breaking news
tiger found
-
నేరస్థుల కోసం వెళ్తే పులి ప్రత్యక్షం
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లాలోని రుషికొండలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఓ కేసు దర్యాప్తుకు సంబంధించి పోలీసులు రుషికొండలోని లేఔట్ కు వెళ్లారు. నిందితుల కోసం అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులకు నేరస్థులకు బదులు పులి కదలికలు కనిపించాయి. ఫుటేజ్‌లో కనిపించిన పులి ఆహారం కోసం పరిసరాలలో వెతుకులాడుతున్నట్టు పోలీసులు గుర్తించి వెనుదిరిగారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం గాలిస్తున్నారు. -
బెజ్జూరులో పెద్దపులి సంచారం
ఆసిఫాబాద్: జిల్లాలోని బెజ్జూరు మండలం గొల్లబావి గ్రామ శివారులో పెద్ద పులి సంచరిస్తుందనే వార్త ధావానంలా పాకడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. తెల్లవారుజామున వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్న రైతులు పులిని చూసినట్లు గ్రామస్థులకు తెలపడంతో.. వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అటవీ అధికారులకు సమాచారం అందించారు.