breaking news
top gainer
-
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న ఇండస్ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రశాంతంగా ప్రారంభమైన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీలు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 73,830 వద్ద ప్రారంభమైంది. తరువాత ఆటో, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుంది.ఉదయం 9.25 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 412 పాయింట్ల లాభంతో 72,245 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 135 పాయింట్లు లాభపడి 22,533 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 5 శాతం లాభపడింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా 2 - 3 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. విస్తృత మార్కెట్లో, బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ సోమవారం ఇంట్రాడేలో 0.5 శాతం పెరిగింది. -
ప్రారంభంలో నష్టాలు.. చివర్లో లాభాలు...
ముంబై : వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వారం ఆరంభంలో వరుసగా రెండు రోజుల పాటు నష్టాలు చవి చూసిన సేర్ మార్కెట్, బక్రీద్ సెలవు దినం తర్వాత పుంజుకుంది,. దీంతో చివరి రెండు రోజుల్లో లాభాల బాట పట్టింది. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 52,967 పాయింట్లతో ప్రారంభమై వెంటనే పాయింట్లు పెంచుకుంటూ పోయింది. ఒక దశలో గరిష్టంగా 53,114 పాయింట్లకు చేరుకుంది. 53 వేల పాయింట్లకు పైనే మార్కెట్ ముగుస్తుందని అంచనా వేసినప్పటికీ చివర్లో అమ్మకాలు జోరుగా సాగడంతో చివరకు 52,975 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంగా 138 పాయింట్లు లాభపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ గురువారం 15,824 పాయింట్ల వద్ద క్లోజవగా ఈ రోజు 15,856 పాయింట్లతో ప్రారంభమైంది. మార్కెట్ ముగిసే సమయానికి 15,854 పాయింట్ల వద్ద క్లోయ్యింది. మొతంగా 30 పాయింట్లు పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, యాక్సిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జోమాటో, తైన్వాలా, అపోలో పైప్స్, ఏషియన్ హోటల్స్, జోసిల్ షేర్లు లాభపడగా ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా హిందూస్థాన్ యూనిలీవర్, త్రేఝారా సోల్యుషన్స్, వోడాఫోన్ ఐడియా, మాధవ్ కాపర్, సంభవ్ ఇన్ఫ్రా, ఇన్ఫీబీమ్ అవెన్యూ షేర్ హోల్డర్లు నష్టపోయారు. ఐపీవోలో భారీ స్థాయిలో సక్సెస్ అయిన జోమాటో షేర్లు తొలి రోజు రూ. 126 వద్ద ట్రేడ్ అయ్యాయి. మొత్తంగా మొదటి రోజే షేర్ వ్యాల్యూ 66 శాతం ఎక్కువగా పలికింది. -
మార్కెట్ లో టాప్ గెయినర్
ముంబై: మంగళవారం నాటి మార్కెట్లు ఒడిదుడుకుల మద్య ట్రేడ్ అవుతున్నాయి.