breaking news
today and tommorow
-
రీ-నీట్ హాల్ టికెట్లు: ఏ క్షణమైనా లింక్ యాక్టివ్
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) రీ-ఎగ్జామ్ హాల్ టికెట్ల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు, జూన్ 14, 2026న రీ-నీట్ అడ్మిట్ కార్డలను అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in లో విడుదల చేయనుంది. జూన్ 21న జరగబోయే ఈ ప్రతిష్టాత్మక పరీక్ష కోసం అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలను సిద్ధం ఉంచుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష హాల్లోకి అనుమతించాలంటే అడ్మిట్ కార్డ్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరి.పరీక్ష సమయంలో మార్పులు.. మారిన నిబంధనలురీ-నీట్ పరీక్ష విధానంలో ఎన్టీఏ కొన్ని కీలక మార్పులు చేసింది. విద్యార్థులకు ఊరటనిస్తూ పరీక్ష సమయాన్ని 195 నిమిషాలకు పెంచింది. జూన్ 21న మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ పొడిగించిన సమయంలోనే తప్పనిసరి అధికారిక ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే రఫ్ వర్క్ చేసుకునేందుకు గతంలో ఇచ్చిన 2 పేజీల స్థానంలో ఈసారి 4 పేజీలను కేటాయించారు. క్వశ్చన్ బుక్లెట్ ప్రారంభంలో రెండు, చివర్లో రెండు పేజీలను ఉంచుతారు. ఈ సదుపాయం తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల పేపర్లలోనూ అందుబాటులో ఉంటుంది.హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండిలా..అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ను సులువుగా డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inని సందర్శించాలి. హోంపేజీలో కనిపించే 'NEET Re-Exam Admit Card 2026' లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ నంబర్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. స్క్రీన్‌పై కనిపించే అడ్మిట్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోవాలి. హాల్ టికెట్లు పోస్ట్ ద్వారా పంపరు. అడ్మిట్ కార్డ్‌పై ఉన్న పేరు, రోల్ నంబర్, పరీక్ష కేంద్రం, ఫోటో, సంతకం వంటి వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులుంటే వెంటనే అధికారులను సంప్రదించాలని ఎన్టీఏ తెలిపింది.నెగెటివ్ మార్కింగ్ జాగ్రత్త.. లీక్ వార్తలపై క్లారిటీఈ పరీక్ష మొత్తం 720 మార్కులకు జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీల నుండి 45 చొప్పున, బయాలజీ నుండి 90 చొప్పున మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి +4 మార్కులు లభిస్తాయి. తప్పు సమాధానానికి -1 మార్కు కట్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మరోవైపు, సోషల్ మీడియాలో రీ-నీట్ పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న వార్తలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. టెలిగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల్లో తిరుగుతున్న ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, అభ్యర్థులు ఇలాంటి వదంతులను నమ్మవద్దని స్పష్టం చేసింది. -
ప్రణతి ప్రణతి.. ప్రణవనాద జలధికి..
నాలుగు చినుకులు నెత్తిన పడగానే మేని పులకిస్తుంది. మనసంతా ఆహ్లాదంతో నిండిపోతుంది. నిస్సత్తువ పటాపంచలవుతుంది. ఎక్కడా లేని కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. పంచభూతాల్లో ఒకటైన నీటికి ఉన్న మహత్మ్యం అది. అందుకే.. గోదారి గంగమ్మను భక్త జనమంతా జలదేవతగా ఆరాధిస్తారు. నెత్తిన నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకుంటారు. అంతటి విశిష్టత గల గోదారమ్మకు అంత్య పుష్కర వేళ భక్తులంతా ప్రణతులర్పిస్తున్నారు. పాపాలను బాపే ఆ అమ్మను సేవించి తరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి అంత్య పుష్కరాల జోరు కొనసాగుతోంది. పదో రోజున కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. అంత్య పుష్కర ఘట్టం చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఒడిశాలోని కటక్, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని, షాజాపూర్ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో కొవ్వూరు చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించారు. రోజంతా ఇక్కడే ఉండి.. గోదావరి గట్టున వంటలు చేసుకుని ఆరగించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో మంగళవారం సుమారు 20 వేల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. వరద ఉధృతి కొనసాగడంతో గోష్పాద క్షేత్రంలోని మొదటి రెండు ఘాట్లలో భక్తులను స్నానాలకు అనుమతించలేదు. తాళ్లపూడిలోని ఘాట్లలో సగానికి పైగా ముంపులో ఉన్నాయి. కేవలం మూడు మెట్లు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. రేవుల్లో ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు మునిగిపోయాయి. ఘాట్ల వద్ద కేవలం ఒక్కొక్క పడవను మాత్రమే ఉంచారు. పట్టిసీమ, పోలవరం, గూటాల పుష్కర ఘాట్లలోనూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పట్టిసీమ ఘాట్‌లో విజయనగరం జిల్లా భక్తులు పుష్కర స్నానం చేశారు. సాయంత్రం గోదావరి మాతకు హారతి ఇచ్చారు. నరసాపురానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కోడేరు పుష్కరఘాట్‌లో భక్తులు పెద్దఎత్తున పుణ్యస్నానాలు చేశారు. కరుగోరుమిల్లి పుష్కరఘాట్ మంగళవారం కూడా వరద గుప్పెట్లోనే ఉండటంతో పుష్కర స్నానాలను అధికారులు నిలిపివేశారు. కేదారీ ఘాట్‌లో పుష్కర స్నానాలు చేసి పెనుగొండలో వాసవీ మాతను దర్శనం చేసుకుని వెళుతున్నారు. పోలీసులు కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లిపోవడంతో ఘాట్ల వద్ద బందోబస్తు లేదు. చివరి రెండు రోజులైనా పోలీసులను ఏర్పాటుచేయాలని ఘాట్ అధికారులు కోరుతున్నారు. కాగా, పారిశుధ్య సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి వసతి, భోజన సదుపాయాలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకాకపోవడంతో ఆయా శాఖల అధికారులు అవస్థలు పడుతున్నారు.


