తిరుమలకు నిలిచిన వాహనాలు
తిరుపతి: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ పిలుపు మేరకు తిరుమతిలో మంగళవారం బంద్ కొనసాగుతోంది. రహదారుల దిగ్బంధంలో భాగంగా తిరుమల రోడ్డును కూడా అడ్డుకున్నారు. తిరుమలకు ఆర్టీసీ, ప్రయివేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించే అవకాశం లేదని నిర్వాహకులు తెలిపారు.
తిరుమలకు 38 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఆగస్టు 13వ తేదీన వాహనాల రాకపోకల బంద్ నిర్వహించారు. మరోసారి గత నెల 23, 24 తేదీల్లో తిరుమలకు వాహనాలను నిలిపివేయాలని ప్రయత్నించినా, టీటీడీ అధికారుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. బంద్ ప్రభావంతో తిరుమలలో తిరుగు ప్రయాణానికి వేలాదిమంది భక్తులు వేసి ఉన్నారు.