రైలు నుంచి జారిపడి యువతి మృతి
వరంగల్ జిల్లా డొర్నకల్, ఖమ్మం జిల్లా గార్ల రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదవశాత్తూ ఇంటర్ సిటీ రైలు నుంచి జారిపడి ఓ యువతి మృతిచెందింది. యువతి పేరు లక్ష్మీప్రసన్నగా గుర్తించారు. ఆమె తీసుకున్న టికెట్‌ను బట్టి ఖమ్మం జిల్లాకు చెందిన యువతిగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.