breaking news
tourist park
-
హారర్ సఫారీ!.. చిరుత భయంకర దాడి
సాధారణంగా సఫారీ అంటే అద్భుతమైన అనుభూతి.. కానీ, బెంగళూరులోని బన్నేరుఘట్ట జాతీయ పార్కుకు వెళ్లిన ఒక చెన్నై మహిళకు మాత్రం అది భయంకరమైన పీడకలగా మిగిలిపోయింది. అడవి జంతువుల్ని చూసేందుకు ఆమె ఉత్సాహంగా సఫారీ బస్సులో ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి ఓ చిరుత ఒక్కసారిగా బస్సుపైకి దూకి, రక్షణ కోసం ఏర్పాటు చేసిన జాలీలోంచి ఆమె చేతిపై పంజా విసిరింది..బస్సుపైకి దూకిన చిరుత.. చెన్నైకి చెందిన 56 ఏళ్ల వహితా భాను అనే మహిళ గురువారం మధ్యాహ్నం 1 గంట స మయంలో బన్నేరుఘట్ట జాతీయ పార్కులో చిరుత సఫారీ ట్రిప్‌లో పాల్గొన్నారు. ఆమె కదలికలను గమనిస్తున్న చిరుత ఒక్కసారిగా బస్సు పైకప్పు పైకి లంఘించింది. అద్దం పక్కనే ఉన్న జాలీ ద్వారా లోపలికి పంజా విసిరి మహిళను గాయపరిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. బస్సుపైకి చిరుత ఎక్కి, కిటికీ గుండా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. చిరుత పంజా దాడి లో వహితా భాను చేతికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం జిగానిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.A 50-year-old woman from Chennai suffered injuries to her hand after a leopard at Bannerghatta Biological Park leapt onto a safari bus and clawed her. She was immediately rushed to a hospital in Jigani and is currently stable.Following the incident, the park authorities have… pic.twitter.com/QStkaAVBxK— India Today NE (@IndiaTodayNE) November 14, 2025 భద్రత ప్రశ్నార్థకం సాధారణంగా, జంతువులు, సందర్శకుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నివారించడానికి సఫారీ బస్సులకు కిటికీలు, ఇతర రంధ్రాలపై లోహపు వైర్ మెష్ (జాలీ) అమర్చుతారు. అయితే, ఈ చిరుత ఆ జాలీలోని చిన్న ఖాళీ గుండా లోపలికి పంజా విసిరి మహిళను రక్కగలిగింది. ‘మహిళ చేతికి గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు’.. అని ఒక అధికారి వెల్లడించారు.తాత్కాలికంగా సఫారీ నిలిపివేత గతంలో కూడా చిరుత దాడి జరిగిన నేపథ్యంలో.. బస్సుల భద్రతను పూర్తిగా అంచనా వేసే వరకు, నాన్–ఏసీ బస్సు సఫారీని నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ‘సమస్య పరిష్కారమయ్యే వరకు వాహనాల పూర్తి భద్రతను అంచనా వేస్తాం. సందర్శకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’.. అని పేర్కొన్నారు. బన్నేరుఘట్ట జాతీయ పార్కులో జరిగిన ఈ ఘటన సఫారీ వాహనాల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కనీస రక్షణ ఏర్పాట్ల విషయంలో ఏ మాత్రం చిన్న లోపం ఉన్నా.. ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ఈ సంఘటన రుజువు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టూరిస్ట్ పార్క్ కోసం స్థల పరిశీలన
హైదరాబాద్: బుద్వేల్‌కు కిలోమీటర్ దూరంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో టూరిస్టు పార్క్‌ను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి పర్యాటక, రెవెన్యూ, ప్రాజెక్టు నిర్వహణ విభాగం అధికారులు స్థల పరిశీలనసోమవారంచేశారు. ఈ జల క్రీడల వినోదాత్మక పార్క్‌లో రిసార్ట్స్, డ్రైవ్ ఇన్ థియేటర్, సీల్ స్టేడియం, రోలీ కోస్టర్, సెవెన్ డీ థియేటర్, అండర్ వాటర్ టన్నెల్ ఆక్వేరియం, ఇండోర్ స్కై డైవింగ్, మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్, స్పా, డైనోసార్ పార్కు, నీటి అడుగు భాగంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్మించనున్నారు. ఈ కొత్త ప్రాజెక్టును 30 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నగర పరిసరాల్లో టూరిజం శాఖ ఏర్పాటు చేసే పెద్ద ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. దీని బడ్జెట్ వివరాలను అధికారులు ఇంకా నిర్ణయించలేదు.


