breaking news
tiger reserves project
-
కవ్వాల్‌లో పులుల సంరక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీశాఖ సమగ్రాభివృద్ధికి సంబంధించి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా)నుంచి ఐదేళ్ల కాలానికి గాను రూ.1,270 కోట్ల విలువైన సాఫ్ట్ లోన్లు (అతి తక్కువ వడ్డీ లేదా వడ్డీ రహిత) ఈ ఏడాది డిసెంబర్లో అందుబాటులోకి రానున్నట్టు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్–హేచ్వోఎఫ్ఎఫ్) వినయ్‌కుమార్ వెల్లడించారు.రాష్ట్రంలో అటవీ రంగ ఆధునీకరణ, పర్యావరణ సమతుల్యత పరిరక్షణలో ఈ అంతర్జాతీయ సహాయం ఎంతో కీలకమని తెలిపారు. ఇందులో భాగంగా ఎకో టూరిజం అభివృద్ధి, టైగర్ రిజర్వ్‌ల బలోపేతం, వన్యప్రాణి సంరక్షణ, పట్టణ అటవీ అభివృద్ధి, క్షీణించిన అడవుల పునరుద్ధరణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ వంటి కీలక పనులపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తామని పేర్కొన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అటవీ శాఖకు సంబంధించిన పలు ప్రాధాన్యత అంశాలను వినయ్‌కుమార్ వివరించారు.ఎకో టూరిజంరాష్ట్రంలోని ఆరు సర్క్యూట్లలో చేపడుతున్న ఎకో టూరిజం (ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణులకు హాని కలిగించని పర్యాటకం) ప్రాజెక్లులు వచ్చే అయిదేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. మొత్తం రూ.495 కోట్ల వ్యయంతో పనులు చేపడుతుండగా, వీటికి సంబంధించి మంజూర్లు కూడా లభించాయి. అంతేకాకుండా అటవీశాఖ, అటవీ, పర్యాటకాభివృద్ధి సంస్థలు ఇతర విభాగాలతో కలిసి సంయుక్తంగా రూ.900 కోట్ల విలువైన ‘షెల్ఫ్ ఆఫ్ వర్క్స్’ (వివిధ రకాల పనులు) చేపడుతున్నాం.కవ్వాల్‌లో పులుల సంరక్షణకవ్వాల్ పులుల సంరక్షణకు మంచి అవకాశాలున్న ప్రాంతం. అడవులు బాగున్నంత మాత్రాన అక్కడ పులులు స్థిరంగా నివసిస్తాయని చెప్పలేం. సరిపడా ఆహార జంతువులు, సురక్షితమైన సంతానోత్పత్తి ప్రాంతాలు, అడవుల మధ్య అనుసంధానం, వేట నిరోధక చర్యలు అవసరం. 2027 మార్చి కల్లా ఒక మగ, రెండు ఆడ పులుల జతతో కూడిన మొదటి బ్యాచ్ మహారాష్ట్ర నుంచి కవ్వాల్కు చేరే అవకాశాలున్నాయి. కవ్వాల్కు పులులను తీసుకురావడం మాత్రమే కాదు.. అవి అక్కడ మనుగడ సాగించి, సంతానోత్పత్తి చేసి, శాశ్వత జనాభాగా ఎదిగేలా చూడటమే మా లక్ష్యం.మనుషులు– వన్యప్రాణుల ఘర్షణరైతుల జీవనోపాధిని కాపాడుతూనే వన్యప్రాణులను రక్షించడమనేది చాలా క్లిష్టమైన అంశం. మనుషుల ప్రాణాలు, వన్యప్రాణుల మనుగడ రెండూ ముఖ్యమే. జంతువుల కదలికలను పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, వేగంగా స్పందించే బృందాలను సిద్ధంగా ఉంచడం, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేయడం ద్వారా ఘర్షణలను తగ్గించవచ్చు. వన్యప్రాణులతో నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందాలి. పంటలు, పశువులకు నష్టం జరిగినప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా సకాలంలో అందాలి. అడవుల్లో ఆహారం, నీరు, సురక్షిత సంచార మార్గాలు మెరుగుపడితే జంతువులు జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.ఇదీ చదవండి: కూరగాయల ధరలు కుతకుతటైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రతిపాదనరాష్ట్రంలో నక్సలైట్ల బెడద పూర్తిగా తొలగిపోయినందున..త్వరలోనే ఆ కార్యకలాపాల్లో నిష్ణాతులైన ‘గ్రేహుండ్స్’కు చెందిన రెండు బృందాలను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లలో ‘టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్’ల రూపంలో నియమించాలని చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు పంపించిన ప్రతిపాదనలపై సానుకూల స్పందన లభించింది.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులులుఅమ్రాబాద్లో పులుల సంరక్షణ, సంఖ్య పెరగడం అనేది ఒక్క అధికారి లేదా ఒక్క ఏడాదిలో సాధించిన విజయం కాదు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న సమష్టి కృషి ఫలితం. పులుల సంరక్షణ అంటే ప్రధానంగా వాటి ఆవాసాలను కాపాడటమే. అడవులు ఆరోగ్యంగా ఉండటం, పులులకు సరిపడా ఆహారంగా ఉపయోగపడే జంతువులు ఉండటం, నీటి లభ్యత, వేట నిరోధక చర్యలు, మానవ సంచారం వల్ల కలిగే ఇబ్బందుల తగ్గింపు కీలకం. చెంచు గిరిజనుల భాగస్వామ్యం కూడా ముఖ్యమైనది.ఇదీ చదవండి: తెలుగు యువకుడి బుకింగ్ రైడ్ యాప్రాష్ట్ర పక్షి పాలపిట్ట పరిరక్షణ తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట వేగంగా అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో, ఇతర చోట్ల కలిసి రెండువేల పిట్టలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి. వీటి పరిరక్షణలో భాగంగా.. కొత్త సంతానాన్ని లేదా జాతులను ఉత్పత్తి చేసేందుకు (బ్రీడింగ్) డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కి ప్రతిపాదనలు పంపించాం. ‘టైగర్ రీ ఇంట్రడక్షన్’ మాదిరిగానే పాలపిట్ట పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. అక్రమ విద్యుదీకరణ, వన్యప్రాణుల వేటకంచెలకు అక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం వన్యప్రాణులకే కాదు.. రైతులు, గ్రామస్తులు, అటవీ సిబ్బందికి కూడా ప్రాణాంతకమైన ముప్పు. పోలీసులు, విద్యుత్ శాఖతో కలిసి సంయుక్త తనిఖీలు నిర్వహించడం, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం, నిఘా పెంచడం, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నాం.అటవీ సిబ్బందికి ఆయుధాలుఅటవీశాఖ ఉద్యోగులు, సిబ్బందిపై జరిగే దాడులు మా శాఖపై జరిగే దాడిగానే పరిగణిస్తాం. గత ఐదేళ్లలో 50కి పైగా దాడుల్లో 65 మంది గాయపడ్డారు. ఇద్దరు చనిపోయారు. అటవీ సంపద, వన్యప్రాణులను కాపాడే ఫారెస్ట్ గార్డులకు తగిన భద్రత, శిక్షణ, పరికరాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. ఈ నేపథ్యంలో ఇతర యూనిఫామ్ సర్వీసెస్ మాదిరిగానే ఆయుధాలు, అవసరమైన సామాగ్రి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాం.సిబ్బంది కొరతఅటవీ రక్షణకు మానవ వనరులే వెన్నెముక. డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లు, ఉపగ్రహ నిఘా వంటి ఆధునిక సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసే ఫారెస్ట్ గార్డుకు ప్రత్యామ్నాయం లేదు. ప్రస్తుతం సిబ్బంది కొరత వల్ల గస్తీ, వన్యప్రాణుల పర్యవేక్షణ, అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితులకు స్పందించడం వంటి పనులపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా సమస్యాత్మక, సున్నితమైన అటవీ ప్రాంతాల్లో తగినంత మంది సిబ్బందిని నియమించాలి. 1,516 మంది సిబ్బంది నియామకానికి ప్రభుత్వ ఆమోదం లభించింది. ఇదీ చదవండి: భూభారతి.. నత్తనడక!అటవీ భూముల ఆక్రమణల నిరోధంఅటవీ భూములు కోల్పోతే వాటిని తిరిగి పునరుద్ధరించడం చాలా కష్టం. అందుకే ఆక్రమణలను అరికట్టడం అత్యంత ముఖ్యం. అటవీ సరిహద్దుల గుర్తింపు, డిజిటల్ భూ రికార్డులు, జీఐఎస్ ఆధారిత మ్యాపింగ్, క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలి. పీసీసీఎఫ్‌గా ప్రాధాన్యాలుఅటవీ శాఖను మరింత జవాబుదారీగా, పారదర్శకంగా, క్షేత్రస్థాయికి చేరువగా తీర్చిదిద్దడం నా మొదటి ప్రాధాన్యం. శాస్త్రీయ పద్ధతుల్లో వన్యప్రాణుల సంరక్షణ, స్థానిక ప్రజల భాగస్వామ్యం, అమ్రాబాద్ పులుల అభయారణ్యం మరింత బలోపేతం, కవ్వాల్ అటవీ ప్రాంతాన్ని పులుల స్థిర నివాసానికి అనువుగా తీర్చిదిద్దడం, వన్యప్రాణుల సంచార మార్గాలను కాపాడటం, అరుదైన జీవజాతుల సంరక్షణ, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి పెడతా. -
దేశంలో పులుల సంఖ్య వెల్లడించిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 2,967 పులులు ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. గత నాలుగేళ్లతో పోలీస్తే.. దేశంలో పులుల సంఖ్య 700 పెరిందన్నారు. ప్రతి ఏటా జులై 29ని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పులులను సంరక్షించడం, వాటి సంఖ్యను పెంచడం వంటి అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న పులుల సంఖ్య ప్రధాని మోదీ సోమవారం తెలిపారు. ‘‘దేశంలో పులుల సంఖ్య విపరీతంగా పెరిగింది. నాలుగేళ్లలో 700 పులులు పెరిగాయి. మొత్తం 2,967 పులులతో ఇండియా పులులకు అత్యంత ఆవాసయోగ్యమైన దేశం మనది.’అని అన్నారు. పులుల సంఖ్య తెలుసుకునేందుకు, వాటి వివరాలు సేకరించేందుకు అతి పెద్ద కార్యక్రమం చేపట్టి, విజయంవంతంగా పూర్తిచేశామన్న మోదీ... పులుల సంఖ్య పెరగడం ప్రతీ భారతీయుడికీ ఆనందం కలిగించే అంశం అన్నారు. 2022 కల్లా పులుల సంఖ్యను రెట్టింపు చెయ్యాలని 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒప్పందానికి అనుగుణంగా ప్రపంచ దేశాలన్ని చర్యలు చేపట్టాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పులుల సంఖ్యను పెంచేందుకు ఇదివరకే ప్రణాళికలను మొదలుపెట్టింది. -
కొత్తజిల్లాకు తలమానికం నల్లమల
నాగర్‌కర్నూల్ జిల్లాకు అతిపెద్ద టైగర్ రిజర్వు ప్రాజెక్టు అచ్చంపేట, కొల్లాపూర్‌లో అధిక విస్తీర్ణం భూమి అరుదైన జంతువులతో పాటు ఔషధ మొక్కలు జాలువారే జలపాతాల సోయగాలు.. పచ్చదనంతో కనువిందు చేసే గిరులు, కొండల మధ్య ప్రవహించే కృష్ణమ్మ, నదిలో మత్య్సకారుల చేపల వేట, పక్షుల రాగాలు.. వన్యప్రాణుల అరుపులు.. చూపరులను ఇట్టే ఆకట్టుకునే అందాలు.. ఇలా ఎన్నో ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం నల్లమల సొంతం. ప్రస్తుతం కొత్త జిల్లాకు నల్లమల తలమానికం కానుంది. దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు జిల్లాల పునర్విభజనలో నాగర్‌కర్నూల్ జిల్లాలోకి రానుంది. – అచ్చంపేట టైగర్ ప్రాజెక్టు అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో 2,484 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నల్లమల అడవి విస్తరించి ఉంది. ఇందులో 1750చదరపు కి.మీ. విస్తీర్ణాన్ని కోర్ ఏరియాగా, 445చదరపు కి.మీ.లలో బంపర్ ఏరియాగా, 289.47చదరపు కి.మీ.ల విస్తీర్ణాన్ని రిజర్వు ఫారెస్టుగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలో అచ్చంపేట, నాగార్జునసాగర్ అటవీశాఖ సబ్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో అచ్చంపేట సబ్‌డివిజన్ ఈ జిల్లాలో ఉండబోతుంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం(ఎన్టీసీఏ)పరిధిలో ఉన్న 44 టైగర్ ప్రాజెక్టుల అభయారణ్యల్లో ఇదీ ఒక్కటి. రాష్ట్ర విభజనలో నాగార్జునసాగర్–శ్రీశైలం రాజీవ్ టైగర్ ప్రాజెక్టును నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రవాహిస్తున్న కృష్ణానది ఎడమ వైపు తెలంగాణ, కుడివైపు ఆంద్రప్రదేశ్‌కు కేటాయించారు. ఇదీ మొత్తం ఇప్పుడు నాగర్‌కర్నూల్‌కు రావడంతో ఇక్కడి వనరులు ఉపయోగించుకొనే అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణ అటవీ పరిధిలో 15–20 వరకు పెద్ద పులులు ఉంటాయన్నది అధికారులు లెక్కలు. వివిధ రకాల వన్యప్రాణులకు నిలయంగా మారిన అభయారణ్యంలో పెద్దపులులు, చిరుతపులులు, జింకలు, ఎలుగుబంట్లు, రేసులు, లేళ్లు, దుప్పులు, కుందేళ్లు, నెమళ్లు,అడవిపందులు, అడవికుక్కలు, వంటి అనేక జంతువులు పక్షులు సేదతీరుతున్నాయి. ప్రపంచంలోనే అరుదైన 800ల రకాల ఔషధ, అలంకార మొక్కలు ఇక్కడ లభ్యమవుతాయి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో కొనసాగుతున్న టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయం అచ్చంపేటలో ఏర్పాటు చేయాల్సి ఉన్న ఇంత వరకు ఏర్పాటుకు నోచుకోలేదు. జలవిద్యుత్ కేంద్రం.. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు భూగర్భ పవర్‌హౌస్‡నాగర్‌కర్నూల్ జిల్లాలోకి రానుంది. భూగర్భ పవర్ హౌస్‌లోని రివర్స్‌బుల్ పంపుల ద్వారా నీటిని వెనక్కి తొక్కి కేంద్రంలోని ఆరు జనరేటర్ల ద్వారా 900మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిని చేసే సామర్థ్యం ఉంది. ఈగలపెంట జెన్కో శక్తి సదన్‌లో తెలంగాణ జలవిద్యుత్ కేంద్రాల ముఖ్య ఇంజనీర్ కార్యాలయం కొనసాగుతోంది. ఈశక్తి సదన్ నుంచి జెన్కో జలవిద్యుత్ కేంద్రాల పని తీరు, కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాల్వపైన ఉన్న 60 మెగావాట్లు కేంద్రం, సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రంలోని 815.6మెగావాట్లు, నిర్మాణంలో ఉన్న పులిచింతల 90 మెగావాట్లు, జూరాల ఎగువ, దిగువ 240 మెగావాట్ల కేంద్రాల పరిపాలన ఇక్కడి నుంచే సాగుతుంది. – కొత్త జిల్లాకు ఏపీ సరిహద్దు కలవనుంది. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిలో ఎడమగట్టు పాతాళగంగ వద్ద శ్రీశైలం డ్యాం దిగువ భాగంలో వారధిగా ఉన్న బ్రిడ్జి అవతల ఏపీ సరిహద్దు ఉంది. ఇదీ కొత్త జిల్లా నాగర్‌కర్నూల్ పరిధిలోకి వస్తోంది. జాతీయ రహదారి.. హైదరాబాద్–శ్రీశైలం–తోకపల్లి (దోర్నాల, నంద్యాల) 280 కిలోమీటర్ల జాతీయ రహదారిలో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోకి కడ్తాల్ నుంచి పాతాళగంగ వరకు సుమారు 175 కిలోమీటర్ల రహదారి ఉంటుంది. హైదరాబాద్ నుంచి మన్ననూర్ కుంచోనిమూల వరకు త్రీ వే రోడ్డు పనులు పూర్తయ్యాయి. డిండి ప్రాజెక్టు వద్ద బ్రిడ్జి పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. మన్ననూర్–తోకపల్లి వరకు రోడ్డు విస్తరణ కొనసాగితే కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.


