breaking news
toolywood hero
-
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై వైద్యుల తాజా అప్డేట్..
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ గురునాథ్ రెడ్డి వెల్లడించారు. ఆయన పరిస్థితిపై ఇప్పుడేం ఏం మాట్లాడాలేమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ బాగా ఎఫెక్ట్ అయినట్లు డాక్టర్ గురునాథ్ రెడ్డి తెలిపారు. అన్ని విభాగాలకు చెందిన 8 మంది వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. ఉదయం నుంచి ఇప్పటివరకు ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దయచేసి వారి కుటుంబ సభ్యులను డిస్టర్బ్ చేయవద్దని కోరారు. (చదవండి: అత్యంత విషమంగా కృష్ణ ఆరోగ్యం, ఇప్పుడే ఏం చెప్పలేం: వైద్యులు) ఆయనకు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్లో చాలా వరకు ఎఫెక్ట్ అయినట్లు వెల్లడించారు. మా దగ్గర అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలు ఉన్నాయని.. ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్లిన ఇంతకు మించి ఏమి చేయలేమని స్పష్టం చేశారు. ఆయన మా ఆస్పత్రిలోనే చాలా ఏళ్లుగా చికిత్స తీసుకుంటున్నారని గురునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన పరిస్థితిపై బులెటిన్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా.. ఆయనకు తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కావడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. -
అల్లు అర్జున్ పేరిట ఓటుకు దరఖాస్తు
సైబర్ క్రైం పోలీసులకుకలెక్టర్ సమాచారం ‘ఆన్లైన్’ దరఖాస్తుపై కేసు నమోదు వరంగల్ (పోచమ్మ మైదాన్) : ఇటీవల విడుదలైన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించిన విషయం విదితమే. ఈ మేరకు చరిత్రతో పాటు సినిమాలోనూ రాణి రుద్రమదేవికి అండగా నిలిచే ఆయనకు కాకతీయుల రాజధాని అయిన వరంగల్‌లో ఓటు హక్కు ఉండాలని అనుకున్నారో ఏమో కానీ... గుర్తు తెలియని వ్యక్తులు ఆ దిశగా ముందడుగు వేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కోసం సినీ హీరో అల్లు అర్జున్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ‘అల్లు అర్జున్, తండ్రి అరవింద్, ఇంటి నంబర్ 16-10-1452. ఖిలా వరంగల్’ చిరునామాపై దరఖాస్తు రాగా.. వరంగల్ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది గురువారం చేపట్టిన పరిశీలనలో ఈ దరఖాస్తును చూసి ఖంగుతిన్నారు. ఈ మేరకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వాకాటి కరుణకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించగా.. మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.