breaking news
tighten
-
గాంధీ భవన్‌కు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌కు భద్రతను పెంచారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ చర్యలకు దిగినట్లు.. అందుకు కేబినెట్ విస్తరణే కారణమన్నట్లు సమాచారం. ఆశించిన వారు పదవి దక్కకపోతే తమ వర్గీయులతో ఆందోళనకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. -
కఠినంగా ఉన్నందునే..
సజావుగా సమావేశాలు: హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: శాసనసభలో కఠినంగా వ్యవహరించినందుకే సమావేశాలు సజావుగా, సంతృప్తికరంగా జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ దశాదిశను నిర్దేశించే విధంగా ఈ సమావేశాలు పూర్తి సంతృప్తికరంగా జరిగాయన్నారు. ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నా అన్ని పార్టీలతోనూ సంప్రదించిన తర్వాతనే నిర్ణయాలను తీసుకున్నామన్నారు. అన్ని పక్షాల నేతలతో స్వయంగా మాట్లాడి, ఆయా పార్టీల సభ్యులను సమన్వయం చేసుకుని శాసనసభలో వ్యవహరించామని హరీశ్ చెప్పారు. చిన్నచిన్న గొడవలకే గత ప్రభుత్వాలు శాసనసభను వాయిదా వేసేవని ఆరోపించారు. ఈ సమావేశాల్లో కొంత కఠినంగా వ్యవహరించడం వల్లనే పోడియం దగ్గరకు వెళ్లే సభ్యుల సంఖ్య తగ్గిందన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కొన్ని పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కొంత కఠినంగా వ్యవహరించినామని మంత్రి చెప్పారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా రా్రష్ట్ర ద్రోహానికి పాల్పడే కొన్ని పార్టీల సభ్యులను సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు. దీనివల్లనే అనేక సమస్యలు చర్చకు వచ్చాయని, ఎంతోమంది కొత్త సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కిందన్నారు. గతంలో అయిదేళ్లు కూడా నోరువిప్పని సభ్యులున్నారని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు కోరిన అంశాలపైనా సావధాన తీర్మానం సందర్భంగా చర్చించామని హరీశ్‌రావు వివరించారు. కొన్ని ప్రభుత్వమే ప్రకటనలు చేయంగా, ప్రతిపక్షాలు కోరిన అంశాలపైనా సుదీర్ఘంగా చర్చలు జరిపామన్నారు. 1996 తర్వాత పద్దులపై ఇంత చర్చ జరగడం ఇదే తొలిసారని చెప్పారు. చర్చలు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రతిపక్ష సభ్యులు కూడా చెప్పే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు జరిగాయన్నారు. సంక్షేమంపై 7.27 గంటలపాటు చర్చలు జరిపామంటే దానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చునన్నారు.