breaking news
trinadh
-
‘అదే నీవు అదే నేను’ మూవీ రివ్యూ
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల హీరోలుగా, ‘సిద్ధార్థ్ రాయ్’ ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అదే నీవు అదే నేను’. కొండల్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ పై గోవిందు కాండ్రేగుల నిర్మించిన ఈ మూవీ నేడు(జులై 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కొత్త జంట సాగర్ (యశ్వంత్ పెండ్యాల), శ్రీవల్లి (తన్వీ నేగి) ఓ గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతుంది. సాగర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. శ్రీవల్లి హౌస్ వైఫ్ గా ఇంటి పనులు చూసుకుంటుంది. సాగర్ తల్లి సావిత్రి (కల్పలత) వల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇలా సంతోషంగా ఉన్న శ్రీవల్లీ జీవితంలోకి కార్తీక్ అనే యువకుడు వస్తాడు.కెనడాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే కార్తీక్.. ఓ ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్ వచ్చి.. శ్రీవల్లీ ఎదురు ఫ్టాట్లోకి దిగుతాడు. తన మాట తీరుతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే కార్తీక్.. పెళ్లైన శ్రీవల్లీని బుట్టలో పడేస్తాడు. తను తప్పు చేస్తున్నానని తెలిసిన శ్రీవల్లీ..అతనికి దూరంగా ఉండలేకపోతుంది. కొన్నాళ్ల తర్వాత కార్తీక్.. పెళ్లి ప్రపోజల్ పెడతాడు. అదే సమయంలో భర్త సాగర్ గురించి ఆమెకు కొన్ని నిజాలు తెలుస్తాయి. అవేంటి? శ్రీవల్లీ తీసుకున్న తీవ్రమైన నిర్ణయం ఏంటి? అసలు కార్తీక్..వల్లీకి ఎందుకు దగ్గరయ్యాడు? అతని నేపథ్యం ఏంటి? కార్తీక్ వల్ల వల్లీ జీవితంలో వచ్చిన మలుపులు ఏంటి? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తిగా దర్శకుడు కొండల్ ఈ కథను తెరకెక్కించారు. ప్రేమ గొప్పదనాన్ని తెలియజేస్తూనే.. పెళ్లిలోని పవిత్రతను చాటి చెప్పే చిత్రమిది. శ్రీవల్లీ తన కారులో రెండు మృతదేహాలను తీసుకెళ్లే సీన్‌తో కథ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ ప్లాష్‌బ్యాక్‌లో వెళ్లి..గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యం, అటు సాఫ్ట్ వేర్ కంపెనీ ఎపిసోడ్స్ తో సరదాగా సాగుతుంది. సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో మంగళవారం పాత్రలో సూర్యతేజ, రీమిక్స్ రీల్ స్టార్ రవి క్యారెక్టర్ లో బిత్తిరి సత్తి చేసిన కామెడీ నవ్విస్తుంది. అయితే అసలు కథ ఏంటో చెప్పకపోవడంతో కొంత సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ఎందుకు పెట్టారో అర్థం కాదు. అయితే ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఫస్టాఫ్‌లో వేసిన చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా ఊహకు అందకుండా రివీల్ చేస్తూ సెకండాఫ్ ను ఆద్యంతం ఆసక్తికరంగా మార్చారు. ఫస్టాఫ్‌లో ప్రేక్షకుల్లో కలిగిన అపార్థాలన్నీ సెకండాఫ్ లో తొలగిపోతాయి. ట్విస్టులను చివరిదాక ఊహించలేరు. ఫస్టాఫ్‌ని ఇకాంస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. కమిటీ కుర్రోళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల ఈ చిత్రంలో తమ పాత్రలతో మెప్పించారు. తన్వీ నేగి తన పర్ ఫార్మెన్స్, అందంతో ఆకట్టుకుంది. కార్తీక్ గా పక్కింటి కుర్రాడి పాత్రకు టైలర్ మేడ్ అనిపించారు త్రినాథ్ వర్మ. తన్వీ నేగి ఇప్పటికే పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచితమైంది. ఈ సినిమాలో ఆమెది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అనేక లేయర్స్, షేడ్స్ ఉన్న శ్రీవల్లి పాత్రకు తన్వీ పూర్తి న్యాయం చేసింది.మరో హీరోయిన్ సహర్ కృష్ణన్ రూబీ పాత్రలో గ్లామర్ యాడ్ చేస్తూ తన పర్ ఫార్మెన్స్ తోనూ మెప్పించింది. ఫ్రెండ్ స్నేహ పాత్రలో సునయన, సావిత్రిగా కల్పలత ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కనిష్క బీజీఎం బాగుంది. పాటలు పర్వాలేదు. నిమ్మల జయపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపించింది. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ సీన్స్ ను క్రిస్ప్ గా కట్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
కథ కొత్తగా ఉంటే ఆదరిస్తారు
‘‘నాది విజయవాడ. బీటెక్ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాను. అసిస్టెంట్ రైటర్‌గా, ఘోస్ట్ రైటర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా చేశా. కొన్ని యాడ్ ఫిల్మ్స్, 5 షార్ట్స్ ఫిల్మ్స్ చేశాను. ఆ తర్వాత ‘మేకసూరి’ చిత్రానికి దర్శకత్వం వహించాను... ఇదే నా తొలి సినిమా’’ అని డైరెక్టర్ త్రినా«ద్ వెలిశిల అన్నారు. అభినయ్ రెడ్డి, సమయ జంటగా నరేష్ బైరెడ్డి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మేకసూరి’. కార్తీక్ కంచెర్ల నిర్మించిన ఈ చిత్రం జీ 5లో శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా త్రినా«ద్ వెలిశిల మాట్లాడుతూ –‘‘మోసగాళ్లకు మోసగాడు, ఒక్కక్షణం’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. ఆ తర్వాత ‘మేకసూరి’ కథను రెడీ చేసుకున్నా. ఈ చిత్రానికి నేను, కెమెరామెన్ పార్ధు సైనా కూడా నిర్మాణంలో భాగస్వాములయ్యాం. విడుదల తర్వాత చాలా మంచి స్పందన వస్తోంది. నార్త్ వారు కూడా సబ్ టైటిల్స్‌తో చూస్తున్నారు. కథ వైవిధ్యంగా ఉంటే ఎక్కడైనా ఆదరిస్తారు. మా సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఫోన్ చేసి నన్ను అభినందించడం మరచిపోలేను. కొన్ని పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి నాకు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి’’ అన్నారు. -
‘నీట్’ తెలంగాణ టాపర్ త్రినాథ్
రెండు, మూడు ర్యాంకుల్లో దీపిక, వెంకట హేమంత్ - రాష్ట్ర ర్యాంకులు ప్రకటించిన కాళోజీ నారాయణరావు వర్సిటీ - రాష్ట్రం నుంచి 26 వేల మంది అర్హత! - వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం.. సాక్షి, హైదరాబాద్: జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష ‘నీట్–2017’లో లక్కిమ్‌శెట్టి అర్నవ్ త్రినాథ్ తెలంగాణ రాష్ట్ర టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. రెండో ర్యాంకు ఎం.దీపిక, మూడో ర్యాంకు ఎ.వెంకట హేమంత్ సాధించారు. గత నెలలో ‘నీట్’ ఫలితాల ను సీబీఎస్ఈ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో త్రినాథ్ జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు, దీపిక 24వ ర్యాంకు, వెంకట హేమంత్ 32వ ర్యాంకు సాధించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి నీట్ రాసిన వారు, అందులో అర్హత సాధించిన విద్యార్థులు, వారి మార్కుల వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సీబీఎస్ఈ పంపింది. ఆదివారం రాత్రి ఈ మేరకు ఆ వివరాలను వర్సిటీ అధికారులు వెల్లడించారు. జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ 131 మార్కులు తెలంగాణ నుంచి మొత్తం 39,055 మంది ‘నీట్’ రాశారు. జనరల్ కేటగిరీలో 131 మార్కులను కట్ ఆఫ్‌గా ప్రకటించారు. 131 కంటే అధికంగా మార్కులు సాధించిన వారు 24,180 మంది ఉన్నారని వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఇక ఎస్సీ, ఎస్టీల కట్ ఆఫ్ మార్కులు 107గా సీబీఎస్ఈ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు 107 నుంచి 131 కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారు 3,586 మంది ఉన్నారు. అయితే 107–131 మార్కుల మధ్య జనరల్ కేటగిరీ వారూ కూడా ఉండొచ్చని, కాబట్టి వారిలో సగం మంది వరకు ఎస్సీ, ఎస్టీలు అర్హత సాధించి ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ ప్రకారం జనరల్, ఎస్సీ, ఎస్టీలు అందరూ కలిపి దాదాపు 26 వేల మంది వరకు రాష్ట్రం నుంచి నీట్లో అర్హత సాధించి ఉంటారని వివరించారు. అయితే ఏ కేటగిరీలో ఎవరెవరు ఎంతెంత ర్యాంకులు సాధించారన్నది తెలియడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. త్రినాథ్‌కు 685 మార్కులు రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన త్రినాథ్‌కు ‘నీట్’లో 685 మార్కులు వచ్చాయి. రెండో ర్యాంకర్ దీపికకు 681 మార్కులు, మూడో ర్యాంకర్ వెంకట హేమంత్‌కు 680 మార్కులు వచ్చాయి. నాలుగో ర్యాంకు సాధించిన ఎ.అఖిలకు కూడా 680 మార్కులు రాగా, జాతీయస్థాయిలో 32వ ర్యాంకు వచ్చింది. వారంలో నోటిఫికేషన్! నీట్లో మొత్తం 720 మార్కులకు జనరల్ కేటగిరీలో అత్యధిక మార్కులు 697. 50 శాతం పర్సంటైల్ ప్రకారం కటాఫ్ మార్కు 131. గతేడాది కటాఫ్ మార్కు 140గా ఉంది. ఈసారి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల్లో 40 శాతం పర్సంటైల్ ప్రకారం కటాఫ్ మార్కు 107గా నిర్ధారించారు. ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నింటికీ ప్రభుత్వమే ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం 3,750 ఎంబీబీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆగస్టు నెలాఖరుకు అడ్మిషన్ల ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలకు ముందు ప్రభుత్వం ఉమ్మడి కౌన్సెలింగ్‌పై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలని, ఆ తర్వాతే నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
‘మ్యూజిక్ మ్యాజిక్’ పాటలు
‘‘మన క్లాసిక్ సంగీతానికి రాక్ మ్యూజిక్‌ని మిక్స్ చేసి క్లాసిక్ రాక్ సంగీతంతో ఈ సినిమా చేశాం. కొత్త నటీనటులందరూ బాగా నటించారు. ఆరు నెలలు కష్టపడ్డాం’’ అని దర్శకుడు మంత్రాక్షర్ డీఎస్ చెప్పారు. సోహెల్, త్రినాథ్, కిమాయ, ఇర్ఫాన్ ముఖ్యతారలుగా పాల్రెడ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ‘మ్యూజిక్ మ్యాజిక్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ఆండ్రూ విడుదల చేసి, తొలిప్రతిని శ్రీకాంత్‌రెడ్డికి అందించారు. ఈ చిత్రాన్ని ఆదరించాలని నిర్మాత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా విష్ణు, సీహెచ్ కిరణ్, సందీప్‌కిషన్, దామోదర్ ప్రసాద్ తదితరులు మాట్లాడారు.


