breaking news
today news headlines
-
సాక్షి మార్నింగ్ రౌండప్: జులై 23.. నేటి బిగ్ హెడ్‌లైన్స్ ఇవే!
సాక్షి పాఠకులకు శుభోదయం!. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం మరింత వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు కొనసాగుతుండగా.. జంతర్‌మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో ఘర్షణల్లో పలువురు సిబ్బంది గాయపడ్డారు. మరోవైపు నీట్ అంశంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇవాళ్టి మేజర్ హెడ్‌లైన్స్‌ను పరిశీలిస్తే.. ఢిల్లీలో మళ్లీ ఉద్రిక్తత.. CJP నిరసనల్లో ఘర్షణలు నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీశాయి. జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల్లో మంగళవారం రాత్రి ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. టాల్‌స్టాయ్ మార్గ్ వద్ద కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న CJP ఉద్యమం నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీపై ప్రారంభమైన CJP ఉద్యమం పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ముంబైలో అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేశారు. వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. నాగ్‌పూర్‌లోనూ నిరసనకారులను పోలీసులు తరలించారు. అనుమతించిన సమయం ముగిసిన తర్వాత కూడా ఆందోళన కొనసాగించడంతో చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నీట్ లీకేజీపై కేంద్రం–రాహుల్ మధ్య వార్నీట్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ముదిరింది. గత పదేళ్లలో 150కిపైగా పేపర్ లీక్‌లు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించగా.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. పేపర్ లీక్‌ల విషయంలో రాహుల్ గాంధీ ఎంపిక చేసుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో జరిగిన లీక్‌లను ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. నీట్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నడ్డా స్పష్టం చేశారు.ఇరాన్‌పై అమెరికా దాడులు 12వ రోజుకు.. హార్ముజ్‌పై పెరుగుతున్న టెన్షన్మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుసగా 12వ రాత్రి వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. తమపై దాడులు కొనసాగితే ప్రాంతీయ చమురు, గ్యాస్, విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.హార్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు.. చమురు సరఫరాపై ఆందోళనప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధానికి కేంద్రంగా మారింది. ఈ మార్గంలో అంతరాయం కొనసాగితే అంతర్జాతీయ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఇరాన్–అమెరికా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగితే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ స్పందిస్తూ.. తమ దేశం చమురు విక్రయించలేని పరిస్థితి వస్తే ఈ ప్రాంతంలోని మరే దేశం కూడా చమురు ఎగుమతి చేయలేదని హెచ్చరించారు.సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటననీట్ నిరసనలకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని తెలిపారు.పంచదార్లకు నో మైనింగ్ జోన్.. వైఎస్సార్సీపీ పోరాటానికి ఫలితంఅక్రమ మైనింగ్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్మపోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. పంచదార్ల ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై సమగ్ర విచారణ జరపాలని సూచించారు. మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్మెంట్, ఆపరేషన్ అనుమతులను రద్దు చేయాలని ఆదేశించారు. పంచదార్ల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పంచదార్లను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించకపోతే ఉద్యమం చేపడతామని వైఎస్సార్సీపీ గతంలో హెచ్చరించింది.సీదిరి అప్పలరాజు అరెస్ట్‌తో పలాసలో ఉద్రిక్తతవైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అప్పలరాజు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పలరాజు అరెస్ట్‌ను నిరసిస్తూ పలాసలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించాయి. మరోవైపు అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతుకలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు.తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్.. పలు జిల్లాలకు హెచ్చరికతెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.జింబాబ్వేతో టీమిండియా తొలి టీ20 నేడుఇంగ్లండ్ పర్యటన తర్వాత టీమిండియా మరో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నేడు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్న ఈ సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో తమను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సొంతగడ్డపై జింబాబ్వే కూడా టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. యువ భారత్ జోరు చూపిస్తుందా? లేదంటే జింబాబ్వే షాక్ ఇస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఈరోజు ఫోకస్లో..ఢిల్లీలో CJP నిరసనలు.. పోలీసులతో ఘర్షణలునీట్ లీకేజీపై కేంద్రం–రాహుల్ గాంధీ వార్పార్లమెంట్ సమావేశాలు.. నీట్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధం.. మంత్రి రాజీనామాకు విపక్షాల పట్టుఇరాన్పై అమెరికా 12వ రోజు దాడులుహార్ముజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలుప్రపంచ చమురు సరఫరాపై ప్రభావంసోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై కీలక పరిణామంపంచదార్ల విషయంలో ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటంమాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.. అప్డేట్స్తెలుగు రాష్ట్రాల్లో వర్షాల హెచ్చరికలుమరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్, విశ్లేషణలు, ప్రత్యేక కథనాల కోసం రోజంతా సాక్షి.కామ్‌తోనే ఉండండి. -
సాక్షి మార్నింగ్ రౌండప్ జులై 21: ఈరోజు బిగ్ హెడ్‌లైన్స్ ఇవే!
సాక్షి పాఠకులకు శుభోదయం!. ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తూ ఇరాన్‌పై అమెరికా దాడులు పదో రోజుకు చేరాయి. మరోవైపు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు, నిరసనల వేడి కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ భేటీ ఆసక్తిని రేపుతోంది. ఏపీలో గుంటూరు ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.అల్పపీడన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో మరో వారంపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్ నినో ఆందోళనలతో లోటు వర్షపాతంతో నైరుతి ప్రభావం తగ్గిందనుకున్న తరుణంలో.. అనూహ్యంగా దేశం మొత్తం దట్టంగా మేఘాలు అలుముకోవడం, వర్షాలు కురుస్తుండడం ఉన్న రైతులకు ఇది ఊరట ఇచ్చే వార్త అనే చెప్పొచ్చు.ఇరాన్ వార్ కంటిన్యూమిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుసగా పదో రోజు కూడా వైమానిక దాడులు కొనసాగించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులను అడ్డుకునే లక్ష్యంతో ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో అమెరికా సైనికులు మృతి చెందడంతో ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయని అమెరికా తెలిపింది. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్ వంటి అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని పాకిస్థాన్‌కు వెళ్లి చర్చలు జరుపుతున్నారు. యుద్ధ విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది.హార్ముజ్ జలసంధిపై ఆందోళన.. పెరుగుతున్న చమురు ధరలుప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా దాదాపు నిలిచిపోయింది. ఈ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో కలకలం రేగుతోంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 88 డాలర్లకు(అప్డేట్ అందాల్సి ఉంది) పైగా చేరింది. మరోవైపు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్ర మార్గంలో సౌదీ అరేబియా చమురు రవాణాను అడ్డుకుంటామని ప్రకటించడం కొత్త ఆందోళనకు కారణమైంది.ఢిల్లీలో కొనసాగనున్న ‘చలో సంసద్’ ఉద్రిక్తతపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజుకు చేరుకోగా.. ఢిల్లీలో నిరసనల వేడి కొనసాగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇచ్చిన ‘చలో సంసద్’ పిలుపుతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.సోమవారం జరిగిన నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. మంగళవారం కూడా పార్లమెంట్ వైపు మార్చ్ కొనసాగిస్తామని CJP నేతలు ప్రకటించారు. ఇటు నిరససకారుల దాడుల్లో 118 సిబ్బందికి గాయాలు అయ్యాయని, 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసం అయ్యాయని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పార్లమెంట్లో విపక్షాల నిరసనలునిన్న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజే వేడెక్కాయి. నీట్ లీకేజీ, అయోధ్య రామమందిర విరాళాల అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈరోజు కూడా ఈ అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఎలాగైనా మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం!ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో యూపీ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం, అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు కోరుతుండగా.. గెలుపు అవకాశాల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉండాలని అఖిలేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.గుంటూరు ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆందోళనలుగుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన దాడి ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. మహిళను వివస్త్ర చేసి దాడి చేసిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.మార్కెట్లపై ఫోకస్ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు ప్రపంచ మార్కెట్ల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు.ఈరోజు ఫోకస్లో..ఇరాన్‌పై అమెరికా దాడులు.. పదో రోజుకు చేరిన యుద్ధంహార్ముజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలుఢిల్లీలో కొనసాగనున్న ‘చలో సంసద్’ నిరసనలుపార్లమెంట్లో నీట్, అయోధ్య అంశాలపై రగడరాహుల్-అఖిలేశ్ భేటీ.. యూపీ పొత్తులపై చర్చగుంటూరు ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలుమార్కెట్లు, వాతావరణ అప్డేట్స్ -
ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా... అమెరికా నౌకలపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
-
వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్‌లో సర్వత్రా చర్చ...
-
ఇరాన్‌పై దాడులకు 5 రోజుల విరామం. చర్చలు జరుపుతున్నామన్న ట్రంప్. అదేం లేదన్న ఇరాన్
-
కూటమి ప్రభుత్వంలో దేశ డ్రగ్స్ రాజధానిగా మారిన ఏపీ
-
‘సూపర్ సిక్స్’ ఇవ్వలేమని స్పష్టంచేసిన ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలతో నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్‌లో సీఎం వెల్లడి
-
టాప్ 50 హెడ్ లైన్స్@1PM 18 June 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్@11AM 18 June 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్@8AM 18 June 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్@6PM 15 June 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్@3PM 14 June 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:45 AM 06 June 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@07:45 AM 06 June 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 8AM 01 June 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:30AM 28 May 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11AM 27 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 27 May 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11AM 26 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 26 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 25 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@8AM 24 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@11AM 14 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@3PM 01 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@9AM 30 April 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@07:30 AM 23 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45AM 16 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:30 AM 12 April 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@12:45PM 09 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@7AM 09 April 2024
-
టాప్ 30 న్యూస్@11:15AM 05 April 2024
-
మార్నింగ్ ప్రైమ్ టైం న్యూస్@11AM 05 April 2024
-
టాప్ 30 న్యూస్@07:30AM 02 April 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 10:30 AM 31 March 2024
-
నేషనల్ న్యూస్@03:45PM 29 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@03:15PM 29 March 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 10:30 AM 27 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45 AM 26 March 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 11:00 AM 22 March 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:30AM 21 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45 AM 21 March 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:15 AM 19 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:30AM 19 March 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 8:00 AM 18 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@02:30PM 13 March 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 7:30 AM 10 March 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 07 March 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 06 March 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 05 March 2024
-
టాప్ హెడ్‌లైన్స్@06:30AM 05 March 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 7:30 AM 04 March 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 04 March 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 1:30 PM 03 March 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 7:30 AM 03 March 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 03 March 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 02 March 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 11:30 AM 01 March 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 01 March 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 1:30 PM 29 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 10:30 AM 29 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 6:30 AM 29 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 6:30 AM 28 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 6:30 AM 22 February 2024
-
సాక్షి టాప్ హెడ్‌లైన్స్@06:45AM 21 February 2024
-
టాప్ హెడ్‌లైన్స్@06:30AM 20 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 6:30 AM 19 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 7:00 AM 18 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 7:00 AM 17 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 6:30 AM 16 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 6:30 AM 15 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 6:30 AM 14 February 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@6AM 13 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 6:30 AM 12 February 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 11 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 6:30 AM 10 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 6:30 AM 09 February 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 8 February 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@9PM 07 February 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్ @ 6:30 AM 07 February 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 05 February 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 02 February 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 29 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 7:30 AM 28 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 28 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 27 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 26 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 25 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 24 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@09:45AM 23 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 22 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 21 January 2024
-
ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ ఆఫర్లు
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 7:30 AM 20 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 19 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:50PM 18 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 18 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 9:30 AM 17 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 17 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@7AM 16 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 14 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 7:30 AM 13 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@5PM 12 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 12 January 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@09:45AM 12 January 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@09:45AM 11 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 10 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 08 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 07 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 06 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 05 January 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 05 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 1:30 PM 04 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 04 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 03 January 2024
-
టాప్ హెడ్‌లైన్స్@10:30AM 02 January 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@07:45AM 02 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 1:30 PM 01 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 11:30 AM 01 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 7:30 AM 01 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 01 January 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 10:30 AM 31 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 31 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 1:30 PM 30 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 11:30 AM 30 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 30 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@4PM 29 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 29 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:45PM 28 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 1:30 PM 28 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 9:30 AM 28 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 28 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 11:30 AM 27 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 27 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@4PM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@01:45PM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:45AM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10AM 26 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 7:30 AM 25 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 25 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 11:30 AM 24 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 24 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 9:30 AM 23 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 23 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@3PM 22 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 1:30 PM 22 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 11:30 AM 22 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 9:30 AM 22 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 22 December 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 9:30 AM 21 December 2023


