దేశంలో పులుల సంఖ్య వెల్లడించిన మోదీ

PM Modi Releases Tiger Census Report In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 2,967 పులులు ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. గత నాలుగేళ్లతో పోలీస్తే.. దేశంలో పులుల సంఖ్య 700 పెరిందన్నారు. ప్రతి ఏటా జులై 29ని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పులులను సంరక్షించడం, వాటి సంఖ్యను పెంచడం వంటి అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న పులుల  సంఖ్య ప్రధాని మోదీ సోమవారం తెలిపారు. ‘‘దేశంలో పులుల సంఖ్య విపరీతంగా పెరిగింది. నాలుగేళ్లలో 700 పులులు పెరిగాయి. మొత్తం 2,967 పులులతో ఇండియా పులులకు అత్యంత ఆవాసయోగ్యమైన దేశం మనది.’అని అన్నారు.

పులుల సంఖ్య తెలుసుకునేందుకు, వాటి వివరాలు సేకరించేందుకు అతి పెద్ద కార్యక్రమం చేపట్టి, విజయంవంతంగా పూర్తిచేశామన్న మోదీ... పులుల సంఖ్య పెరగడం ప్రతీ భారతీయుడికీ ఆనందం కలిగించే అంశం అన్నారు. 2022 కల్లా పులుల సంఖ్యను రెట్టింపు చెయ్యాలని 2010లో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒప్పందానికి అనుగుణంగా ప్రపంచ దేశాలన్ని చర్యలు చేపట్టాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పులుల సంఖ్యను పెంచేందుకు ఇదివరకే ప్రణాళికలను మొదలుపెట్టింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top