన్బెర్రా: 1. వెంకట గన్రెడ్డి 2. రాజవర్ధన్ కోఠి 3. రవి సాయుల సిడ్నీ: 1. ప్రవీణ్ పిన్నమ 2. సుమేష్ రెడ్డి 3. పవన్ రెడ్డి 4. కుమార్ గుప్తా 5. రాజేష్ అర్షనపల్లి 6. నరేష్ రెడ్డి భీంరెడ్డి 7. రఘు రెడ్డి బీరం 8. రాజశేఖర్ అనంతోజు 9. వేణు ముద్దసాని 10. రాంరెడ్డి 11. కిరణ్ అల్లూరి 12. రూపా సూరం 13. విష్ణఉ చిట్యాల 14. రవి అనంతుల 15. ఓబుల్ రెడ్డి 16. సంగీత కోట్ల 17. పద్మిని చాడ 18. ప్రశాంత్ 19. రమణ ఆవుల 20. రఘు రెడ్డి 21. సందీప్ మదాడి