breaking news
Traffic Management System
-
ఏఐతో ట్రాఫిక్ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫిజికల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించేందుకు వీలుగా హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్, దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అనలాగ్ ఏఐ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టేందుకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నాయి. ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అనలాగ్ ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్మాన్, మేఘా ఇంజనీరింగ్ ఎండీ పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. భాగ్యనగరంలో ట్రాఫిక్ సిగ్నళ్లను ఏఐ సాంకేతికతతో అనుసంధానించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ట్రాఫిక్ రద్దీకి, వాతావరణ మార్పులకు అనుగుణంగా సిగ్నళ్లు పనిచేసే విధానాన్ని తీసుకురావాలని కోరారు. భవిష్యత్తు తరాలకు అవసరమైన మేధోపరమైన మౌలిక సదుపాయాలు,ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాల అభివృద్ధికి అనలాగ్ ఏఐ, మేఘా ఇంజనీరింగ్ భాగస్వామ్యంలో చేస్తున్న ప్రయత్నాలను ఈ సమావేశంలో కృష్ణారెడ్డి, కిప్మాన్ సీఎంకు వివరించారు. ట్రాఫిక్ రద్దీని గుర్తించి తదనుగుణంగా నియంత్రణకు చర్యలు తీసుకోవడం, నీటి లీకేజీని గుర్తించి పైపులైన్ల మరమ్మతుల నిర్వహణకు ముందస్తు సూచనలు చేయడం, అవసరానికి అనుగుణంగా విద్యుత్ వాడకం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలకు దారి ఇవ్వడం వంటి కాగ్నిటివ్ సిటీ సదుపాయాల అభివృద్ధికి ఉన్న అవకాశాలను అనలాగ్ ఐఏ సీఈఓ కిప్మాన్ రేవంత్‌రెడ్డికి వివరించారు. నగర సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు. నగరంలో అడ్వాన్స్డ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫార్మ్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. సెన్సార్లు, రొబోటిక్స్ వంటి ఫిజికల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ పరికరాల వినియోగంతో సురక్షితమైన, సమర్థవంతమైన, వేగంగా స్పందించే నగర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణాల అవసరాలకు తగ్గట్లు ప్రభుత్వాల పనితీరు సామర్థ్యం పెంపు, పౌర సేవల మెరుగుదల, డేటా ఆధారిత మౌలిక సదుపాయాల ప్రణాళిక తయారీకి అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఎలా దోహదపడుతుందో ఇరు సంస్థల ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఎం.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్ సీఈఓ బి.అజిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఔటర్‌పై ఆధునిక సమాచార వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ రహదారిపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనదారులు ఆ మార్గంలో ట్రాఫిక్, వాతావరణం తదితర పరిస్థితులను తెలుసుకొనేందుకు వీలుగా ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్’ ఏర్పాటు కానుంది. ఔటర్‌పై 19 జంక్షన్ల (ఇంటర్ ఛేంజెస్)లో రూ.210 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనుల కోసం హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. వీటిని రెండ్రోజుల క్రితం తెరిచారు. ఎల్అండ్టీ, ఈఎఫ్‌సీఓఎన్ సంస్థల నుంచి రెండు బిడ్స్ దాఖలయ్యాయి. వీలైనంత త్వరలో సాంకేతిక ప్రక్రియను పూర్తిచేసి, రుణదాత జైకా అనుమతి తీసుకొన్నాక ఫైనాన్షియల్ బిడ్స్‌ను తెరవాలని అధికారులు నిర్ణయించారు. టెండర్ ప్రక్రియను వచ్చే 3 నెలల్లో పూర్తిచేసి 2014 నవంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డుపై 20 జంక్షన్లకు గాను 19 చోట్ల ఈ ఆధునిక సమాచార వ్యవస్థను 18 నెలల వ్యవధిలో నిర్మించి, అయిదేళ్ల పాటు నిర్వహించాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. కాంట్రాక్టు సంస్థ ఖరారయ్యాక లక్ష్యాల మేరకు పనులు జరిగితే... ఔటర్‌పై ఆధునిక సమాచార వ్యవస్థ 2016లో అందుబాటులోకి రానుంది. కళ్ల ముందే సమాచారం ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని నగరాల్లో మాత్రమే ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్’ అమల్లో ఉంది ఔటర్‌పై ఇది అందుబాటులోకి వస్తే నిర్ణీత కిలోమీటర్ల పరిధిలో తాము వెళ్లే రహదారిపై ట్రాఫిక్ స్థితిగతుల గురించి వాహనచోదకులు ముందే తెలుసుకోవచ్చు ప్రయాణించే మార్గంలో రద్దీ, రోడ్డుపై తవ్వకాలు లేదా ప్రమాదాలు, అలాగే వర్షం నీరు నిలిచినా, పొగమంచు కమ్ముకున్నా.. వెంటనే ఆ వివరాలు తెలుస్తాయి 19 జంక్షన్లలో సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్ (ఈసీబీ)లు, ఆటోమాటిక్ వెహికల్ క్లాసిఫయర్ కం కౌంటర్ (ఏబీసీసీ), వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు, లార్జ్ డిస్ప్లే స్క్రీన్, నానక్‌గూడలో ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్, కంప్యూటర్-ఎలక్ట్రానిక్-కమ్యూనికేషన్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేస్తారు ప్రతి జంక్షన్‌కు 1 కి.మీ. ముందుగానే వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డు ఉంటుంది. దీనిపై ఎప్పటికప్పుడు ఔటర్‌పై ట్రాఫిక్, రోడ్డు, వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని ప్రత్యేక ఎలక్ట్రానిక్ డిస్ప్లే ద్వారా ప్రదర్శిస్తారు. -
ఔటర్‌పై ఆధునిక సమాచార వ్యవస్థ
- ప్రయాణించే మార్గం స్థితిగతులు ముందే తెలుస్తాయ్.. - రెండు బిడ్స్ దాఖలు - రూ.210 కోట్లతో నిర్మాణం..నిర్వహణ సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ రహదారిపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనదారులు ఆ మార్గంలో ట్రాఫిక్, వాతావరణం తదితర పరిస్థితులను తెలుసుకొనేందుకు వీలుగా ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్’ ఏర్పాటు కానుంది. ఔటర్‌పై 19 జంక్షన్ల (ఇంటర్ ఛేంజెస్)లో రూ.210 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనుల కోసం హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. వీటిని రెండ్రోజుల క్రితం తెరిచారు. ఎల్అండ్టీ, ఈఎఫ్‌సీఓఎన్ సంస్థల నుంచి రెండు బిడ్స్ దాఖలయ్యాయి. వీలైనంత త్వరలో సాంకేతిక ప్రక్రియను పూర్తిచేసి, రుణదాత జైకా అనుమతి తీసుకొన్నాక ఫైనాన్షియల్ బిడ్స్‌ను తెరవాలని అధికారులు నిర్ణయించారు. టెండర్ ప్రక్రియను వచ్చే 3 నెలల్లో పూర్తిచేసి 2014 నవంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డుపై 20 జంక్షన్లకు గాను 19 చోట్ల ఈ ఈ ఆధునిక సమాచార వ్యవస్థను 18 నెలల వ్యవధిలో నిర్మించి, అయిదేళ్ల పాటు నిర్వహించాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. కాంట్రాక్టు సంస్థ ఖరారయ్యాక లక్ష్యాల మేరకు పనులు జరిగితే... ఔటర్‌పై ఆధునిక సమాచార వ్యవస్థ 2016లో అందుబాటులోకి రానుంది. కళ్ల ముందే సమాచారం ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని నగరాలలో మాత్రమే ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్’ అమల్లో ఉంది ఔటర్‌పై ఇది అందుబాటులోకి వస్తే నిర్ణీత కిలోమీటర్ల పరిధిలో తాము వెళ్లే రహదారిపై ట్రాఫిక్ స్థితిగతుల గురించి వాహనచోదకులు ముందే తెలుసుకోవచ్చుప్రయాణించే మార్గంలో రద్దీ, రోడ్డుపై తవ్వకాలు లేదా ప్రమాదాలు, అలాగే వర్షం నీరు నిలిచినా, పొగమంచు కమ్ముకున్నా.. వెంటనే ఆ వివరాలు తెలుస్తాయి 19 జంక్షన్లలో సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్ (ఈసీబీ)లు, ఆటోమాటిక్ వెహికల్ క్లాసిఫయర్ కం కౌంటర్ (ఏబీసీసీ), వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు, లార్జ్ డిస్ప్లే స్క్రీన్, నానక్‌గూడలో ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్, కంప్యూటర్-ఎలక్ట్రానిక్-కమ్యూనికేషన్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేస్తారు ప్రతి జంక్షన్‌కు 1 కి.మీ. ముందుగానే వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డు ఉంటుంది. దీనిపై ఎప్పటికప్పుడు ఔటర్‌పై ట్రాఫిక్, రోడ్డు, వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని ప్రత్యేక ఎలక్ట్రానిక్ డిస్ప్లే ద్వారా ప్రదర్శిస్తారు.


